(1890) C.T.B.H.83 CDTel 160.2
246. ఆహారం ఆరోగ్యం పై శక్తిమంతమైన ప్రభావం చూపుతుందన్న అంశం పై అనేకమంది విద్యార్థులు అజ్ఞానులవ్వటం శోచనీయం. కొందరు ఆహారవాంఛను నియంత్రించటానికి కృతనిశ్చయంతో కృషిచెయ్యరు లేదా తినేటప్పుడు ఎక్కువ తింటారు. కొందరు శోధన వచ్చినప్పుడల్లా చిరుతిళ్లు తింటారు. క్రైస్తవులమని చెప్పుకునేవారు, ఎందుకు తమ మనసులు చురుకుగా లేవు? ఎందుకు తమ మతాసక్తులు అంత బలహీనంగా ఉన్నాయి? అన్న సమస్యలికి పరిష్కారం కావాలనుకుంటే అనేక సందర్భాల్లో వారు తమ భోజన బల్లను దాటి వెళ్లాల్సిన అవసరముండదు. దానికి కారణం ఇక్కడే ఉంది. CDTel 160.3
అనేకులు తమ తిండి వాంఛ కారణంగా దేవున్ని విడిచి పెడతారు. పిచ్చుక పడిపోవటం గుర్తించే ఆయన, తలలోని వెంట్రుకల లెక్క ఎరిగిన ఆయన శరీర శక్తుల్ని బలహీనపర్చి, మేధను మొద్దుబార్చి, నైతిక స్పృహను నాశనం చేసే వక్ర తిండి తినేవారి పాపాన్ని గుర్తిస్తాడు. CDTel 160.4