(1864) Sp. Gifts IV, 132,133 CDTel 237.3
348. అనుచితంగా తిండి తినే పిల్లలు బలహీనంగా, పాలిపోయి, పెరగకుండా, భయంభయంగా, ఉద్రేకపడుతూ, కోపపడుతూ ఉంటారు. ఘనమైనదంతా ఉన్నతమైనదంతా ఆహారవాంఛకు బలి అవుతుంది. పాశవిక ఉద్రేకాలు ప్రాధాన్యం వహిస్తాయి. అయిదునుంచి పది, పదిహేను సంవత్సరాల వయసులోని బాలల్లో అనే కుల జీవితాలు భ్రష్టత, దుర్మార్గంతో నిండుతున్నాయి. వారికి అన్ని రకాల దుష్టత్వం తెలుసు. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలావరకు తప్పిదస్తులు. ఎవరి అనుచిత మార్గం తమని ఆ అపరాధాల్లోకి పరోక్షంగా నడిపించిందో ఆ తల్లి దండ్రులపై వారి పిల్లల అపరాధాలు మోపబడ్డాయి. తమ భోజనబల్ల మీద మాంసాహార వంటకాలు, మసాలాలతో తయారు చేసిన ఇతర వంటకాలు పెట్టటం ద్వారా వారు తమ పిల్లల్లో తిండి వాంఛను పుట్టించి శోధిస్తారు. ఆ ఆహారం పాశవిక ఉద్రేకాన్ని ఆవేశాల్ని రెచ్చగొడుంది. తమ ఆదర్శం ద్వారా తమ బిడ్డలకి వారు అమితాన్ని నిగ్రహరాహిత్యాన్ని నేర్పిస్తారు. దీనంలో దాదాపు ఏ సమయంలోనైనా తినటానికి వారిని విడిచి పెడ్తారు. ఇది జీర్ణమండల అవయవాలికి అధిక శ్రమ కలిగిస్తుంది. తమ బిడ్డలకి ఉపదేశమివ్వటానికి తల్లులకి ఎక్కువ సమయముండదు. వారి సమయమంతా భోజనబల్లమీద పెట్టటానికి అనారోగ్యదాయకమైన రకరకాల వంటకాలు తయారు చెయ్యటంలో గడిచిపోతుంది. CDTel 237.4
తమ జీవితాల్ని ఫ్యాషన్ ప్రకారం తీర్చిదిద్దుకునేటప్పుడు తమ బిడ్డల జీవితాలు నాశనమవ్వటానికి అనుమతిస్తారు. సందర్శకులు వస్తుంటే వారు తమకు తెలిసినవారందరికంటే విలాసవంతమైన భోజనాన్ని భోజనబల్లమీద పెట్టాలని ఆకాంక్షిస్తారు. దీనికి ఎంతో సమయం ఎంతో ద్రవ్యం పెడతారు. ప్రదర్శన కోసం విలాసవంతమైన, ఆకలి కలిగించే ఆహారం తయారుచేస్తారు. క్రైస్తవులుగా చెప్పుకునేవారు సయితం తమ చుట్టూ ఉండటానికి ఓ తరగతి ప్రజల్ని హంగు ఆర్బాటంతో పిలుస్తారు. ఆ ప్రజల ప్రధాన లక్ష్యం తమకు లభించే కమ్మని వంటకాల్ని ఆరగించటం. ఈ విషయంలో క్రైస్తవుల్లో దిద్దుబాటు రావాలి. తమ సందర్శకులికి మర్యాదగా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా వారు ఫ్యాషన్ కి ఆహారవాంఛకు బానిసలు కాకూడదు. CDTel 238.1