Go to full page →

8 అధ్యాయము - నగరాలు LDETel 76

మొదటి నగర స్థాపకులు LDETel 76

దేవుని శాపానికి గురిఅయిన తర్వత కయీను తన తండ్రి ఇంటి నుండి వెళ్ళి పోయాడు, అతను తన వృత్తిని మొట్ట మొదటిగా భూమిని సేద్యపరిచే వానిగా ఎంచుకున్నాడు, అప్పుడు అతడు ఒక పట్టణాన్ని స్థాపించి దానికి తన పెద్ద కొడుకు పేరు పెట్టేను(ఆదికాండము 4:17] ఏదెను పునరుద్ధరణ వాగ్దానమును తృణీకరించి, దూరంగా అతడు యెహోవా సన్నిది నుండి బయటికి వెళ్లిపోయి, పాపం యొక్క శాపం క్రింద భూమి పై స్థానమును మరియు ఆనందము సంపాదించుటకు చూస్తున్నాడు, అయితే ఈ లోక దేవతలను పూజించే తరగతి ప్రజలకు అధినేతగా నిలిచాడు. - పితరులు - ప్రవక్తలు, 81 (1890). LDETel 76.1

నోవహు సంతతి వారు ఓడ నిలిచిన పర్వతాల మద్యనే కొంతకాలంగా నివసించారు. వారి సంఖ్య పెరిగేకొద్ది వారి మద్య మతభ్రష్టత్వము పెరిగి త్వరగా విభజనకు దారితీసింది. తమ సృష్టికర్తను మర్చిపోయి ఆయన ధర్మశాస్త్రవిదుల్ని నిరాకరించినారు. దేవుని యెడల భయభక్తులైన సహవాసుల బోద, మరియు అనుభవాలులను బట్టి నిరంతర కోపానికి గురయ్యారు, కొద్దికాలానికే వారు దేవుని భక్తుల నుండి వేరువేరైపోవాలని నిర్ణయించుకున్నారు. వారు ప్రయాణమై యూప్రటీసు నది తీరమునున్న షినారు మైదానం చేరుకున్నారు........... ఇక్కడ వారు ఒక నగరాన్ని నిర్మించి అందులో ప్రపంచ మంతటి వింతగా నిలిచే ఎత్తయిన గోపురం కట్టలని తీర్మానించుకొన్నారు. (ఆదికాండము 11: 2-4] పితరులు- ప్రవక్తలు, 118, 119 (1890). LDETel 76.2

నగరాలు దుష్టత్వములకు కేంద్రముగా నుంది LDETel 76

ఆనందం కోసం వినోద కేంద్రాల నగరాల్లో దర్శమిస్తున్నాయి. చాలా మంది తల్లి దండ్రులు వారి పిల్లలకు భవిష్యతు ప్రయోజనాలు కోసం నగరములో జీవితం ఎన్నుకుంటారు, వారికి అధిక లాభాలు తెచ్చిపెట్టి వాటి పైన దృష్టి పెడతారు, తర్వాత నిరాశలు ఎదురైనప్పుడు, భయంకరమైన పొరపాటు చేసామని చాలా ఆలస్యంగా తెలుసుకొని పశ్చాత్తాపపడుచున్నారు. నేటి నగరాలు చాల వేగంగా సొదొమ గొమొర్రా లాగా మారుతున్నాయి. అనేక సెలవులు రావటము ద్వారా సోమరితనము ప్రోత్సహి స్తాయి, ఉత్తేజకరమైన క్రీడలు-థియేటర్- వెళ్లి సందడిచేయుటము, గుర్రపు పందెం, జూదం, మద్యం త్రాగడం, మరియు తీవ్రమైన పనులకు ప్రేరణ కలిగి కన్నుమిన్ను కానకతాగి తూలుచు యౌవనలు ప్రఖ్యాతిగాంచిన ఈ ప్రవాహములో కొట్టుకొని పోతున్నారు. క్రైస్ట్ ఆబ్జెక్ట్ లెసెన్స్, 54 (1900). LDETel 76.3

నగరాలు, గందరగోళములు హింసలు మరియు నేరాలతో నింపబడతాయని మరియు భూమి యొక్క చరిత్ర, అంతిమ కాలము వరకు ఈ విషయాలు పెరుగు తున్నాయని ఈ సత్యము నాకు ఇవ్వబడియున్నది. సంఘమునకు ఉపదేశములు 7: 84 (1902) LDETel 77.1

ప్రపంచములో వున్న నగరాలు నాశనము చేసే చెడు కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రతి వాడు చెడు దృశ్యాలను చూస్తున్నాడు, అన్ని చోట్లా ఇంద్రియత వ్యాపారము మరియు చెదరగొట్టే ప్రవృత్తులు ఉన్నాయి. మినిస్ట్రీ అఫ్ హీలింగ్ 363 (1905). LDETel 77.2

