(1902) 7T 133 CDTel 261.1
376. ప్రతీ స్థలంలోను పురుషులు స్త్రీలు తమ ప్రాంతంలో దొరికే సహజ ఉత్పత్తుల నుంచి ఆరోగ్యకరమైన ఆహారపదార్థాల్ని తయారు చెయ్యటంలో తమ వరాల్ని వృద్ధి పర్చుకోటానికి ప్రోత్సాహం పొందాలన్నది ప్రభువు సంకల్పం. వారు దేవుని పై ఆధారపడి, ఆయన ఆత్మమార్గ దర్శకత్వంలో తమ నిపుణతను, చాతుర్యాన్ని వినియోగిస్తే సహజ ఉత్పత్తుల్ని ఆరోగ్యదాయక ఆహార పదార్ధాలుగా ఎలా తయారుచెయ్యాలో నేర్చుకుంటారు. మాంసానికి ప్రతిగా ఉపయోగించుకోగల ఆహార పదార్థాల్ని ఎలా తయారు చేసుకోవాలో వారు ఇలా పేదవారికి నేర్పించగలుగుతారు. ఇలా సహాయం పొందినవారు తిరిగి ఇతరులకి నేర్పించవచ్చు. అలాంటి పని అంకిత భావంతోను ఉద్రేకంతోను శక్తితోను ఇంకా జరగాల్సి ఉంది. ఇది ఇంతకు ముందు జరిగి ఉంటే ఈ రోజు ఇంకా ఎక్కువ మంది సత్యంలో ఉండేవారు, ఇంకా ఎక్కువ మంది ఉపదేశించేవారు ఉండేవారు. మన విధి ఏంటోమనం తెలుసుకుందాం. తెలుసుకుని దాన్ని నిర్వర్తిద్దాం. దేవుడు మనకు నియమించిన పనిని చెయ్యటానికి ఇతరులకోసం కని పెడ్తూ మనం నిస్సహాయులం కాకూడదు. CDTel 261.2