(1875) 3T 490,492 CDTel 164.3
253. ఆత్మల భావిగతిని నిర్ణయించాల్సి ఉన్న వర్తమానమైన చివరి హెచ్చరికా వర్తమానాన్ని ప్రకటిస్తున్న మనుషులు తాము ఇతరులకు ప్రకటించే సత్యాల్ని తమ సొంత జీవితాల్లో ఆచరించాలి. తిండిలోను, తాగే పానాల్లోను, ధరించే బట్టల్లోను, పవిత్ర సంభాషణలోను ప్రవర్తనలోను వారు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. తిండిబోతుతనం క్షుద్ర ఆవేశాలకు లోనై ప్రవర్తించటం, ఘోరపాపాలకు పాల్పడటం-వీటిని లోకమంతటా ఉన్న అనేకమంది క్రీస్తు అనుచరులు పరిశుద్ధతా వస్త్రం ముసుగు కింద కప్పి ఉంచుతారు. శ్రేష్టమైన స్వాభావిక సమర్థతలు గల వ్యక్తులున్నారు. అన్ని విషయాల్లోను మితంగా ఉన్నట్లయితే సాధించగల దానిలో సగం కూడా వారు సాధించలేకపోతున్నారు. అతి తిండి, శరీరేచ్చల తృప్తి మనసును మసకబార్చి, శరీరశక్తిని తగ్గించి, నైతిక శక్తిని బలహీనపర్చుతాయి. వారి మాటల్లో శక్తి ఉండదు. శ్రోతల హృదయాన్ని స్పృశించేందుకు అవి పరిశుద్ధాత్మవల్ల శక్తిమంతం అవ్వవు. CDTel 164.4
మన మొదటి తల్లిదండ్రులు ఆహారవాంఛ తృప్తి ద్వారా ఎదెనుని పోగొట్టుకున్నట్లు తిండి తపనను శరీరేచ్చలను ఉపేక్షించటం ద్వారా మాత్రమే ఎదెనుని తిరిగి సంపాదించగలమన్న నిరీక్షణ ఒక్కటే మనకున్నది. ఆహారం విషయంలో మితం, ఉద్రేకాలు ఉద్వేగాల నియంత్రణ, మేధను సంరక్షించి, మానసిక, నైతిక శక్తిని సమకూర్చుతుంది. మనుషులు తమ ప్రవృత్తులని ఉన్నత శక్తుల అదుపులో ఉంచటానికి, మంచి చెడ్డలను పరిశుద్ధమైన సామాన్యమైన విషయాన్ని గుర్తించటానికి సామర్థ్యాన్నిస్తుంది. శోధనను ఎలా ప్రతిఘటించాలో తన జీవితం ద్వారా మానవుడికి చూపించటానికి పరలోకంలో తన గృహాన్ని విడిచి పెట్టి ఈ లోకానికి రావటంలో క్రీస్తు చేసిన త్యాగం స్పృహగల వారందరు సంతోషంగా తమ్మును తాము ఉపేక్షించుకుని, క్రీస్తుతో కలసి ఆయన శ్రమల్లో పాలు పంచుకుంటారు. CDTel 164.5
యెహోవాయందలి భయం జ్ఞానానికి మూలం. క్రీస్తు జయించినట్లు జయించేవారు సాతాను శోధనల్ని కాచుకునేందుకు నిత్యం మెలకువగా ఉంటారు. సాతాను పనులు పన్నాగాలు దేవుని కృపలుగా భాష్యం చెప్పటానికి మేధకు హాని కలగకుండా ఉండేందుకు, తిండిని శరీరేచ్చలు ఆవేశాల్ని అదుపులో ఉంచుకోవాలి. అవి చైతన్యవంతమైన మనస్సాక్షి నియంత్రణ కింద ఉండాలి. జయించేవారు అంతిమంగా పొందనున్న బహుమానాన్ని విజయాన్ని అనేకులు ఆకాంక్షిస్తారు. కాని రక్షకునిలా శ్రమను, లేమిని, సంయమనాన్ని భరించటానికి సిద్ధంగా ఉండరు. విధేయత, నిరంతర కృషి ద్వారా మాత్రమే క్రీస్తు జయించినట్లు మనం జయించగలుగుతాం. CDTel 165.1
ఆహార వాంఛకున్న నియంత్రణ శక్తి వేల ప్రజల నాశనానికి హేతువవుతున్నది. కాగా ఈ విషయంలో వారు జయం సాధిస్తే, సాతాను తాలూకు ప్రతీ శోధనను జయించటానికి వారికి నైతిక బలం ఉంటుంది. అయితే తిండికి బానిసలయ్యేవారు క్రైస్తవ ప్రవర్తనను పరిపూర్ణంగా దిద్దుకోటంలో వైఫల్యం చెందుతారు. ఆరువేల సంవత్సరాలుగా మానవుడి నిరవధిక అతిక్రమం దాని ఫలంగా వ్యాధిని బాధను మరణాన్ని తెస్తున్నది. మనం లోకాంతాన్ని సమీపించే కొద్దీ తిని తాగటంలో మునిగితేలటానికి సాతాను శోధన మరింత శక్తిమంతంగా ఉండి, జయించటం మరింత కష్టమౌతుంది. CDTel 165.2
[తిండి విషయంలో ఆత్మోపేక్ష మార్గం ఆరోగ్యానికి రాచబాట-473] CDTel 165.3