నగరముల మీదకి తీర్పు వస్తున్నది LDETel 77

భూమ్మీద భయంకరమైన సంఘటనలు మరియు తీవ్రమైన అఘాతము వస్తాయి, గొప్ప ధనమును వెచ్చించి నిర్మించిన గొప్ప రాజభవనాలు ఖచ్చితంగా నాశనము చేయబడతాయి. మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 3: 312 (1891) LDETel 77.3

రక్షించే దేవుని హస్తము తొలగిపోయినప్పుడు, నాశన పాత్రుడు అతని పనిని ప్రారంభిస్తాడు, అప్పుడు మన పట్టణాలలో గొప్ప విపత్తులు సంభవిస్తాయి. మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 3: 314 (1897) LDETel 77.4

న్యూయార్క్ నగరం, చికాగో మంటలలో చిక్కుకున్నట్లు మరియు మెల్బోర్ట్, లండన్, మరియు న్యూయార్క్ నగరం అగ్నిజ్వాలలు రగులిపోయినప్పుడు భూమి వాసులను దేవుడు హెచ్చరించుచున్నాడు సూచిస్తున్నవి.-ఎ ఎస్ 127,1897 LDETel 77.5

అంతిమ కాలము సమీపములో నుండగా ప్రతి నగరం అన్ని విధాలుగా తలక్రిందులుగా చెయ్యాబడతాయి.... ప్రతినగరంలో గందరగోళం ఉంటుంది. ఏదైతే కదిలించబడాలో అది కదిలించబడుతుంది, తరువాత ఏమి సభవించనైయున్నదో ఎవరికి తెలియదు. తీర్పు అనేది ప్రజల దుష్టత్వమును బట్టియు మరియ వారు పొందు కున్న సత్యమును బట్టియు వచ్చును. -మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 1: 248 (1902) LDETel 77.6

వేలాది నగరాల్లో రాబోయే నాశనం గురించి దేవుని ప్రజలు అవగాహన కలిగి వున్నారు, ఇప్పుడు దాదాపు అన్ని నగరాలు విగ్రహారాధనకు చోటిచ్చెను. ఎవాంజలిజం, 29 (1903). LDETel 77.7

పెద్ద నగరాలు తుడిచిపెట్టుకు పోయే సమయం దగ్గరలోనే వున్నది, రాబోయే ఈ తీర్పులన్నింటినీ గూర్చి హెచ్చరించబడియుంది. ఎవాంజలిజం 29 (1910). LDETel 77.8

విప్పత్తుల నుండి రక్షించే భీకర భవనాలు సహితం బూడిదిగా మారుతాయి LDETel 77.9

అత్యంత ఖరీదైన భవనాలు నిర్మించడం నేను చూచాను, అవి అగ్నిని నిరోధించగల ఏర్పాటుచేసుకొన్నారు. ఇక ఆహుతి కావు అని వారు భావించారు. అయితే దేవుని యొక్క కోపాగ్నికి సొదొమ ఏ రీతిగా అగ్ని జ్వాలలకు నాశనమైయున్నదో అలాగునే గర్యానికి ప్రతిరూపముగా నిలిచిన ఈ కట్టడాలు కూడ బూడిదవుతాయి.....ఈ ప్రపంచం మీదకి చివరి గప్ప నాశనము రాకముందే మనుషుల యొక్క గొప్పతనాన్ని ప్రదర్శిస్తున్న గురతులన్ని బూడిడైపోతాయి. - సెలెక్ట్డ్ మెసెజన్స్ 3: 418 (1901). LDETel 77.10

ప్రపంచంలో జలప్రళయమునకు ముందున నగరాలు మరియు సోదమా మరియు గోమోరల వంటివి చెడ్డ పట్టణాలు నుండి దేవుడు తన ఆత్మ ఉపసంహరించు కుంటున్నాడు. దేవుడు చూసేటప్పుడు యజమానులు క్షమాభిక్ష పెట్టేటందుకు కూడ సరిహద్దులు దాటిపోయారు,కనుక ఖరీదైన భవనాలు, నిర్మాణ నైపుణ్యం అద్భుతాలను, ఒక క్షణం విచారించకుండా నాశనం చేయబడుతుంది. అగ్ని ప్రమాదము నుండి రక్షణ, కవచముగా ఏర్పాటు చేసుకొనిన గంభర భవనాలు సహితము అగ్ని జ్వాలలకు నాశనము అవుతుంటే భూమి యొక్క అందమైన కట్టడాలు ఎంత త్వరగా ద్వంసమౌతున్న యో దృష్టాంతం వున్నాయి.---- ది డే విత్ గార్డ్ 152 (1902). LDETel 78.1

లక్షలు కొలది డబ్బు ఖర్చుచేసి మనుష్యులు ఖరీదైన భవనాలను కట్టుచున్నారు, స్థిరముగా మరియు దృడముగా కట్టిన కట్టాడాలకు, సౌందర్యమైన నిర్మాణమని చేప్పుకొనేటట్లు ప్రత్యేకమైన శ్రద్ధ చూపేదరు,అసాధారణ కట్టాడాలు మరియు ఖరీదైన శిల్ప కళలు బహిరంగముగా ప్రదర్శన ఉన్నప్పటికీ, యెరుషలేము ఆలయమునకు ఏ గతి పట్టినదో ఈ భవనాలు కూడ వాటితో బాగస్వామ్యం కానైయున్నదని దేవుడు నాకు ఆదశించెను.- ఎస్ డి ఏ బైబిల్ కామెంటరీ 5: 1098 (1906). LDETel 78.2

