MS 10, 1900 CDTel 288.1
418. క్రీస్తు సువార్త ప్రజల దృష్టికి వచ్చే విధంగా ఆరోగ్యఆహార కృషిని నిర్వహించినప్పుడు అది గొప్ప మేలుగా పరిణమించవచ్చు. శరీరావసరాల్ని తీర్చటానికి ఆహార పదార్ధాల్ని ఉత్పత్తి చెయ్యటం తప్ప మరేమీ సాధించని కృషికి వ్యతిరేకంగా హెచ్చరించటానికి గళమెత్తుతాను. ఆహార పదార్థాల్ని సరఫరా చెయ్యటానికి అంత సమయం, పురుషులు స్త్రీల తాలూకు మేధ ఉపయోగిస్తూ అదే సమయంలో వేలు లక్షల ప్రజలకి జీవాహారాన్ని సరఫరా చెయ్యటానికి ప్రత్యేక కృషి చెయ్యకపోవటం ఘోర తప్పిదం. నిత్య జీవ మార్గాన్ని వెల్లడి చెయ్యటం లక్ష్యం కాని కృషి గొప్ప ప్రమాదాలతో నిండి ఉంటుంది. CDTel 288.2
[ఆరోగ్య ఆహారం, హోటలు పనిని గూర్చి సమగ్ర అధ్యయనానికి 7T 110 -131; C.H. 471-496 చూడండి] CDTel 288.3