ఉత్తరం 151, 1901 CDTel 372.1
613. పశువులు పెద్దఎత్తున వ్యాధిగ్రస్తమవ్వటం మనం చూస్తున్నాం. భూమి దుర్నీతితో నిండి ఉంది. పాలు, గుడ్లు ఉపయోగించటం క్షేమం కాదు అనే సమయం వస్తుందని మనకు తెలుసు. ఆ సమయం వచ్చినప్పుడు ప్రభువు మనకు అవసరమైనవి సమకూర్చుతాడని మనకు తెలుసు. “దేవుడు అరణ్యంలో ఆహారం ఏర్పాటు చేస్తాడా? అని ప్రశ్నించటం జరుగుతుంది. ఔను, దేవుడు తన ప్రజలకి ఆహారం సమకూర్చుతాడు అన్న జవాబు ఇవ్వవచ్చు.” CDTel 372.2
పాలు, గుడ్ల స్థానాన్ని ఆక్రమించటానికి లోకం అన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు జరుగుతాయి. ఈ ఆహారపదార్థాల్ని విసర్జించవలసిన సమయం వచ్చినప్పుడు ప్రభువు మనకు తెలియజేస్తాడు. అన్ని విషయాల్లోను తమకు ఉపదేశమిచ్చే దయామయుడైన పరలోకపు తండ్రి ఉన్నాడని అందరూ భావించాలని ఆయన కోరుతున్నాడు. లోకంలో అన్ని ప్రాంతాల్లో ఉన్న తన ప్రజలకి ఆహారం తయారుచేసే కళని నైపుణ్యాన్ని ప్రభువు నేర్పిస్తాడు. జీవితాన్ని సంరక్షించటానికి భూమి ఉత్పత్తుల్ని ఎలా వినియోగించుకోవాలో వారికి ఉపదేశిస్తాడు. CDTel 372.3
[బ్రెడ్ చెయ్యటంలో పాల వినియోగం-196] CDTel 372.4
[సంపూర్ణ గోధుమ రోల్స్ లో పాల వినియోగం-503] CDTel 372.5