న్యూ యార్క్ నగరం LDETel 78

దేవుడు కనికరం చూపకుండగా తన కోపాన్ని అమలు చేయలేదు. అతని చేయి ఇప్పటికీ చాచియుంచాడు,. ఆయన ఇచ్చిన సందేశం తప్పనిసరిగా గ్రేటర్ న్యూయార్కో ఇవ్వాలి కడవరి కాలములో దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా కూడగట్టిన ఆస్తిని ఆయన చేతులతో నాశనంచేయడానికి ఎలా సాధ్యమౌతుందో ప్రజలకు చూపించును.మాన్యుస్క్రిప్ట్ రిలీజ్ 3: 310, 311 (1902). LDETel 78.3

న్యూయార్కో ఏమి జరుగుతుందో నాకు ప్రత్యేకంగా దర్శనములేదుగాని, ఒక రోజు గొప్ప భవనాలు దేవుని యొక్క శక్తిని తక్కువ అంచన వేయుట వలన మరియు నిర్లక్షము చూపించుటచేత క్రిందకు కూలద్రోయబడుచున్నవని ఆ ఒక్క విషయము మాత్రము నాకు తెలుసు... అన్ని ప్రాంతాల్లో మరణాలు సంబవించును. అందుకే నేను మన నగరాల గురించి హెచ్చరించడం కోసం ఆత్రుతగా ఉన్నాను.-ది రివ్యూ అండ్ హెరాల్డ్, జూలై 5, 1906. LDETel 78.4

ఒక సందర్భంలో, న్యూయార్క్ నగరంలో ఉన్నప్పుడు, ఒక రాత్రి కాలంలో దర్శనము చూడడానికి నేను పిలువబడినాను, ఆకాశం వైపు అంతస్తు పైన అంతస్తులు గొప్ప భవనాలు కట్టుచున్నారు, అగ్ని నిరోదించే భవంతులు అవి దృవీకరించబడ్డాయి, మరియు వారి యజమానులు మరియు నిర్మాణకార్మికులు మహిమ పరచడానికే అవి నిర్మించబడున్నవి ....ఆ తర్వత నా ముందు నుంచి వెళ్లిన దృశ్యము అగ్నిప్రమాదం. గంబీరమైన కట్టడాలను మరియు అగ్ని నిరోధక భవంతులను చూస్తున్న మనుష్యులు ఇవి నిశ్చయముగా సురక్షితంగు ఉన్నాయి అని అంటున్నారు కాని ఈ భవనాలు కీలువలే దహించువేయబడుచున్నవి. అగ్నిమాపక యంత్రాలను నాశనం జరగకుండ అపలేక పోయాయి,. అగ్నిమాపక సిబ్బంది యంత్రాలము నడిపించలే కపోయారు సంఘమునకు ఉపదేశములు .- 9:12, 13 (1909). LDETel 78.5

చికాగో మరియు లాస్ ఏంజిల్స్ LDETel 79

త్వరలోనే చికాగో మరియు ఇతర పెద్ద నగరాల్లో జరిగే దృశ్యము కూడా నా ముందు కనిపించినవి. దుష్టత్వం పెరిగినప్పుడు, దేవుని రక్షణ శక్తి వెనక్కి తగ్గినప్పుడు వినాశన కరమైన గాలులు మరియు భయంకరమైన తుఫాను చెలరేగేను. భవనాలు అగ్నిచే నాశనం చేయబడ్డాయి మరియు భూకంపము వలన నేలమట్టమైనవి.....కొంత సమయము తర్వాత నేను చికాగోలో ఉన్న భవనాల దృశ్యము నాకు చూపించ బడియున్నది. మరియు మన ప్రజలు నిటారుగ నిలబెట్టినవి పడగొట్ట బడుచున్నవి మరియు నాశనకరమైన దృశ్యములు ఇది ప్రజలకు ఒక పాఠం, వారి ఆస్తిని చికాగో, లేదా ప్రపంచములో ఇతర నగరాలలో పెట్టుబడులు పెట్టవద్దని ఒక హెచ్చరిక, దేవుని యొక్క అనుమతితో సానుకూలంగా మార్గం తెరిచినప్పుడు, మరియు నిర్మించుటకు లేదా కొనుగోలు చేయుటకు ఒక బాద్యత స్పష్టముగా ఇస్తేనే తప్ప ఏమి చేయకూడదని ప్రత్యకమైన హెచ్చరిక స్పష్టంగా సూచించడియున్నది.లాస్ ఏంజిల్స్లో ఇదే విధమైన హెచ్చరిక ఇవ్వబడినది. పట్టణాలలో ఖరీదైన భవనాల నిర్మాణంలో మనం పెట్టుబడి పెట్టకూడదని నేను తరుచుగా ఆదేశించాను. పాల్సస్ కలక్షన్ అఫ్ ఎల్లెన్ జి. వైట్ లెటర్స్ 50 (1906) LDETel 79.1

