Go to full page →

47—చివరి అరెస్టు AATel 350

రోము చెరసాలనుంచి విడుదల అనంతరం సంఘాల్లో పౌలు నిర్వహిస్తున్న సేవను తన విరోధులు పరిశీలించకపోలేదు. నీరో ఆధ్వర్యంలో సాగిన హింస ఆరంభం నుంచి క్రైస్తవులు నిషేధానికి గురైన తేగ. కొంతకాలం అయిన తర్వాత యూదులు ఒక పథకం వేశారు. రోము నగరాన్ని తగలబెట్టటానికి ప్రజల్ని రెచ్చగొడున్నాడన్న నేరం పౌలు పై మోపాలని తీర్మానించుకున్నారు. పౌలు ఆ నేరానికి పాల్పడలేదని వారిలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. కాని ఏ ఆధారమూ లేకపోయినా అలాంటి నేరమే అతని నాశనానికి కారణమౌతుందని వారికి తెలుసు. వారి కృషి ఫలితంగా పౌలు మళ్లీ అరెస్టు అయ్యాడు. అతణ్ని ఖైదులో వేశారు. అదే అతని చివరి ఖైదు. AATel 350.1

పౌలు రెండోసారి రోముకు చేసిన ఓడ ప్రయాణంలో లోగడ పౌలుతో ప్రయాణించిన అనుచరుల్లో చాలామంది ఈసారి కూడా పౌలుతో వెళ్ళారు. చాలా మంది తనతో కూడా వెళ్ళి తన శ్రమల్లో పాలుపొందటానికి తమ ఆకాంక్షను వ్యక్తం చెయ్యగా పౌలు తిరస్కరించాడు. తమ ప్రాణాలకు ముప్పుతెచ్చుకోవద్దని చెప్పాడు. తన ముందున్న పరిస్థితి కిందటిసారి పరిస్థితిలాకాక కొంత నిరాశాజనకంగా కనిపిస్తుంది. నీరో సాగించిన హింస పర్వవసానంగా రోములో క్రైస్తవుల సంఖ్య బాగా తగ్గిపోయింది. వేల ప్రజలు తమ విశ్వాసానికి హతసాక్షులయ్యారు. అనేకులు నగరాన్ని విడిచి పెట్టి వెళ్ళిపోయారు. మిగిలివున్నవారు భయం పడగనీడలో బతుకు తున్నారు. AATel 350.2

రోముకు చేరిన తర్వాత పౌలును ఒక చీకటి కొట్టులో బంధించి ఉంచారు. తన పరుగు ముగిసేవరకూ అతడు ఆ చీకటి కొట్టులోనే ఉండాలి. ఆ పట్టణానికి ఆదేశానికి వ్యతిరేకంగా అతి నీచమైన భయంకరమైన నేరాలు చేయటానికి ప్రజల్ని రెచ్చగొట్టాడన్న ఆరోపణను ఎదుర్కొంటున్న అతణ్ని ప్రజలు అసహ్యించుకున్నారు. AATel 350.3

తనతో ఉండి సేవలందిస్తున్న కొద్దిమంది సహచరులు ఇప్పుడు పౌలును విడిచి పెట్టి వెళ్ళిపోతున్నారు. కొందరు అతన్ని పూర్తిగా విడిచి పెట్టి వెళ్ళిపోతే కొందరు కర్తవ్య నిర్వహణార్థం వివిధ సంఘాలకు వెళ్ళారు. మొదటగా వెళ్ళిపోయిన వారు పుగెల్లు, హెర్మొగెనేలు, ఆ తర్వాత అపొస్తలుని చుట్టూ మూసుకొస్తున్న శ్రమల మేఘాల్ని చూసి అధైర్యం చెంది శ్రమల్లో వున్న పౌలుని విడిచి పెట్టి దేమా వెళ్ళిపోయాడు. పౌలు పంపగా క్రీస్కే గలతియ సంఘాలకు, తీతు దల్మతియ సంఘాలకు, తుకికు ఎఫెసు సంఘాలకు వెళ్ళారు. ఈ అనుభవం గురించి తిమోతికి రాస్తూ పౌలిలా అన్నాడు, “లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు” 2 తిమోతి 4:11. వయసువల్ల శారీరక శ్రమవల్ల దుర్బలతలవల్ల, రోము దేశపు ఖైదు వ్యవస్థలోని తేమగా ఉండే చీకటి కొట్లలో బందీ అయి ఉండటంవల్ల శక్తి ఉడిగిపోయివున్న అపొస్తలునికి సహోదరుల సపర్యలు ముందెన్నటికన్నా ఇప్పుడెంతో అవసరమయ్యాయి. పౌలుకి ప్రియమైన శిష్యుడు మిత్రుడు అయిన లూకా సేవలు అతనికి ఎంతో ఆదరణ చే కూర్చాయి. పౌలు సహోదరులతో మాట్లాడటానికి, బైట ప్రపంచంతో వ్యవహరించటానికి లూకా సేవలు బహుగా ఉపకరించాయి. AATel 350.4

లుకు కలిగిన ఈ శ్రమకొలంలో అతణ్ని ఒనేసిఫారు తరచుగా సందర్శించటం అతనికి ఉత్సాహాన్నిచ్చింది. అపొస్తలుని చెరసాల జీవిత భారాన్ని తగ్గించేందుకు ఈ ఎఫెస్సీయ సహృదయుడు తాను చేయగలిగిన సహాయమంతా చేశాడు. ఒనేసిఫోరు స్వతంత్రుడుకాగా తన ఉపదేశకుడు బంధకాల్లో ఉన్నాడు. కనుక అతడు పౌలు స్థితిని మెరుగుపర్చటానికి తాను చేయగలిగిన పనంతా చేసి పౌలుకి సాంత్వన చేకూర్చాడు. AATel 351.1

అపొస్తలుడు రాసిన చిట్టచివరి ఉత్తరంలో ఈ ప్రియ శిష్యుడి గురించి ఇలా అన్నాడు: “ప్రభువు ఒనేసిపోరు ఇంటివారియందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి, కనుగొని, అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపకారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరము పొందునట్లు ప్రభువనుగ్రహించునుగాక” 2 తిమోతి 1:16-18. AATel 351.2

ప్రేమపట్ల సానుభూతి పట్ల కోరికను దేవుడే హృదయంలో పెట్టాడు. గెత్సెమనే తోటలో హృదయ వేదనననుభవిస్తున్న తరుణంలో క్రీస్తు తన శిష్యుల సానుభూతి కోసం ఎదురుచూశాడు. శ్రమలు బాధల విషయంలో లెక్కలేనితనంగా ఉన్నట్లు పైకి కనిపించినా పౌలు కూడా సానుభూతికోసం సాహచర్యం కోసం ఎదురుచూశాడు. విడువబడి ఒంటరిగా వున్న సమయంలో తన విశ్వసనీయతకు సంకేతమైన ఒనేసిఫోరు సందర్శనం తన జీవితమంతా ఇతరుల సేవలో గడిపిన ఆ ఉత్తముడి హృదయానికి ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని తెచ్చింది. AATel 351.3