Go to full page →

3 వ అధ్యాయము - ఎప్పుడు ఈ సంఘటనలు జరుగును LDETel 20

మీ రాకడ సమయము ఎప్పుడని శిష్యులు క్రీస్తును అడిగెను LDETel 20

చాలామంది ప్రజల వినికిడిలో క్రీస్తుమాట్లాడేను, [మత్తయి 24:2] ఆయన ఒంటరిగా ఒలీవ కొండ మీద కుర్చిని ఉన్నప్పుడు పేతురు, యోహాను, యాకోబు మరియు ఆంద్రీయ వచ్చి, ఎప్పుడు ఇది జరుగుతుంది? నీ రాకడకును, ఈ యుగసమాప్తికి సూచనలేవి? మాతో చెప్పమని వారు అడిగిరి. LDETel 20.1

యెరూషలేము నాశనము గూర్చి ప్రత్యక్షముగా దానిని వేరుచేసి కేవలం ఆయన రెండవ రాకడను గూర్చియేసు తన శిష్యులకు సమాధానం ఇవ్వలేదు. ఆయన ఈ రెండు సంఘటనలు ఆయన మిళితం చేసి వివరముగా చెప్పెను. ఆయన చూస్తున్నట్టుగా భవిష్యత్ సంఘటనలు ఆయన వివరించి ఉంటే వారు ఆ దృష్టిని తట్టుకోగలిగేవారుకారు వారిపై జాలి చేత ఆయన ఈ రెండు గొప్ప సంభవాల వివరణను కలగలిపి చేప్పి వాటి భావాన్ని వారే అద్యయనం చేసి తెలుసుకోడానికి విడిచిపెట్టాడు. యుగయుగాల ఆకాంక్ష 628 (1898) LDETel 20.2

క్రీస్తు రాకడ సమయము తెలియదు LDETel 20

ఎడ్వెంటిస్టులుగా పిలవబడినవారిలో చాలా మంది సమయాన్ని లెక్కించి క్రీస్తు రాకను గూర్చి అంచనా వేస్తున్నారు, ఒక సమయము తర్వాత మరో సమయము లెక్కలుక ట్టుచునేవున్నారు. కానీ మరల మరల చేసినప్పటికిని ఇక చివరికి తెలిన ఫలితం వైపల్యాలమే, మన ప్రభు రాకడ నిశ్చయమని ప్రకటించబడినది అయితే అది మానవునికి అందని కనుపాప దూరమునవున్నది. ఎవరైతే రక్షణకు వారసులగు చుఉన్నారో వారికి సేవచేస్తున్న దేవదూతలు సహితము ఆ రోజుగాని లేదా ఆగడియగాని తెలియదు. ఏ మనుష్యుడును పరలోకమందున్న దేవదూతలైనను“ఆ దినమునను అ గడియను ఎరగరు తండ్రి మాత్రమే ఎరుగును. -సంఘమునకు ఉపదేశములు 4: 307 (1879) LDETel 20.3

పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు లేదా క్రీస్తు రాకడగూర్చి ఖచ్చితమైన సమయము మనకు తెలియదు....దేవుడు ఎందుకు మనకి ఈ జ్ఞానాన్ని ఇవ్వలేదు? ఒక వేళ ఇచ్చినను అది మనము సరిగా ఉపయోగించలేము. సంఘటన యొక్క పరిస్థితిని బట్టి వచ్చిన ప్రబావము కేవలం ఈ జ్ఞానము వల్లనే కలుగుతుంది. అయితే రాబోయే మహా దినమున నిలబడటానికి మనషులుసు సిద్ధము చేయటకు బదులు దేవుని పనిని ప్రజలు మద్య కొనసాగకుండ గొప్ప ఆటంకముగా నిలుస్తున్నాము,మనము సమయము గూర్చిన ఉత్సాహం మీద బ్రతటలేదు. ఆయన ఒకటి, రెండు లేదా ఐదు సంవత్సరాలలో రాబోవుచున్నారని మీరు చెప్పలేరు, అలాగే అది పది లేదా ఇరవై సంవత్సరాలు పట్టునని చెప్పడం ద్వారా అతని రాకడను ఆపలేము. .- ది రివ్యూ అండ్ హెరాల్డ్, మార్చి 22, 1892. LDETel 20.4