శాస్ ఫ్రాన్సిస్కో మరియు ఓక్లాండ్ LDETel 79

సొదొమ మరియు గొమొర్రా మాదిరగానే సాన్ ఫ్రాన్సిస్కో మరియు ఓక్లాండ్లు మారుతున్నాయి, మరియు ప్రభువు వారిని సందర్శిస్తాడు. దేవుని తీర్పులవల్ల వారి బాధ అనుభవించడానికి ఎంతో దూరములో లేదు.ఎం ఎసే 30, 1903. LDETel 79.2

అక్రమమైన మార్గములో ఏమీ చేయకుండ ఉండండి, లేనియెడల గొప్ప నష్టాన్ని కూడగట్టుకోవలసి వస్తుంది లేదా అతి మోహము వలన ఆస్తిని దారబోయవలసి వస్తుంది, ముందు జాగ్రత లేకుండా అనవసరముగా మాటలాడుట ఏ మాత్రము దేవుని క్రమము కాదు, అది దురభిమానమునకు దారితీస్తుంది. ఒక ప్రాముఖ్యమైన విజయమున సాదించటానికి కావలసినది, ఉన్నతమైన బుద్ది, మరియు సరైన ఆలోచన మరియు దృడమైన సూత్రాలు వుండాలి అవి కొదువైనప్పుడు, ఓటమికి దారితీస్తుంది. సెలెక్ట్డ్ మెజన్స్. 2: 362, 363 (1893) (డిసెంబర్ 22, 1893 వ్రాసినది] ఒక ప్రముఖ సేవకుడు బాటిల్ క్రీక్ నుండి ఒక లేఖకు సమాధానమిస్తూ, అందులో శ్రీమతి వైట్ గార్కి ఇలా సమచారము ఇచ్చెను, ఒకటి మరియు రెండు వందలు వరకు ప్రజలు, వీలైనంత త్వరగా నగరాన్ని విడిచిపెట్టి గ్రామీణ ప్రాంతానికి వెళ్లుటకు ఎంచుకున్నారు.- సెలెక్ట్డ్ మెసెజన్స్ 2: 361-364.] చూడండ LDETel 79.3

అలాంటి అతిక్రమణ ఫలితంగా దేవుని తీర్పులు నగరాల్లో మీదకి వచ్చినప్పటికిని, దేవునికి బయపడి పశ్చాత్తాపము పోందాలనే సూచన కూడ కనపరుచుటలేదు, విలాశవంతమైన జీవితమును గడిపే స్థలాలు ఇంకా తెరిచే వున్నాయి, ప్రజల ఎదుట అనేక శోధనలు పెట్టిబడియున్నాయి. లెటర్, ఆగష్టు 20, 1906, పే. 268. LDETel 80.1

ఇతర చెడ్డ నగరాలు LDETel 80

ఈ భూమి యొక్క చరిత్ర ముగింపు దశకు మనము అతి సమీపమునకు వచ్చే కొలది, శాన్ ఫ్రాన్సిస్కోలో వచ్చిన విపత్తు ఇతర ప్రాంతాలలో కూడ ఈ దృశ్యాలను పునరావృతమవడం మనము చూస్తాము ........ ఈ తీర్పు దినాలు ఇప్పుడే మన మీద వున్నయన్నది నాకు తెలుసు అయితే ఆ విషయాలు నాకు చాలా గంబీర మైనదిగా భావిస్తున్నాను. ఇప్పటికే వచ్చిన తీర్పులు ఒక హెచ్చరికగా వుంది కాని ఇంక దుష్ట పట్టణాలపై వచ్చిన శిక్షణతో అంతము కాదు. (హబక్కూకు 2: 1-20; జెఫన్యా 1: 1-3: 20; జెకర్యా 1: 1-4: 14; మలాకీ 1: 1-4, చెప్పచున్నాది.] LDETel 80.2

పాత నిబంధనలో వ్రాయబడిన ప్రవచనాలు అంతిమ కాలము గూర్చి దేవుడు పలికిన మాటలు, ఎంతో స్పష్టంగా వివరించబడిన విదముగా ఈ దృశ్యాలు అతి త్వరలోనే చూడబోవుచున్నాము, నేను అందరికీ పరిశీలన కోసం లేఖనాల నుండి ఈ అద్భుతమైన ప్రకటనలను నేను తెలియజేస్తున్నాను. మరియు శాన్ ఫ్రాన్సిస్కో యొక్క దురతిని చూసిన మనము అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. లెటర్, మే 26, 1906, p. 154 LDETel 80.3

దుర్మారముతోను మరియు విస్తారమైన పాపాముతో నిండిన నగరాలు, భూకంపాలకు, అగ్నికి మరియు వరదలకు నాశనమవుతాయని ఈ వర్తమానము ప్రకటించమని నాకు ఆజ్ఞాపించబడినది.. - ఎవాంజలిజం, 27 (ఏప్రిల్ 27, 1906). LDETel 80.4

