{C.T.B.H.46,47) (1890) C.H.114 CDTel 242.3
356. ఆహారం చేతికి కళ్లెం ఇచ్చేవారు క్రైస్తవ సంపూర్ణతను సాధించటం అసాధ్యం. మీ బిడ్డల ఆహారం ఎంపిక చేసే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే వారి నైతిక స్పృహను సులభంగా మేల్కొల్పలేరు. అనేకమంది తల్లులు తయారుచేసే ఆహారం తమ కుటుంబాలకి ఉచ్చులా ఉంటుంది. పెద్దవారు చిన్నపిల్లలు మాంసం, వెన్న, చీజు, పే స్త్రీలు, మసాలాలు వేసిన వంటకాలు యథేచ్ఛగా తింటారు. ఇవి కడుపుని అస్తవ్యస్తం చెయ్యటంలోను నరాల్ని ఉత్తేజపర్చటంలోను, మేధను బలహీనపర్చటంలోను తమ పనిని అవి చేస్తాయి. రక్తాన్ని తయారుచేసే అవయవాలు అలాంటి వాటిని మంచి రక్తంగా మార్చలేవు. ఆహారంలోని జిడ్డు జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది. చీజు అనారోగ్యదాయకం. పొట్టుతియ్యని గోధుమ బ్రెడ్డులో ఉన్న పోషకత పొట్టుతీసిన పిండితో చేసిన బ్రెడ్డులో ఉండదు. దాన్ని సామాన్యంగా ఉపయోగించటం శరీర వ్యవస్థను ఉత్తమస్థితిలో ఉంచదు. మసాలాలు కడుపు సున్నితమైన పొరలో ముందు మంట పుట్టించి చివరికి దాని సహజ చురుకుదనాన్ని నాశనం చేస్తుంది. రక్తం వేడెక్కుతుంది. పాశవిక ప్రవృత్తులు మేల్కొంటాయి. నైతిక, మానసిక శక్తులు బలహీనమై నీచమైన ఉద్రేకాలకి బానిసలవుతాయి. తల్లి తన కుటుంబం ముందు సామాన్యమైన, అయినా, బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టాలి. CDTel 242.4