(1870) 2T 374 CDTel 134.5
222. మితం లేకుండా తిన్నప్పుడు మన శరీరాలపట్ల పాపం చేస్తాం. సబ్బాతు రోజున దైవ మందిరంలో, మండుతున్న దైవ వాక్య సత్యాల కింద కూర్చుని, తిండిబోతులు నిద్రపోతారు. నిద్రపోకుండా కళ్లు తెరిచి కూర్చోలేరు. గంభీరంగా సాగుతున్న ప్రసంగాన్ని వినలేరు గ్రహించలేరు. అలాంటి వారు దేవునికి చెందే తమ శరీరాత్మలతో ఆయన్ని మహిపర్చగలరని మీరనుకుంటారా? మహిమ పర్చలేరు. ఆయన్ని అవమాన పర్చుతారు. అజీర్తి రోగి అనుసరిస్తున్న మార్గం ఇదే. క్రమబద్దతను పాటించే బదులు తిండి అదుపులో ఉండి చిరుతిళ్లు తింటాడు! అతడి పని ఆఫీసు గదుల్లో సాగే పనికి సంబందించినది అయితే, జీర్ణక్రియకు తోడ్పడే ఆరుబయట ప్రాణవాయువు అతడికి లభించదు. తన ఆరోగ్యానికి కావలసినంత వ్యాయామం అతడికి ఉండకపోవచ్చు. CDTel 134.6
(1905) M.H.307 CDTel 135.1
223. ఇతర దినాలకన్నా వ్యత్యాసంగా సబ్బాతు రోజున ఎక్కువ ధారాళంగా గాని, ఎక్కువ రకాల వంటకాలతోగాని ఆహారాన్ని సరఫరా చెయ్యకూడదు. దీనికి బదులు ఆధ్యాత్మిక విషయాల ప్రాముఖ్యాన్ని అవగాహన చేసుకోటానికి మనసు నిర్మలంగాను, స్థిరంగాను ఉండేందుకు ఆహారం మరింత సామాన్యంగా ఉండాలి. తక్కువ ఆహారం తినాలి. ఆహారంతో కూరుకుపోయిన కడుపంటే కూరుకు పోయిన మెదడు. అతి ప్రశస్త వాక్యపరిచర్య జరగవచ్చు కాని అనుచిత ఆహారంవల్ల మనసు అస్తవ్యస్తమవ్వటం మూలాన అది అవగాహన కాకపోవచ్చు. సబ్బాతు దినాన ఎక్కువ తినటం వల్ల, ఆనాటి పరిశుద్ధ తరుణాల ద్వారా ఉపకారం పొందటానికి అనేకులు తమని తాము అనర్హుల్ని చేసుకుంటారు. CDTel 135.2
[సబ్బాతునాడు ఆరాధనలో కునికిపాట్లు-93] CDTel 135.3
[మితాహారం మానసిక శక్తిని నైతికశక్తిని కూర్చుతుంది-85,117,206] CDTel 135.4
[ఆధ్యాత్మికత పై అతి తిండి ప్రభావం-56,57,59,257] CDTel 135.5
[మనసు పై అతి తిండి ప్రభావం-74] CDTel 135.6
[శిబిర సమావేశాల్లో అతి తిండి-57,124] CDTel 135.7
[ఆత్మహత్యా అభ్యాసాలు-202] CDTel 135.8
[డిజర్టు అతి తిండికి శోధన-538,547,550] CDTel 135.9
[సంఘ శ్రమలకు మూలం-65] CDTel 135.10
[తిండిబోతుతనం యుగంలో ప్రబలుతున్న పాపం-35] CDTel 136.1
[అతి తిండి దుర్వ్యయానికి దారి తీస్తుంది-263] CDTel 136.2
[నిర్మల మనస్సాక్షిని కాపాడుకోటం-263] CDTel 136.3
[మిత రాహిత్యం , అతితిండి తల్లులు ప్రోత్సహించేవి-351,354] CDTel 136.4