దేవుని యొక్క మహా దినమునకు మనము సమిపిస్తున్నాము. సూచనలు నెరవేరుచున్నవి. క్రీస్తు ప్రత్యక్షమగు దినము మరియు ఘడయను గూర్చిచెప్పడానికి మన దగ్గర నిర్దిష్టమైన సందేశం లేదు. అయితే మనము ఎల్లప్పడు ఎదురు చూచే స్థితిలో వుండాలని మరియు మన ప్రభువు ఆకాశమేఘాలలో రెండవ సారి ప్రత్యక్షతను వీక్షించుటకు సిద్ధపడాలని అందుకే దేవుడు ఈ విషయమును జ్ఞానయుక్తముగా మనకు మరుగు చేసియున్నాడు. లెటర్ 28, 1897. LDETel 21.1

మనుష్యకుమారుని రాకడకు ఖచ్చితమైన సమయం అనేది దేవుని యొక్క మర్మము. - యుగయుగాల ఆకాంక్ష633 (1898). LDETel 21.2

మనది ఒక నిర్దిష్టమైన సమయమును ఏర్పాటు చేసుకొనిన సందేశం కాదు LDETel 21

కాలాను గుణముగా నిర్ణయించబడిన ఖచ్చితమైన సమయానికే యేసు రెండవ సారి శక్తితోను మరియు గొప్ప మహిమతో రానైయున్నాడని చెప్పే తరగతికి మనము చెందము. కొందరు నిర్దిష్టమైన సమయమును పెట్టుకున్నారు ఎప్పుడైయితే ఆ సమయము దాటిపోయినదో ఎదురుచూచిన వారందరు దూషించారు కాని అ అహంకా రులు ఆ ఓటమిని అంగీకరించలేకపోయారు.అయిన వారు మరో సమయాన్ని ఏర్పాటు చెసేవారు ఆయితే వారు ఇలాగ అనేకసార్లు చేసినను విఫలమైనారు కాబట్టి వారు అబద్ధ ప్రవక్తలుగా ముద్రపడినది. ఫండమెంటల్స్ అప్ ఎడ్యుకేషన్. 335 (1895) LDETel 21.3

ఈ భూమి యొక్క చరిత్ర ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలలో ముగుస్తుందని దేవుడు ఏ మనిషికి వర్తమానము ఇవ్వలేదు. ఆయన రాకడ కొరకు సిద్ధపడకుండ ఆలస్యం చేయుచున్న ఏ మనుష్యుడు నైనను ఆయన క్షమించడు. అపనమ్మకస్థుడైన దాసుడు చేసినట్లు చేసిన వారిని తప్ప ఎవరిని ఆయన శిక్షించడు. నా ప్రభువు అలక్ష్యము చేయుచున్నాడన్న దానిని లక్ష్యము చేయకపోవుట, ఆయన మహాదినము కొరకు సిద్ధపడే అర్హతను మరియు అదిక్యతను నిర్లక్షము చేయుటయే. ది.-రివ్యూ అండ్డెరాల్డ్, నవంబరు 27, 1900. LDETel 21.4

ఒక నిర్దిష్టమైన సమయమును నిర్ణయించుకొంటే అది అపనమ్మకమునకు దారితీస్తుంది LDETel 21

పదేపదే నిర్ణయించుకొన్న సమయలు దాటిపోయినది, క్రీస్తు రాకడ విషయములో ముందురోజులు కంటే ఇప్పుడు మరి ఎక్కువుగా అపనమ్మకమనే దానిని నిర్ణయించు కొనే స్థితిలో ప్రపంచము ఉన్నది. మనుష్యుడు మోసగించబడియున్నాడు, దేవుని వాక్యము ద్వారా ఎరిగిన సత్యము నుండి దూరమైపోయినందుకు గాను సమయము LDETel 21.5

ఏర్పాటు చేసి విఫలమైపోవుటకు కారకులైన వారిని చూచి అసహ్యించు కుంటు న్నారు. అయితే అన్నిటికి అంతమయ్యే కాలము సమీపములో వున్నది, సంఘ మునకు ఉపదేశములు-4: 307 (1879) LDETel 22.1

