(1905) M.H.308,310 CDTel 136.8
225. అతి తిండి మందకొడి స్వభావం కలవారికి హాని చేస్తుంది. వీరు మితంగా తిని ఎక్కువ వ్యాయామం చెయ్యాలి. అద్భుతమైన స్వాభావిక సమర్థతలు గల స్త్రీలు పురుషులు అనేకులున్నారు. ఆహార వాంఛను ఉపేక్షించటంలో ఆత్మనిగ్రహం పాటిస్తే తాము సాధించగలిగిన దానిలో సగం కూడా వారు సాధించలేకపోతున్నారు. CDTel 136.9
రచయితలు, వక్తలు ఇక్కడే విఫలులవుతున్నారు. చక్కగా భోజనం చేసిన తర్వాత ఆఫీసుల్లో కూర్చుని చేసే పనుల్లో, చదవటంలో, అధ్యయనం చెయ్యటంలో లేదా రచనలు చెయ్యటంలో నిమగ్నమౌతారు. శరీర వ్యాయామానికి సమయం పెట్టరు. పర్యవసానంగా తలంపులు మాటలు సాఫీగా నిరాటంకంగా సాగవు. హృదయాన్ని స్పృశించటానికి అవసరమైన శక్తితోను తీవ్రతతోను వారు రాయలేరు లేదా మాట్లాడలేరు. వారి ప్రయత్నం బలహీనంగా ఉండి నిష్పలమౌతుంది. CDTel 137.1
ఎవరిమీద ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయో, మరీ ముఖ్యంగా ఎవరు ఆధ్యాత్మికాసక్తుల్ని పరిరక్షించే బాధ్యత వహిస్తారో వారు గ్రహించే మనసు చురకైన అవగాహన కలవారై ఉండాలి. అందరికన్నా మించి, వారు మితాహారులై ఉండాలి. వారి భోజన బల్ల మీద వేపుళ్లు, పోపు పెట్టిన వంటకాలతో కూడిన హానికరమైన భోజనం ఉండకూడదు. CDTel 137.2
బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తీవ్ర పర్యవసానాలు ఆధారపడే తీర్మానాలు చేయాల్సి వస్తుంది. వారు తరచుగా వేగంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఈ పనిని నిష్కర్ష అయిన ఆశానిగ్రహం పాటించేవారే జయప్రదంగా చెయ్యగలుగుతారు. శారీరక మానసిక శక్తుల సముచిత వినియోగం జరిగినప్పుడే మనసు బలో పేతమౌతుంది. శ్రమ అంత ఎక్కువ కాకపోతే, భారం పడ్డ ప్రతీసారీ నూతన శక్తి వస్తుంది. అయితే ముఖ్య ప్రణాళికలు పరిగణించాల్సినవారు, ముఖ్యతీర్మానాలు చెయ్యాల్సినవారి కృషి అనుచితాహార పర్యవసానాల వల్ల మేలుకన్నా ఎక్కువ కీడు జరుగుతుంది. అస్తవ్యస్తమైన అన్నకోశం మనసును అస్తవ్యస్తం చేస్తుంది. అది తరచు ఆగ్రహం, ఆయాసం, అన్యాయం పుట్టిస్తుంది. అనుచిత ఆహార అలవాట్ల కారణంగా సంభవించే వ్యాధిగ్రస్త పరిస్థితుల ఫలితంగా, లోక శ్రేయానికి దోహదపడి ఉండే అనేక ప్రణాళికల్ని పక్కన పెట్టటం, అన్యాయమైన, హింసాత్మకమైన, క్రూరమైన చర్యలు చేపట్టటం జరుగుతుంటుంది. CDTel 137.3
ఆఫీసుల్లో కూర్చుని పనిచేసేవారికి, మెదడుతో పనిచేసేవారికి ఓ సూచన. నైతిక ధైర్యం, ఆత్మనిగ్రహం కలవారు దీన్ని ప్రయత్నించటం మంచిది. ప్రతీ భోజనానికి రెండు లేక మూడు రకాల ఆహార పదార్థాల్ని మాత్రమే తీసుకుని ఆకలి తీర్చుకోటానికే తినాలి. అంతకన్నా ఎక్కువ తినకూడదు. ప్రతి దినం చురుకుగా వ్యాయామం చేసి మేలు కలుగుతుందో లేదో చూడండి. CDTel 137.4
క్రియాశీలమైన శారీరక శ్రమచేసే బలమైన మనుషులు తాము తినే ఆహారం పరిమాణం విషయంలోనే గాని నాణ్యత విషయంలోనేగాని ఆఫీసుల్లో కూర్చుని పనిచేసే వారంత జాగ్రత్తగా ఉండనక్కరలేదు. అన్నపానాల విషయంలో ఆత్మనిగ్రహం కలిగి ఉండే వీరికి సయితం మెరుగైన ఆరోగ్యం ఉండవచ్చు. CDTel 138.1
తమ ఆహారం విషయంలో ఖచ్చితమైన నిబంధన ఒకటి ఉంటే బాగుండునని అనేకులు భావిస్తారు. వారు ఎక్కువ తిని ఆనక బాధపడ్డారు. కనుక ఏమి తినాలి ఏమి తాగాలి అన్న వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇది పద్ధతి కాదు. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఖచ్చితమైన నియమం నిర్దేశించ లేడు. ప్రతీ వ్యక్తి తన బుద్ధిని జ్ఞానాన్ని ఉపయోగించి ఆత్మనిగ్రహం పాటిస్తూ నియమబద్ధంగా క్రియాచరణ చేపట్టాలి. CDTel 138.2
[రాత్రి భోజనం ఆలస్యంగా తినటం హానికరం-270] CDTel 138.3