భూమి యొక్క చరిత్ర అంతమునకు సమీపించినప్పుడు జరగబోయే సంఘటనల గురించి క్రీస్తు హెచ్చరించెను, ఇప్పుడు మహా నగరాల్లో నెరవేరుట ప్రారంభమైనది,. జీవన ప్రయాణములో వున్న మనము వాటిని గ్రహించుటకు ఈ విషయాలను వెలుగులోకి తెచ్చుటకు దేవుడు అనుమతిస్తున్నాడు. మొత్తం ప్రపంచం ఎలా మారుతుందో నమూ నాగా చెప్పుకొనుటకు శాన్ ఫ్రాన్సిస్కో నగరం ఒక ఉదహరణగా వున్నది, లంచగొండి తనము, దుర్వినియోగం మార్గలు, మోసపూరిత లావాదేవీలు, వంచనకు పాల్పడడం నేరస్థులను విడుదల చేయటానికి మరియు అమాయకులను ఖండించటానికి అధికారము కలిగిన మనుష్యులు, ఇటు వంటి అన్యాయాలన్ని ప్రపంచములో వున్న ఇతర పెద్ద నగరాలు కూడ పూర్తిగా నిండి పోయవుండడం జలప్రళయానికి ముందు రోజులు ఎలా వున్నయో అలాగా తలపిస్తున్నవి-లెటర్ 230, 1907. LDETel 80.5

నగరాలలో కార్మిక సంఘాలు LDETel 81

రద్దీగా వున్న నగరాల్లో సాతాను వికృతముగా పనిచేస్తున్నాడు. అతని పని గందర గోళములో పడవేసి పోరాటమునకు ఉసికొల్పును మరియు, కార్మికులు మరియు యాజమాహియిషి మద్య కలహాలు రేపి మరియు అసమ్మతి తీసుకొని వచ్చుట చూస్తాము, సంఘములోనికి వేషదారణ మరియు వంచన ప్రవేశంచినది.... శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అధికార దుర్వినియోగం, క్రూరత్వం మరియు యూనియన్లతో సమైఖ్యముగా వుండమని మనుష్యులు బలవంతము చేయుదురు, అంతిమ కాలములో గొప్ప మంటలలో చిక్కుకొని కాలిపోవుటకే అందరు ఏకమగుచున్నారు, ఇవన్ని సాతాను ప్రతినిదులైన దుష్టాత్మలు యొక్క పనైయిన్నది. ఎవాంజెలిజం, 26 ( 1903) LDETel 81.1

దుష్టులంత కట్టబడిన మూట వల గుంపుగా కూడివున్నారు, ఒక సంస్థగాను, సమాజముగాను,సంగముగాను, సమైఖ్యతతో కట్టుబడి ఉన్నారు. ఈ సంస్థలతో మనము చేయవలసిన పని ఏమిలేదు, దేవుడు మన పాలకుడు, మన అదికారైయున్నడు, మరియు ఈ ప్రపంచం నుండి బయటకొచ్చి, ప్రత్యేకంగా ఉండమని ఆయనే మనలను పిలుస్తాడు, కావున మీరు వారి మద్య నుండి బయలువెడలి ప్రత్యకముగా ఉండుడి, అపవిత్రమైనదానిని ముట్టకుడదని ప్రభువు చెప్పచున్నాడు, LDETel 81.2

[2 కొరింథీయులకు 6:17]. మనము ఈ పనిని తిరస్కరించి మనము ప్రపంచముతో అనుసందానిస్తూ మరియు ప్రతి ప్రాముఖ్యమైన ప్రపంచ దృష్టికోణాన్ని చూసి ఉంటే, మనము ప్రపంచము ఎలావుందో అలాగే తయారవుతాము. మన లావా దేవీలను ప్రాపంచిక విధానము మరియు ప్రాపంచిక ఆలోచనలు నియంత్రించక పోయినప్పుడు మనము ఉన్నతమైన స్థానలలోను మరియు శాశ్వతమైన సత్యమనే పవిత్ర వేదికపై నిలబడలేము.-ది ఎస్ డి ఏ బైబిల్ కామెంటరీ 4: 1142 (1903). LDETel 81.3

