(1870) 2T 384,385 CDTel 194.1
313. జ్వరం తీవ్రంగా ఉన్న సందర్భాల్లో కొద్దిదినాలు భోజనం తినకుండా ఉండటం జ్వరాన్ని తగ్గించి నీటి వాడకాన్ని మరింత ప్రయోజనకరం చేస్తుంది. కాని చికిత్స చేస్తున్న వైద్యుడు రోగి వాస్తవిక పరిస్థితిని అవగాహన చేసుకోటం అవసరం. అతడి శరీర వ్యవస్థ బలహీనపడేంత మితంగా అతణ్ని వైద్యుడు తిననివ్వకూడదు. జ్వరం కొనసాగుతుండగా ఆహారం రక్తాన్ని ఉత్తేజపర్చుతుంది. అయితే జ్వరం తగ్గిపోయిన వెంటనే పోషకాహారాన్ని జాగ్రత్తగా వివేకవంతంగా ఇవ్వాలి. ఎక్కువ కాలం లంఖణం చేస్తే, ఆహారం కోసం కడుపు వాంఛ జ్వరం పుట్టిస్తుంది. అది సరిఅయిన, నాణ్యమైన ఆహారం తీసుకోటం ద్వారా నివారణ అవుతుంది. ప్రకృతి పనిచెయ్యటానికి కొంత పదార్థాన్నిస్తుంది. జ్వరం ఉన్నప్పుడు బాధితుడు ఆహారాన్ని కోరితే ఆ కోరికను తృప్తిపర్చటానికి సామాన్య ఆహారం మితంగా ఇవ్వటం అసలు ఇవ్వకుండా ఉండటం కన్నా తక్కువ హానికరం. అతడి మనసు ఇక దేనిమీదా లేకుండా ఉంటే, సాదా ఆహారం కొంచెం ఇవ్వటం ప్రకృతి పై పెద్దభారం మోపదు. CDTel 194.2