(1864) ఎపి. గిఫ్ట్ IV, 129 CDTel 352.5
561. సత్యాన్ని విశ్వసిస్తున్నామని చెప్పే ఓ తరగతి ప్రజలున్నారు. వారు పొగాకు, ముక్కు పొడి, టీ లేక కాఫీ వాడరు. కాని వారు వేరే విధంగా ఆహార వాంఛను తృప్తి పర్చుకుంటూ అపరాధులవుతున్నారు. వారు మాంసం వేపుళ్లు, కొవ్వుతో నిండిన పులుసులు కోరతారు. వారి తిండి వాంఛ ఎంతగా వక్రీస్తుందంటే, మిక్కిలి హానికరమైన రీతిగా సిద్ధంచేస్తేనే తప్ప మాంసం సయితం వారిని తృప్తి పర్చదు. కడుపు వేడెక్కుతుంది. జీర్ణక్రియకు సంబంధించిన అవయవాల పై ఎక్కువ భారం పడుతుంది. అయినా తమమీద బలవంతంగా మోపిన భారాన్ని పరిష్కరించటానికి అవి కష్టపడి పనిచేస్తాయి. కడుపు తన పనిని ముగించిన తర్వాత, అది అలసిపోతుంది. అందువల్ల బలహీనత ఏర్పడుతుంది. ఇక్కడే అనేకులు మోసపోయి, ఆహారం కొరవడినందువల్ల ఆ మనోభావం కలిగిందని తలంచి, కడుపుకి విశ్రాంతి ఇవ్వకుండా మరింత ఆహారం తీసుకుంటారు. అది తాత్కాలికంగా ఆ బలహీనతని తొలగిస్తుంది. ఆకలిని ఎంత తృప్తి పర్చితే అంత కావాలని అది గగ్గోలు పెడుంది. CDTel 352.6
[C.T.B.H.47] (1890) C.H.114 CDTel 353.1
562. మసాలాలు మొదట్లో కడుపు పొరని కందజేసి, తుదకు సున్నితమైన ఈ వితానానికుండే స్వాభావిక స్పర్శని నాశనం చేస్తుంది. రక్తం వేడెక్కుతుంది. పాశవిక ప్రవృత్తులు మేల్కొని, నైతికి మానసిక శక్తులు బలహీనమై తుచ్చమైన ఉద్రేకాలకి బానిస అవుతాయి. తల్లి తన కుటుంబం ముందు సామాన్యమైన, బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టటానికి కృషి చెయ్యా లి. CDTel 353.2
(1864) Sp. Gifts IV, 150 CDTel 353.3
563. మాంసాహారం, పోపు పెట్టిన పులుసులు, పలు రకాల కేకులు తినటానికి అలవాటుపడ్డ వ్యక్తులు సామాన్యమైన, ఆరోగ్యదాయకమైన, బలవర్ధకమైన ఆహారాన్ని వెంటనే ఇష్టపడరు. వారి అభిరుచి వక్రమైనందువల్ల ఆరోగ్యదాయకమైన పండ్లు, సాదాబ్రెడ్, కూరగాయలతో కూడిన ఆహారం తినటానికి వారికి ఆకలి ఉండదు. తాము తింటూ వచ్చిన ఆహారానికి వ్యత్యాసంగా ఉన్న ఆహారం తమకు రుచిస్తుందని వారు కనిపెట్టనవసరంలేదు. CDTel 353.4
MS 33, 1908 CDTel 353.5
564. ఆరోగ్య ప్రచురణల ద్వారా వస్తున్న అమూల్యమైన వెలుగుతో మనం ఇష్టానుసారంగా తింటూ, తాగుతూ, అజాగ్రత్తగా, అశ్రద్ధగా నివసిస్తూ, ఉత్తేజకాల్ని. మత్తు పదార్థాల్ని మసాలాల్ని ఉపయోగించలేం. మనం రక్షణను పొందటమో పోగొట్టుకోటమో జరగాల్సి ఉందని, ఆశానిగ్రహం విషయంలో మనం ఎలా వ్యవహరిస్తున్నామన్నది ప్రాధాన్యం, పర్యవసానాలు గల విషయం అని పరిగణించాలి. వ్యక్తిగతంగా మనం మన పాత్రను బాగా నిర్వర్తించటం మనం ఏమి తినాలి ఏమి తాగాలి అన్న విషయంలో, ఆరోగ్యాన్ని కాపాడుకోటానికి ఎలా నివసించాలి అన్న విషయంలో, జ్ఞానయుతమైన అవగాహన కలిగి ఉండటం ప్రాముఖ్యమైన విషయం. తాము ఆరోగ్యసంస్కరణ నియమాల్ని ఆచరిస్తారో లేక నిగ్రహం లేని తమ స్వార్థాశల్ని తృప్తి పర్చుకుంటారో తెలుసుకోటానికి అందరూ పరీక్షించబడున్నారు. CDTel 353.6
[క్రైమా పైలు, మసాలాలు వగైరా పదార్థాల్ని విసర్జించినా, ఆహారాన్ని జాగ్రత్తగా తయారు చెయ్యాలి-389] CDTel 353.7
[ఆరోగ్యాన్ని పాడుచేసి, స్వభావాన్ని వక్రం చేసి, స్వస్తబుద్ధిని మసకబార్చే ఆహారపదార్థాల్ని మసాలాలతో పోపు పెట్టి తయారు చెయ్యటానికి పెట్టే సమయం వృధా పుచ్చిన సమయం - 234] CDTel 353.8
[మసాలా కారాలు, మసాలాలు పిల్లలకి అనుమతించటం - 348,351,354,360] CDTel 353.9
[ఎక్కువ పోపు పెట్టిన ఆహారం అతి తిండిని ప్రోత్సహించి జ్వర పరిస్థితుల్ని సృష్టిస్తుంది-351] CDTel 354.1
[భయస్తురాలు, కోపిష్ఠి అయిన పిల్లని పచ్చళ్లు, మసాలాల భోజనం యధేచ్చగా తిననివ్వటం -574] CDTel 354.2
[మంచి రక్తంగా మార్చటం అసాధ్యం-576] CDTel 354.3
[రమ్యమైన వంటకాలు, మసాలాలు వగైరాల్ని విసర్జించటం - పనివారు ఆచరణాత్మకమైన ఆరోగ్యసంస్కర్తలని నిరూపిస్తుంది-227] CDTel 354.4
[శిబిర సమావేశాలకి తీసుకువెళ్లే ఆహారంలో మసాలాలు, కొవ్వునూనే ఉండకూడదు-124] CDTel 354.5
[వైట్ గృహంలో మసాలాల వాడకం లేదు-అనుబంధం 1:4] CDTel 354.6
[మసాలాలు, మసాలా కారాలు వాడిన ఆహారం నరాల్ని ఉద్రిక్తపర్చి, మేధని బలహీనపర్చుతుంది-356] CDTel 354.7
[మసాలాలు లేని ఆహారం వలన ఒనగూడే మేలు-119] . CDTel 354.8
[మసాలాలు లేని సామాన్య ఆహారపదార్ధాలు అత్యుత్తమం-187] CDTel 354.9
[మసాలాలు వాంఛించే వారిని చైతన్యపర్చటం-779] CDTel 354.10