కార్మిక సంఘాలు మూలంగా ఎడ్వంటిస్టులకు శ్రమలు LDETel 81

భూమిమీదకి కార్మిక సంఘాలు ద్వారా ప్రపంచము ప్రారంభము మొదలుకొని ఎన్నడు ఎరగని గొప్ప శ్రమలు తీసుకొని వచ్చే కారణములలో ఒకటి, .. కొంత మంది వ్యక్తులు వ్యాపారం యొక్క నిర్దిష్ట విధానము పొందుటకు అన్ని వర్గాలు కలుపుతారు, కార్మక సంఘాలు ఏర్పాటు చేయబడతాయి మరియు ఈ కార్మక సంఘాలలో ఐక్యమౌ వ్వడానికి నిరాకరిస్తున్న వారును వెలివేయబడిన మనుష్యులుగా ముద్రవేస్తారు...... ఎందుకంటే ఈ సంఘాలు మరియు సమాజాల కారణంగా, మన సంస్థలకు పట్టణాలలో మన కార్యకలాపాలను కొనసాగించడానికి ఇది చాలా కష్టంగా ఉంటుంది. కనక నా హెచ్చరిక: పట్టణాల నుండి దూరంగా ఉండండి. నగరాల్లో ఎటువంటి ఆరోగ్యపునరావాస కేంద్రములు నిర్మించకండి.- సెలెక్ట్డ్ మెసెజన్స్ 2: 142 (1903). కార్మిక సంఘాలు అదికారము వారి చేతులోనికి తీసుకొని దౌర్జన్యము చేసే సమయము చాల దగ్గరలో వున్నది.- సెలెక్ట్డ్ మెసేజస్ 2: 141 (1904) LDETel 81.4

నగరాలలో చాలా మంది వెలుగు మరియు సత్యము కోసం ఎదురుచుస్తున్నారు LDETel 82.1

ప్రపంచ నగరాలు ఖండితముగా వ్యవహరిస్తున్నాయి, అయితే దేవుని తీవ్రమైన కోపాన్ని రుచిచూచుటకు అవి ఇంకా సమిపమునకు రాలేదు, ఎందుకంటే కొంత మంది వ్యక్తులు శత్రువు యొక్క భ్రమలు మరియు మోసలు నుండి దూరమై వారు పశ్చాత్తాప ములో మారుమనస్సు పొందుతారు.- ఎవాంజెలిజం, , 27 ( 1906). LDETel 82.2

మొత్తం ప్రపంచం ఆధ్యాత్మిక చీకటితో కప్పివేస్తుంది జనాభా రద్దీగా ఉన్న కేంద్రాలు తీవ్రమైంది. ప్రపంచ నగరాల్లో గొప్ప సమాధానము కొదువైయున్నది కాబట్టి వారికి సువార్త అవసరము ఉన్నదని సేవకులు కనుగొన్నారు. మరియు అదే నగరాల్లో అనేక ఆత్మలను రక్షించుటకు వారికి గొప్ప అవకాశాలు లభించినది, దేవుని గూర్చియు మరియు పరలోకము గుర్చియు ఆలోచించని అనేక మంది వ్యక్తులతో కలసి వున్నప్పుడు ఎందరో సత్యమైన వెలుగులు కోసము మరియు హృదయ పరశుద్ధత కోసం ఎదురుచుస్తున్నారు, నిర్లక్ష్యంగా మరియు భిన్నంగా ఉన్న వారిలో కూడా మానవుల కొరకు బహిర్గతం చేయబడిన దేవుని ప్రేమకు కొంతమంది బందీలౌతారు. నవంబర్ 17, 1910 LDETel 82.3

నగరాలలో నమ్మకమైన కృషి అవసరం LDETel 82

మన ప్రభవు రాకడ కొరకు సిద్ధపడుచున్నప్పుడు, మనము మహా నగరాల్లో ఉన్నతమైన పని చేయవలసి వుంది. ఈ గొప్ప కేంద్రాల్లో ప్రకటించుటకు మన యొద్ద గంబీరమైన సాక్ష్యాము వున్నది. -స్వచ్చంద సేవకులైన వారికి ప్రోత్సాహకరమైన మాటలు (పిహెచ్113) 5 (1909). LDETel 82.4

గొప్ప వ్యాపార రంగములో నున్న ప్రపంచమునకు ఈ సమయానికి కావలసిన హెచ్చరిక సందేశం నమ్మకముగా అందించుట లేదు. రోజు రోజుకి వాణిజ్యం మరియు వ్యాపారం కేంద్రాలలో పురుషులు మరియు మహిళలతో నిండియున్న వారికి ఈ కాలమును గూర్చిన వాస్తవము తెలిసుకొనుట అవసరమైయున్నది, ఎందుకనగా, ఈ తరగతి ప్రజలను వారు ఎక్కడున్న వారిని చేరుకోవటానికి విలువైన పట్టుదలతో చేయవలసిన ప్రయత్నాలు చేయుటలేని కారణంగ, దాని విలువైన సూత్రాల యొక్క జ్ఞానము భద్రత చేసుకోలేకపోతున్నారు. కౌన్సిల్స్ టూ రైటర్స్ అండ్ ఎడిటర్స్ 14 (1909). LDETel 82.5

దూరంగా ఉన్న ప్రాంతాల్లో కాదు గానీ, నిర్లక్ష్యం చేయబడిన దగ్గరున్న స్థలాల్లో రక్షణ పొందకయు మరియు హెచ్చరింపబడకయు వున్న ప్రజలకు, ఇప్పుడు త్రిదూత LDETel 83.1

వర్తమానం ప్రకటించవలసివుంది,. మన నగరాలు ప్రతి చోట నుండి యదార్ధమైన పూర్ణహృదయంగల పనివారిని దేవుని సేవకు పిలవబడియున్నారు. -ది రివ్యూ అండ్ హెరాల్డ్, నవంబరు 17, 1910. LDETel 83.2