సహోదరుడు ఇ పి. డేనియల్స్ గార్కి వున్న సమస్య నేను అర్ధము చేసు కున్నాను, వారు సమయమును నిర్ణయించారు. ‘ప్రభువు ఇక ఐదు సంవత్సరాలలో వస్తాడాని ప్రకటించారు, ఆయితే ఇప్పుడే మీము సమయము నిర్ణంచుకొనేవారము కాదనే అభిప్రాయము దేశము దాటివెళ్లదని నేను అశిస్తున్నాను, అటువంటి వ్యాఖ్యలు చేయరాదు. అవి ఏవి మంచిని చేకూర్చవు, అటువంటి వాటిపైన ఏ విదమైన ఉజ్జీవము తీసుకొచ్చుటకు ప్రయత్నంచకండి, ఉపయోగించిన ప్రతి మాటలోనూ జాగ్రత్తగా ఉచ్చరించాలి. స్వమతమును పొగుడుకునే వారు ఏది స్వాదీనము చేసుకోలేరు కాని వారు ఉత్సాహాన్ని సృష్టించగలరు అయితే ప్రభువు యొక్క ఆత్మ దుఃఖపడతుంది. అల్లరిని రేపుటకు ప్రజలలో ఎటువంటి ఆశలను కదిలించకుండ వుండాలి.ఎక్కడ బావాలు కదిలించబడతాయో అక్కడ, సూత్రం నియంత్రించబడదు. నలువైపుల నుండి మనకు బద్రత అవసరమని నా అభిప్రాయము, ఎందుకంటే సాతాను తన కున్న బలముతో పనిచేస్తున్నాడు. అతని కళలు మరియు తంత్రాలను శక్తితో హానిచేయ నిర్దేశించి యున్నాడు. తప్పుడు ఆధారములు మీద ఏదైన అల్లరి, ఉద్రేకము సృష్టించును అది భయంకరమైనది దానికి తప్పని సరిగా ప్రతి చర్యవస్తుంది- లెటర్ 34, 1887 LDETel 22.2

దేవుని చేత నేను నడిపించ బడుచున్నానని, సంఘములో ఎవరైతే ప్రకటించు కుంటారో ఆ వ్యక్తుల చేత తప్పుడు అభిప్రాయములు మరియు అర్ధములేని ఉద్యమము కలుగుట తప్పదు. పంపించబడినవారి కంటే ముందుగా ఎవరైతే పరుగులు తీస్తారో వారు రోజు మరియు తేది కూడ ప్రకటిస్తారు, అది నెరవేరని ప్రవచనంగా సంభవించును. వారు పూర్తిగా విపలము చెందుటకు శత్రున సాతానుడు సంతోషించుటకు వారని ఇలాగా ప్రేరేపించుచున్నాడు. మరియు తప్పుడు మార్గమునకు నడిపించుట ద్వారా గందరగోళం మరియు అవిశ్వాసానికి కారణమవుతాయి. సెలెక్ట్డ్ మెసెజన్స్. 2:84 (1897) LDETel 22.3

1844 తర్వాత సమయము గూర్చిన ప్రవచనము లేదు. LDETel 22

జాక్సన్ శిబిరంలో జరుగుచున్న సమావేశంలో అమితమైన మూడ భక్తిగలవారు శత్రువు అయిన సాతాను యొక్క దుష్ట ఆత్మలు చేసే కార్యములే వారు చేస్తన్నారు, వారు ఇంక చీకటిలోనే వున్నారని నేను స్పష్టంగా చెప్పాను.1884, అక్టోబరులో ఈ పరిశీలన మూసివేయబడిందని అప్పుడు గొప్ప సత్యము పొందుకుంటారని వారు వెల్లడించారు. అయితే దేవుడు ఇచ్చిన సందేశము 1844సం తర్వాత ఖచ్చితమైన సమయం లేదని దేవుడు నాకు చూపించడానికి ఇష్టపడియున్నడని నేను బహిరంగంగా ప్రకటించాను.- సెలెక్టెడ్ మెసెజన్స్. -2:73 (1885) LDETel 22.4

