(1868) 2T 68 CDTel 332.1
504. జల్లించని ముతక పిండితో చేసిన బ్రెడ్ సమకూర్చే పోషకాలని సన్నని పిండితో చేసిన బ్రెడ్ సమకూర్చలేదు. జల్లించిన గోధుమ పిండితో చేసిన బ్రెడ్ ని సామాన్యంగా ఉపయోగించటం శరీరవ్యవస్థని ఆరోగ్యమైన స్థితిలో ఉంచలేదు. మీ ఇద్దరికి చురుకుగా పని చెయ్యని కాలేయాలున్నాయి. సన్నని పిండితో చేసిన బ్రెడ్ వాడకం మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో వాటిని ఇంకా అధ్వానం చేస్తుంది. CDTel 332.2
(1905) M. H.300 CDTel 332.3
505. బ్రెడ్ తయారీలో ఉపయోగించటానికి మిక్కిలి సన్నని, తెల్లని గోధుమ పిండి ఉత్తమమయింది కాదు. దాని వాడకం ఆరోగ్యమూ కాదు, పొదుపూ కాదు. సన్నని పిండితో చేసిన బ్రెడ్ లో సంపూర్ణ గోధుమ పిండితో చేసిన బ్రెడ్ లో ఉన్నన్ని పోషకపదార్థాలు ఉండవు. అది మల బద్దం ఇంకా ఇతర అనారోగ్య పరిస్థితులకి కారణమౌతుంది. CDTel 332.4
[జల్లించని పిండి శరీరానికి శ్రేష్ఠం-171,495,499,503] CDTel 332.5
[గింజల్ని సహజ స్థితిలో ఉపయోగించటం-481] CDTel 332.6
[జల్లెడ పట్టని సిండి బ్రెడ్ శిఱర సమావేశాల్లో వినియోగం-124] CDTel 332.7
[జల్లిడి. పట్టని పిండితో మంచి బ్రెడ్ చెయ్యటం నేర్చుకోటం ఓ మతపరమైన విధి-392] CDTel 332.8