వీలైనప్పుడల్లా, తల్లిదండ్రులు వారి పిల్లలకు గృహామే ఒక ప్రపంచముగా తయారు చేయవలసిన బాద్యత వారిది. ది అడ్వెంటిస్ట్ హోమ్ 141 (1906) LDETel 83.3

మరింత కాలము ముందుకి వెళ్లే కొలది, మన ప్రజలు నగరాలు విడిచి వెళ్లిపోవాలి.. మన సోదరులు మరియు సోదరీమణులు, ప్రత్యేకించి పిల్లలతో ఉన్న కుటుంబాలు, వారు పనులు చేసుకొనుటకు మార్గము ముందే తెరిచియున్నది, కాబట్టి ముందుగానే నగరాలను విడిచి వెళ్ళటానికి ప్రణాళికలు తీసుకోవలసిందిగా కొన్ని సంవత్సరాలుగా మేము ఆదేశిస్తున్నాము.ఆ మార్గాన్ని తెరుచుటకు ఎందరో కృషి చేయవలసి యుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వారు విడిచి పెట్టి వెళ్లితేనేగాని సాధ్యము కాదు. వారు వున్నంత కాలము, వారు చాలా చురుకుగా సువార్త సేవ చేయాలి, ఏది ఏమైన వారి ప్రభావ పరిస్థితిని పరిమితం చేయవచ్చు. సెలెక్టెడ్ మెసెన్స్ 2: 360 (1906). LDETel 83.4

దుష్టత్వములో మన నగరాలు పెరుగుతున్నాయి, మరియు అది రోజు రోజుకు పెరగడం స్పష్టముగా కనిపిస్తున్నది, అందులో అనవసరముగా ఉన్న వారు వారి ఆత్మ రక్షణ ప్రమాదంలో వున్నది.- కంట్రీ లివింగ్, 9 (1907) LDETel 83.5

నగరాలు మరియు పట్టణాలు పాపములోను మరియు నైతిక అవినీతిలోను మునిగి యున్నప్పటికిని లోతు లాంటి వారు ఎందరో ప్రతి సొదొమలో ఉన్నారు,. సంఘమునకు ఉపదేశములు 6: 136 (1900) LDETel 83.6

నగరాల్లో పాఠశాలలు, దేవాలయములు, రెస్టారెంట్లు అవసరము LDETel 83

ప్రస్తుతము పిల్లలు ఎవరైతే పట్టణాల నుండి దూరంగా వెళ్లిపోకుండ వున్నారో వారికి అవగాహనము అయేటట్లు బోదించవచ్చు మరియు వారిని రక్షించడానికి మరింత పని చేయవచ్చు. ఇది మన ఉత్తమ ప్రయత్నాలకు తగిన విషయం. నగరాల్లో పిల్లల కోసం సంఘ పాఠశాలలు స్థాపించాలి మరియు ఈ పాఠశాలలకు అను సంబంధముగా ఉన్నతమైన విద్యను అభ్యశించుటకు తగిన ఏర్పాట్లు చేయగలిగనప్పుడు ఎందరో విధ్యార్ధులు సేవకు పిలువబడతారు -చైల్డ్ గైడెన్స్, 306 (1903). LDETel 83.7

నగరాల్లో మన రెస్టారెంట్లు తప్పనిసరిగా ఉండాలి, లేకపోయినటైయితే ఈ రెస్టారెంట్లలోని పనివారు సరైన జీవన సూత్రాలను నేర్పించుటకు ప్రజలను చేరుకోలేరు. -సెలెక్ట్డ్ మెసెజన్స్ 2: 142 (1903) LDETel 83.8

నగరాల వెలుపల నుండి కేంద్రాలు ఏర్పాటు చేసుకొని నగరాలు కోసము పని చేయాలని యెహోవా మనకి తరుచుగా అదేశించుచున్నాడు.ఈ నగరాల్లో మనం దేవునికి జ్ఞాపకార్థంగా ఆరాదించే ఆలయాలు కలిగిఉండాలి, అయితే మన క్రైస్తవ విద్య ప్రచురించే ముద్రాలయము, అనారోగ్యం కొరకు వైద్యం శాలలు, మరియు శిక్షణ కేంద్రలు మరియు కళాశాలలు నగరము వెలుపల స్థాపించవలేను. ప్రత్యేకించి మన యువతను నగర జీవితం యొక్క ప్రలోభాల నుండి కాపాడుకోవడం ముఖ్యం. - సెలెక్టడ్ నెసేజన్స్ 2: 358 (1907) LDETel 84.1