1844 లో ప్రవచనార్థక కాలాల మద్య మరియు మన ప్రభువు రాకడ సమయము మద్య సమయము గూర్చిన ప్రకటనల జోక్యం లేనేలేదు, ఇప్పుడు మనకున్న దెల్ల మెలుకువగా వుండి ఎదురుచుడడమే మనకున్న బాధ్యత - మాన్యుస్కిప్టు రిలీజ్ 10. 270 (1885) LDETel 23.1

ఖచ్చితమైన సమయము వున్నపుడు ప్రజలకు మరొక సందేశం అవసరములేదు. [ప్రకటన 10: 4-6] ఈ కాలం తర్వాత 1842 నుండి 1844వరకు చేరిన ప్రవచనాత్మక కాలము ఖచ్చితమైన జాడలు లేవు, సుదీర్ఘమైన లెక్కింపు 1844 ఆకులు రాలే కాలం వరకు సాగుతుంది.- ది ఎస్ డి ఎ బైబిల్ కామెంటరీ 7: 971 (1900). LDETel 23.2

క్రీస్తు రాకడ ఎల్లెస్ వైట్ జీవించిన కాలములో వచ్చునని ఎదురుచుచెను LDETel 23

ప్రజా సమావేశము వద్ద గొప్ప సముహము నాకు చూపించెను దేవదూత ఇలా అనెను “పురుగులకు కొంత ఆహారము, ఏడు చివరి తెగుళ్ళలోని గురించి కొన్ని అంశాలు, కొంతమంది సజీవంగా చుమి మీద ఉంటారు వారు యేసు వచ్చినప్పుడు మార్పుచెంది పరమునకు ఎత్తబడుతారు. సంఘమునకు ఉపదేశములు... 1: 131, 132 (1856) LDETel 23.3

సమయం తక్కువగా ఉంది కాబట్టి మనము శ్రద్ధతోను మరియు రెండింతల శక్తితో పని చేయాలి. మన పిల్లలు ఇక కళాశాలలో ప్రవేశించరు. సంఘమునకు ఉపదేశములు. 3: 159 (1872) ఇప్పుడు సమయం తక్కువగా ఉంది, అంత్య దినాల ఆపదలు మనమీద వున్నాయి కనుక చిన్నపిల్లలు ఇవి చూచి ఎంతో రోదించెదరు కాబట్టి నిజంగా పిల్లలకు జన్మనివ్వడం అంత తెలివైన పనికాదు. -లెటర్ 48, 1876. LDETel 23.4

ఈ యుగములో, భూమి యొక్క చరిత్ర ఘట్టాలు త్వరలోనే మూసివేయ బడుతున్నాయి మరియు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందుల కాలములోనికి ప్రవేశించ నైయున్నాము. పురుషులు మరియు మహిళలు ఇరువులు వివాహం చేసుకునేవారు తక్కువగా ఉన్నారు. సంఘమునకు ఉపదేశములు 5: 366 (1885). LDETel 23.5

అ ఘడియ తప్పకుండ వస్తుంది. అది ఎంతో దూరములో లేదు మరియు ఇప్పుడు విశ్వసిస్తున్న మనలో కొందరు భూమ్మీద సజీవంగా ఉంటారు, వారు ముందుగా చెప్ప బడిన సంగతులు జరుగుట చూచేదరు. ప్రదాన దూత శబ్దము విందురు, మరియు దేవుని యొక్క బూర ద్వని, పర్వతములలోను, సమమైన ప్రాంతములోను మరియు సముద్రముదాటి, భూమి నలుదశలయందు మ్రోగును.-రివ్యూ, హెరాల్డ్, జూలై 31,1888. LDETel 23.6

పరిశీలన సమయం మనపై మాత్రమే ఉంది, క్రీస్తు యొక్క నీతి, పాపం క్షమాపణ విమోచకుడు యందు వున్న సంబందములో మూడవ దేవదూత యొక్క గంబీరమైన గొప్ప స్వరముతో ప్రారంభమయ్యా యి.- సెలెక్టడ్ నెసేజస్స్ .1: 363 (1892). LDETel 23.7

