(1872) 5T 196,199 CDTel 149.3
236. ఈ ప్రజలకి దేవుడు గొప్ప వెలుగును అనుగ్రహిస్తున్నాడు. అయినా ఆయన మనల్ని శోధనకు అతీతంగా ఉంచటం లేదు. అయినా ఎక్రోను దేవుళ్ల సహాయం అర్థించేవారు మనలో ఎవరున్నారు? ఈ చిత్రాన్ని చూడండి. ఇది ఊహా చిత్రం కాదుసుమా. సెవెంతుడె ఎడ్వంటిస్టులు సహా, ఎంతమందిలో ఈ ప్రధాన లక్షణం కనిపిస్తుంది? బాగా స్పృహ కలిగి ఉన్న, దురభిమానం స్వయం సమృద్ధతతో నిండిన, కదలలేని ఒక రోగి, దేవుడు తన కృప చొప్పున తన ప్రలుగా మనం ఆచరించటానికి అనుగ్రహించిన ఆరోగ్య చట్టాల్ని, జీవిత చట్టాల్ని స్వేచ్ఛగా ద్వేషిస్తాడు. తన వాంఛల్ని తృప్తిపర్చే విధంగా అతడి ఆహారాన్ని తయారు చెయ్యాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో ఉన్న భోజనం కూర్చుకుని భోజనం చేసేకన్నా అతడు హోటలుకి వెళ్ళి తినటానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అక్కడ అడ్డు అదుపు లేకుండా తినవచ్చు. ఆరోగ్యసంస్కరణ వాది అయిన అతడు దాని ప్రాథమిక నియమాల్ని తుంగలో తొక్కుతాడు. ఉపశమనం కోర్తాడు. కాని ఆత్మత్యాగ మూల్యం చెల్లించకుండా దాన్ని పొందాలని చూస్తాడు. అతడు వక్రా ఆహార ఆలయంలో పూజలు చేసే వ్యక్తి. అతడు విగ్రహారాధ కుడు. దేవుని ఘనపర్చటానికి వినియోగం కావలసిన పరిశుద్ధమైన, సమున్నతమైన శక్తులు బలహీనమై సేవకు నిరుపయోగ మౌతాయి. మండిపడే స్వభావం, తికమకపడే మనసు, దడపుట్టించే నరాలు, ఇవి ప్రకృతి చట్టాల్ని నిర్లక్ష్యం చేసినందువల్ల కలిగే విపరిణామాలు. CDTel 149.4