(1909) 9T 158 CDTel 13.2
25. సెవెంతుడే ఎడ్వంటిస్టులు ప్రాముఖ్యంగల సత్యాన్ని ప్రకటిస్తున్నారు. నలభై సంవత్సరాలకు పైచిలుకు క్రితం ఆరోగ్య సంస్కరణ పై ప్రభువు మనకు ప్రత్యేకమైన వెలుగు ఇచ్చాడు. అయితే ఆ తెలుగులో మనం ఎలా నడుస్తున్నాం? దేవుని ఉపదేశానికి అనుగుణంగా నివసించటానికి ఎందరు నిరాకరిస్తున్నారు? ఒక ప్రజగా, మనకు వచ్చిన వెలుగుకి దీటుగా మనం పురోగమించాలి. సంస్కరణ సూత్రాల్ని అవగాహన చేసుకుని, గౌరవించటం మన విధి. మితానుభవాంశం పై మనం అందరికన్నా ముందంజలో ఉండాలి. అయినా ఈ అంశంపై దేవుడు మనకిచ్చిన వెలుగును ఖాతరు చెయ్యని విద్యావంతువైన సంఘసభ్యులు, సువార్త బోధకులు సయితం మనలో ఉన్నారు. వారు తాము మెచ్చింది తమకు నచ్చింది తింటారు. తమకు నచ్చినట్లు పనిచేస్తారు. CDTel 13.3
మన ఉద్యమంలో బోధకులు ఉపదేశకులు నాయకులు అయినవారు ఆరోగ్య సంస్కరణ పరంగా బైబిలు పునాదిపై ధృఢంగా నిలబడి మనం లోక చరిత్ర చివరి దినాల్లో నివసిస్తున్నామని విశ్వసించే వారికి సూటిగా సాక్ష్యం ఇవ్వాల్సి ఉన్నారు. దేవుని సేవించేవారు, తమకోసం తాము నివసించేవారి మద్య విభజనరేఖ గీయటం అవసరం. CDTel 13.4
26. “మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు” మనలను “సమస్తమైన దుర్నీతినుండి.. విమోచించి, సత్ క్రియలయందాసక్తి గల ప్రజలను తనకోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొన్న” ప్రభుపుకొరకు ఎదురు చూచేవారమైన మనం, త్వరలో రానున్న మన రక్షకుని రాక పై విశ్వాసం లేని మతావేశపరులకన్నా వెనకబడి ఉందా నూ? తనకోసం పవిత్రపర్చుకుని తన సొత్తుగా చేసుకోటానికి మరణం చూడకుండా ఎవరిని ఆయన పరలోకానికి కొనిపోతాడో ఆ ప్రత్యేక ప్రజలు మంచిపనులు చెయ్యడంలో ఇతరులకన్నా వెనక ఉండకూడదు. శరీర సంబంధమైన , ఆత్మ సంబంధమైన సమస్త దుర్నీతి నుంచి శుద్ధిపొంది దైన భీతితో పరిపూర్ణ పరిశుద్ధత సాధించే కృషిలో వారు లోకంలో ఏతరగతి ప్రజలకన్నా ముందంజలో ఉండాలి. ఎందుచేతనంటే వారి నమ్మిక ఇతరుల నిమ్మికకన్నా ఉన్నతమైనది. CDTel 13.5