ఆలస్యం గూర్చి వివరించబడింది. LDETel 24

సుదీర్ఘంగా రాత్రంత వున్న చీకటి పోవుటానికి సిద్ధంగా వుంది, కానీ ఇంక కరుణ చూపుట వలన ఉదయం రావటానికి వాయుదా వేస్తుంది, ఎందుకంటే యజమాడు వచ్చినట్లైయితే ఎందరో సిద్ధపడివుండరు అనేది తెలుస్తుంది. -సంఘమునకు ఉపదేశములు. 2: 194 (1868) LDETel 24.1

1844 లో గొప్ప ఆశాభంగం తరువాత అడ్వెంటిస్టులు తమ విశ్వాసాన్ని నిలబెట్టకుని ఐక్యతతో వెంబడించారు దేవుని యొక్క కాపుదలలో మూడవ దేవదూత యొక్క సందేశాన్ని స్వీకరించారు మరియు పరిశుదాత్మ శక్తితో ప్రపంచానికి ప్రకటించారు, వారు దేవుని యొక్క రక్షణ వారు చూచియున్నారు, వారు చేసిన కృషికి ఫలితముగా దేవుడు సన్మానించి వుండేవాడు, ఇక వారి పని కూడ పూర్తి అయుండేది. ఇప్పుడు, ఆయన ప్రజలను తీసుకొని వెళ్ళుటకును మరియు బహుమానము ఇచ్చుటకు క్రీస్తువచ్చి వుండేవారే. కాని క్రీస్తు యొక్క రాకడ అలస్యం చేయాలని దేవుని యొక్క ఉద్దేశము కాదు......... అయితే నలభై ఏళ్లపాటు అవిశ్వాసం, సణుగుడు, మరియు తిరుగుబాటుతో పూర్వికులైన ఇశ్రాయేలును కనాను దేశము కొరకు కేకలు వేసారు. అవే పాపములు నవీన ఇశ్రయేలీయులలో ఉండుటవలన అ పరలోక కానానులో ప్రవేశించు టకు ఆలస్యము చేస్తున్నది. ఈ రెండు విషయములో దేవుని వాగ్దానము నిరార్ధకంకా లేదు, ఇది అవిశ్వాసము, ఐహిక సబందములోనుండుట వలన మరియు సమర్పణ భావము లేకపోవుటవలన దేవుని ప్రజలు మద్య కలహములు ఇవి అన్ని అనేక సంవత్సరములుగా పాపములొను మరియు దుఖఃములొను ఉంచుటకు కారణమై యున్నది. - ఎవాజిలిజం, 695, 696 (1883). LDETel 24.2

దేవుడు ప్రతిష్టించి నిర్ణయించిన ప్రకారము క్రీస్తు సంఘం బాద్యతగా పనిని చేసివుంటే మరియు ఇంతకు ముందే యావత్ ప్రపంచానికి హెచ్చరిక అందేది ప్రభువు తన శక్తితోను గొప్ప మహిమతోను భూమిమీదకి వచ్చుండేవారే.- యగయగాల ఆకాంక్ష 633, 634 (1898). LDETel 24.3