అవమానకరమైన దేశములోనికి రావడం ఏమాత్రం మంచి సూచనకాదు LDETel 84

ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవలసిన అవసరమువుంది. మరియు ఉపమానములో ఒక మనుష్యుడు నిర్మాణము ప్రారంభించి పూర్తి చేయలేకపోయున వలే వుండకూడదు, ఎటువంటి ఉధ్యమము ప్రారంభించకూడదు, ఒక వేళ ప్రారంభిస్తే అన్ని సూచనలను మరియు ప్రతి విలువైన విషయాలు జాగ్రత్తగా పరిగణిలోనికి తీసుకోవాలి.....కొంతమంది వ్యక్తులు వారికి ఏమి తెలియకపోయునను వ్యాపారంలో ప్రవేసించి సొంతముగా ఏదోచేయాలని ఆతృత పడిపోతువుంటారు, ఇది దేవునికి అవసరం లేదు....ఏది కూడ క్రమము లేకుండగా చేయుడానికి పూనుకోవద్దు, అది గొప్ప నషామునకు వాటిల్లుతుంది, లేదా ఉద్రేకము వలన ఆస్తిని బలిచేయవలసి వస్తుంది, ఉత్సాహంతో కదిలించే గంభీరమైన, ప్రసంగాలు ఇవి దేవుని క్రమము కాదు, విజయం సాదించాల్సిన అవసరం ఉన్నది, సరైన విధానములో మితముగాను మరియు సరైన ధ్యానం మరియు విలువైన సూత్రాలు మరియు ఉద్దేశములు లేకపోవడంతో ఓటమి అవుతుంది.- సెలెక్ట్డ్ మెసెజన్స్ 2:362, 363 (1893). శ్రీమతి వైట్ గారు వ్రాసిన దానికి, డిసెంబర్ 22, 1893న బాటిల్ క్రీక్ నందు ఒక ప్రముఖ సేవకుడు ఒకలేఖకు సమాధాన మిస్తూ న్నాడు వీలైనంత త్వరగా. ఒక మరియు రెండు వందల మంది ప్రజలు నగరాన్ని విడిచిపెట్టి గ్రామీణ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధపడుచున్నారు. సెలెక్ట్డ్ మెసెజన్స్ 2: 361-364.] LDETel 84.2

నగరాలు నుండి పారిపోవుటకు సూచన LDETel 84

తొలి శిష్యుల్లాగే, ఏకాంతముగాను మరియు ఒంటరి ప్రదేశాల్లో శరణు కోరడానికి మనము బలవంతము చేయబడులకు సమయము ఎంతో దూరములో లేదు, రోమా సైన్యాలచే యెరూషలేము ముట్టడించగా యూదు క్రైస్తవులు పారిపోవటానికి సూచనగా ఉన్నట్టు, మన దేశంలో అధికార భావన, పోపులు మార్చిన సబ్బాతు అమలుచేస్తున్న చట్టం మనకు ఒక హెచ్చరికగా ఉంటుంది. పర్వతాల మద్య ఏకాంత ప్రదేశాలలో విశ్రాంతి గృహాలకు చిన్నపిల్లలతో సహా అందరు పెద్ద నగరాలను విడిచి వెళ్ళడానికి ఇది సమయం అవుతుంది. టెష్టమోనీస్ ఫర్ ది చర్చి 5:464, 465 (1885) LDETel 84.3

మరణా శాసనం ప్రకటించిన తర్వాత కూడ భక్తులు కొందరు నగరములలో ఉన్నారు LDETel 85

శ్రమ కాలములో మనము పట్టణాల నుండి, గ్రామాల నుండి తప్పించుకుని పారిపోవాలి అయితే దుష్టులు పరిశుద్దుల ఇళ్లలోకి కత్తితో ప్రవేశిస్తారు. ఎల్లీ రైటింగ్స్ 34 (1851)పరిశుద్ధులు పట్టణాలను, గ్రామాలను విడిచిపెట్టినప్పుడు, దుష్టులు తరుముచు వారిని చంపుటకు ప్రయత్నించెదరు కానీ దేవుని ప్రజలను చంపడానికి లేపబడిన కత్తులు గడ్డిపరకవలే విరిగిపడిపోయాయి. దేవుని దేవదూతలు భక్తులను కాపాడును.ఎర్లీ రైటింగ్స్ 284, 285 (1858) LDETel 85.1

ఆజ్ఞలను ఆచరిస్తూ నివసించే వారిని చంపటానికి సాదరణ శాసనం ఒక నిర్దిష్ట సమయాన్ని పేర్కొంటున్నప్పటికీ వారి విరోదులు కొన్ని సందర్బల్లో ఆ విషయం తెలుకొని నిర్దిష్ట సమయానికి ముందే వారిని చంపటానికి ప్రయత్నాలు చేస్తారు. అయితే ప్రతీ విశ్వాసి చుట్టూ మోహరించి ఉన్న బలాడ్యులైన రక్షక భటుల్ని ఎవరూ దాటి ముందుకు పొలేరు. కాని వారి గ్రామాల నుంచి పారిపోతున్నప్పుడు వారిని తమ LDETel 85.2

శత్రవులు ఆటకాయిస్తారు. కాని వారి మీదకి వేసిన కత్తులు ముక్కలై గడ్డి పరకల్లా రాలిపోతాయి. ఇతరులను యుద్ధ శూరుల రూపంలో ఉన్న దేవదూతలు ఆదుకొని కాపాడ్డారు.- మహా సంఘర్షణ 631(1811) LDETel 85.3