ఉత్తరం 72, 1880 CDTel 267.2
388. ఎక్కువ వంటపని చెయ్యటం ఎంత మాత్రం అవసరం లేదు. నాణ్యత పరంగా గాని పరిమాణం పరంగా గాని ఆహారం నిస్సారమైంది కాకూడదు. CDTel 267.3
(1870) 2T 367 CDTel 267.4
389. వక్రం కానప్పుడు రుచికి నచ్చేటట్లు ఆ హారం తయారుచెయ్యటం ప్రాముఖ్యం. మనం నియమబద్ధంగా మాంసం, బటర్, కైమాతో చేసిన పయిలు, మసాలాలు, పందికొవ్వు, కడుపులో మంట పుట్టించి, ఆరోగ్యాన్ని నాశనం చేసే పదార్థాల్ని ఉపయోగించం గనుక మనం ఏమి తింటున్నామన్న విషయం ప్రాముఖ్యం కాదన్న అభిప్రాయం కలిగించకూడదు. CDTel 267.5
(1905) M.H.300 CDTel 267.6
390. కేవలం ఆకలి తీర్చుకోటానికే తినటం పొరపాటు. ఆహారం నాణ్యత విషయంలో లేక ఆహారాన్ని తయారు చేసే తీరు విషయంలో ఉదాసీనత ప్రదర్శించకూడదు. ఆహారాన్ని ఇష్టంగా తినకపోతే శరీరానికి పోషణ సరిగా జరగదు. ఆహారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుని విజ్ఞతతోను నిపుణతతోను తయారు చెయ్యాలి. CDTel 267.7