దేవుని వాగ్దానాలు షరతులతో ఇమిడియున్నవి LDETel 24

దేవుని దూతలు వారి సందేశాల్లో సమయం తక్కువగా వుందని ప్రజలకు మరల ప్రకటించెను. రోమీయులు 13:11, 12; 1 కొరింథీయులు 7: 29; 1 థెస్సలొనీకయులకు 4:15, 17; హెబ్రీయులు 10:25; యాకోబు 5: 8, 9; 1 పేతురు 4: 7; ప్రకటన 22: 6, 7 చదవండి.) కాబట్టి అది నాకు ఎల్లప్పుడూ అందంచబడినది. ఈ సందేశం యొక్క ప్రారంభ రోజులలో మేము ఊహించిన దాని కంటే సమయం చాలా కాలం కొనసాగింది అనేది నిజం. మనము నిరీక్షించగానే రక్షకుడు తక్షణమే ప్రత్యక్షముకాలేదు. అయితే దేవుని వాక్యము విపలమైనదా? అది ఎన్నటికి కాదు అయితే ఒకటి మాత్రము మనము జ్ఞాపకముచేసుకోవాలి ఇదిదేవుని వాగ్దానాలు మరియు హెచ్చిరికలు షరతులు గుర్తుంచు కోవాలి.(యిర్మీయా 18: 7-10;యోనా 3: 4-10.] చూడండి, ఇశ్రాయేలీయుల వలే మనము అనేక సంవత్సరములు అవిధేయత చూపించుట వలన మనము ఇంకా ఇక్కడ ఈ లోకములో ఉండవలసి ఉంది. అయితే క్రీస్తు నిమిత్తము ఆయన ప్రజలు యొక్క తప్పుడు కార్యముల వలన తేలిన ఫలితార్ధమును బట్టి పాపము వెంబడి పాపము చేయకూడదు. -ఎవాంజలిజం, 695, 696 (1901). LDETel 24.4

క్రీస్తు దేని కొరకు వేచియున్నాడు LDETel 25

క్రీస్తు తన సంఘములో తనకు తాను ప్రత్యక్ష పరుచుకొనుటకు ఆయన ఎంతగానో అభిలషించూచు ఎదురు చూస్తున్నాడు. క్రీస్తు యొక్క గుణ లక్షణములు ఆయన ప్రజలలో పునరుత్పత్తి చేయబడినప్పుడు, అతను వారిని ఆయన స్వంత వారిగా ప్రకటించును, ఇది ప్రతి క్రైస్తవుని యొక్క ఆధిక్యత మాత్రమే కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కోసమే. మనము ఎదురుచూడాలి, ఆయన నామము కలిగియున్న వారము కాబట్టి మనము కృప ఫలములు ఫలించాలి, అలాగైతే ఎంత త్వరగా సువార్త విత్తనములు విత్తినవారము అవుతాము అప్పుడే గొప్పపంటను కొయవచ్చు మరియు క్రీస్తు విలువైన దాన్యాన్ని సేకరించడానికి వస్తాడు. క్రీస్తు ఉపమైన ప్రబోధాలు 69 (1900). LDETel 25.1

ప్రపంచానికి సువార్తను అందించుటము ద్వారా మన ప్రభువు యొక్క రాకడను వేగవంతం చేయటానికి అది మన శక్తిలోనే ఉంది. దేవుని మహాదినము రాకడ కొరకే కాదు మనము ఆయన కొరకే ఎదురుచూడాలి (2 పేతురు 3:12,మార్జిన్) యూగయగాల ఆకాంక్ష 633 (1898). ఈ మర్మమైన సంఘటనను అంతమునకు తీసుకొచ్చుటకుగాను మనతో ఏకమై దానిని ముగించుటకు మనకి శక్తిని అనుగ్ర హించెను. -ఎడ్యుకేషన్ 264 (1903). LDETel 25.2

దేవుని సహనానికి పరిమితివున్నది LDETel 25

అనంతమైన దేవుడు అన్ని దేశాల ప్రజల యొక్క వివరాలు తప్పిపోకుండ ఖచ్చిత మైన జాబితలో ఉంచును, ఆయన మృదువైన దయ పశ్చాత్తాపము పొందమని పిలుపుస్తుండగా ఈ ఖాతా అలాగే తెరవబడి ఉంటుంది, కానీ దేవుడు నిర్ణయించిన స్థాయిని ఎవరైన అదిగమించినదంటే అయన ఉగ్రత కార్యము ప్రారంభమౌతుంది, సంఘమునకు ఉపదేశములు.5: 208. దేవుడు దేశాలు యొక్క వివరాలు బద్రము చేయును, చట్టం స్థిరపడినప్పుడు వారములో మొదటి రోజు అతిక్రమించినట్లైయితే వారు శిక్షను అమలు చేయును అలాగా పరలోకములో వున్న పుస్తకాలలో వారికి వ్యతిరేకమైన లెక్కలు అధికముగా బరువెక్కు తున్నాయి, అది అప్పుడు వారి గిన్నే నిండిపోతుంది. ఎస్ డి ఎ బైబిల్ కామెంటరీ 7: 910 (1886) LDETel 25.3

