(R.S.H. మే 27, 1902) C.H.578 CDTel 24.4
37. మంచి నియమాల ఆచరణలో వైఫల్యం దైవ ప్రజల చరిత్రను మలినం చేస్తుంది. ఆరోగ్య సంస్కరణ ఆచరణలో నిజాయితీ లేదు. సంస్కరణలో వెనుతిరగటం కొనసాగుతుంది. ఫలితంగా ఆధ్యాత్మికత కొరవడి నందున దేవునికి ఘనత కలగటం లేదు. అడ్డుగోడలు నిర్మించబడుతున్నాయి. దైవ ప్రజలు వెలుగులో నడిచి వుంటే అవి కనిపించేవి కావు. CDTel 24.5
ఇలాంటి గొప్ప తరుణాలున్న మనం ఆరోగ్య సంస్కరణ విషయంలో లోకస్తుల్ని మనకన్నా ముందంజలో ఉండనిద్దామా? సవ్యం కాని తిండి ద్వారా మన మనసుల్ని చౌకబార్చుకుని సామర్థ్యాల్ని దిగజార్చుకుందామా? CDTel 24.6
మన భిన్నత ఒక సామెతగా తయారవుతుందా? మనల్ని సహోదరులని పిలవటానికి క్రీస్తు సిగ్గుపడేటంత అక్రైస్తవ జీవితాలు జీవిద్దామా? CDTel 24.7
అలా కాకుండా, దేవుని సమాధానం మన హృదయాన్ని నింపే విధంగా నివసిస్తూ, ఆచరణాత్మకత సువార్తయిన వైద్య విషనరీ సేవను మనం చేయవద్దా? క్రైస్తవులమని ప్రకటించుకున్నందున ఏమి జరుగుతుందో జ్ఞాపకం వుంచుకొని విశ్వాసులు కానివారి మార్గంలో ఆటంక బండల్ని మనం తొలగించవద్దా? క్రైస్తవులమని చెప్పుకుంటూ అపవిత్ర ఉద్రేకాల్ని బలపర్చే తిండి తినటం కన్నా క్రైస్తవుడన్న పేరును విడిచి పెట్టుకోటం మంచిది. CDTel 25.1
ప్రభువు సేవకు మినహాయింపు లేకుండా జీవితాన్ని అంకితం చేసుకోవల్సిందిగా ప్రతీ సంఘ సభ్యుడికీ దేవుడు పిలుపునిస్తున్నాడు. ఖచ్చితమైన దిద్దుబాటుకు పిలుపునిస్తున్నాడు. శాపం కిందపడి సర్వసృష్టి మూలుగుతున్నది. దైవప్రజలు శరీరాత్మల పరంగా సత్యం వలన పరిశుద్ధులై కృపలో నిలవగల స్థానంలో ఉండాలి. ఆరోగ్యాన్ని నాశనం చేసే అలవాట్లను విడిచి పెట్టినప్పుడు వాస్తవిక దైవభక్తి ఏమిటో వారికి స్పష్టంగా గ్రాహ్యమవుతుంది. వారి మత జీవితంలో అద్భుతమైన మార్పు చోటుచేసుకుంటుంది. CDTel 25.2