దేవుడు ప్రజల యొక్క జాబితాను బద్రముగా ఉంచును. కాలము పూర్తిగా సమీపించినప్పుడు అపరాదములు దేవుని యొక్క కృపా సరిహద్దు స్థానము దాటినందున, అతని సహనం నిలిపివేయబడుతుంది. పరలోకములో వున్న గ్రందము లలో వ్రాయబడిన సంఖ్యలో అతిక్రమము చేసిన వారి జాబితా కరారు చేయబడి నప్పుడు ఆయన ఉగ్రత వచ్చును. -సంఘమునకు ఉపదేశములు 5: 524 (1889). LDETel 26.1

దేవుని కరుణ అపరాదికి దీర్ఘకాలం ఉండగా, మనుష్యులు పాపం చేయకుండాపోయే పరిమితి ఉంది. ఆ పరిమితిని చేరుకున్నప్పుడు, అనుగ్రహింపబడిన కరుణ అతను నుండి తీసివేయబడుతుంది, అప్పుడు తీర్పు పరిచర్య ప్రారంభమవుతుంది. పితరులు- ప్రవక్తలు, 162, 165 (1890) LDETel 26.2

అనైతిక మనుష్యులతో వారి యొక్క మోసము ఒక స్థానమునకు చేరుకున్నప్పుడు దేవుడు వారిని దాటిపోవుటకు అనుమతివ్వని సమయము వచ్చినప్పుడు, యెహోవాకు ఓర్పుకు పరిమితి ఉందని వారు తెలుసుకుంటారు .సంఘమునకు ఉపదేశములు9: 13(1909).యెహోవా తీర్పులు పరిమితివున్నది తార్వత ఆయన ఆలస్యము చేయుడు. -ప్రవక్తలు - రాజులు, 417 (c.1914). LDETel 26.3

అతిక్రమము దాదాపు దాని పరిమితిని చేరుకున్నది LDETel 26

భూలోకనివాసులు తమ దోషపూరితమైన గిన్ని నింపబడినప్పుడు, సమయము కొద్ది కాలమే పొడిగించబడుతుంది, ఆ పిమ్మట ఎంతో కాలంగా అణిచి వేయబడిన దేవుని కోపము రగులుకొనుటకు సిద్ధమాయెను, అప్పుడు వెలుగు కలిగియున్న ఈ భూమి ఆయన ఉగ్రత పాత్ర త్రాగును. సంఘమునకు ఉపదేశములు 1: 363 (1863). LDETel 26.4

అన్యాయపు పాత్ర అంచువరకు నిండిపోయినది, దండించే దేవుని తీర్పు ఇక అపరాధుల మీదకి దిగిరానైయున్నది. సంఘమునకు ఉపదేశములు4: 489 (1880) LDETel 26.5

దుష్టులైన లోకనివాసుల యొక్క దుష్టత్వం కొలత వేయబడినది, వారి దోషము దాదాపుగా నిండియున్నది ఈ భూమి అ స్థాయికి చేరువైనది కాబట్టి నాశనపాత్రుడగు దుష్టిని తన కార్యము నెరవేర్చుకోమని దేవుడే అధికారము ఇస్తాడు. సంఘమునకు ఉపదేశములు7: 141 (1902) LDETel 26.6

నేరములు దాదాపు వాటి పరిమితిని చేరుకుంది. గందరగోళం ప్రపంచాన్ని నింపే సింది మరియు ఇక మానవులపై త్వరలోనే గొప్ప భయము రానైయున్నది, అంతము చాలా సమీపంలో ఉంది, కాబట్టి విపరీతమైన దుఖాఃని కలిగించి ఆశ్చర్యములో ముంచి వేసేది అది అతి త్వరలో ఈ లోకమలోనికి ఏది సంభవించనైయున్నదో అ సత్యాన్ని ఎరిగియున్నాము కాబట్టి మనము సిద్ధపడుదము.- సంఘమునకు ఉపదేశములు. 8:28 (1904) LDETel 26.7

దేవుని రాకడ దినమును గూర్చి మన మనస్సుల ముందు వుంచవలెను LDETel 27

తీర్పు యొక్క గొప్ప సంఘటనలు ముందు వుంచబడినవి వాటిని మనము ఆలోచించుచు మరియు దానిని లక్ష్యముంచుటకు మన మనస్సులకు మనమే బోదించు కోవలసివుంది., మరియు దేవుని యొక్క మహా దినము గూర్చిన దృశ్యాలు మనలో భద్రముగా దాచియుంచినట్లయితే అప్పుడు ప్రతీది బయలుపర్చబడుతుంది, అది మన ప్రవర్తన మీద ప్రభావము చూపుతుంది. సహాదరి వైట్ గారు మన ప్రభువు ఇక పది సంవత్సరములో వస్తాడని మీరు అనుకుంటున్నారా అని, ఒక సహాదరుడు నన్ను అడిగెను, అప్పుడు నేను ఆయన ఒక వేళ రెండు, నాలుగు లేక పది సంవత్సరములో వస్తే అప్పుడు నీకు ఎటు వంటి వ్యత్యాసము ఉంటుంది అన్నాను, అలా ఎందుకు అప్పుడు పది సంవత్సరములో ప్రభువు వస్తాడని నాకు తెలిస్తే ఇప్పుడు చేస్తున్న విషయములు కంటే ఇంక భిన్నంగా ఎదో చేస్తానని నేను అనుకుంటున్నా అని అన్నాడు. నీవు ఏమి చేస్తావు? అని అడిగాను. అందుకతడు తన గూర్చి చెప్పుచున్నాడు, నాకున్న ఆస్తి అంతటిని విక్రయించి, దేవుని వాక్యాన్ని వెతకడం మొదలుపెడతాను మరియు, ప్రజలను హెచ్చరించి వారిని ప్రభు రాకడ కొరకు సిద్ధంచేయటానికి ప్రయత్నిస్తాను, మరియు నేను ప్రభువుని ఎదురుకొనుటకు సిద్ధముగా వుంటానని ఆయనను వేడుకొందును అని అన్నాడు, అప్పుడు నేను ఇలా అన్నాను దేవుడు ఇరవై సంవత్సరాలు వరకు రాడాని నీకు తెలిస్తే, నీవు భిన్నంగా జీవిస్తావు కదా, అప్పుడు“అతడు ఇలా అన్నాడు నిజమే, దేవుడు పది సంవత్సరములో వస్తాడని తెలిస్తే నేను ఎంతో భిన్న ముగా జీవించాలనుకున్నాను, నేను ఎంత స్వార్ధపరుడని తానే ఒప్పుకున్నాడు, హానోకు ఎందుకు దేవునితో 300 సంవత్సరములు నడిచాడు, దేవునితో మనము ప్రతిదినము నడవాలి అనే పాఠము మనకి వస్తుంది. మరియు మనము మెలుకువగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని వుండక పోయినయెడల మనకు సురక్షితముకాదు. ఎంమ్ ఎస్ 10, 1886. LDETel 27.1

అయన సమయమును తక్కువ చేసెను. LDETel 27

దేవుని యొక్క గొప్ప పనిలో ఇప్పుడు బద్దకముగాను మరియు అశ్రద్ధగా వున్నా వారికి దేవుడు రాత్రింపగలు విశ్రాంతి లేకుండజేయును, అంతిమ కాలము చాల సమీపములోవుంది, మనకి సమయము కొంచమేవుందని మన ప్రభువు ఇదే విషయమును ఎప్పుడో మన ముందు వుంచి యున్నాడు. - లెటర్ 97, 1886. LDETel 27.2

మనము బంగారపు వీణలతోను, మహిమగల కిరీటములతోను ఆ స్పటిక సముద్రంపై విమోచింపబడిన వారితో మనము నిలువ బడినప్పుడు మన ముందు మన ఊహకు అందని నిత్యరాజ్యము కనిపిస్తున్నది. అప్పుడు కృపకాలము కొరకు వేచియుండిన సమయము ఎంత తక్కువుగా వున్నదని మనము గమనిస్తాము.మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 10: 266 (1886) LDETel 27.3