హానికరమైందిగా నేను మాంసాన్ని తోసిపుచ్చుతుండగా, తక్కువ హానికరమైన ఇంకోదాన్ని దాని స్థానే ఉపయోగించాలి. ఇది గుడ్లలో ఉంది. భోజనబల్ల మీదనుంచి పాలని తీసివేయవద్దు లేదా వంటలో పాల వాడకాన్ని నిషేధించవద్దు. పాలని ఆరోగ్యంగా ఉన్న ఆవుల నుంచి సేకరించి బాగా కాచి వాడాలి.... CDTel 380.2
కాని పాలు, వెన్న, బటర్ గుడ్లు ఉపయోగించటం ఎంతమాత్రం క్షేమం కాని సమయం వచ్చినప్పుడు దాన్ని దేవుడు వెల్లడి చేస్తాడు. ఆరోగ్యసంస్కరణ సందర్భంగా తీవ్రభావాలు ప్రబోధించకూడదు. పాలు, బటర్, గుడ్లని ఉపయోగించటమనే సమస్య దానికదే పరిష్కరించు కుంటుంది. ప్రస్తుతం ఇది మనకు సమస్య కాదు. మీ మితానుభవం అందరికీ తెలియనివ్వండి. CDTel 380.3
[సందర్భానికి 324 చూడండి] CDTel 380.4
ఉత్తరం 37, 1904 CDTel 380.5
629. డా.— చనిపోతున్నాడంటూ కూరంగ్ బాంగ్ నుంచి ఉత్తరం వచ్చినప్పుడు, అతడు తన ఆహారంలో మార్పుచేసుకోవాలని ఆ రాత్రి ప్రభువు నాకు వర్తమానమిచ్చాడు. అతడికి అత్యవసరంగా ఉన్న పోషక పదార్ధం పచ్చిగుడ్డు రోజుకి రెండులేక మూడుసార్లు తీసుకోటం వల్ల సరఫరా అవుతుంది. CDTel 380.6
ఉత్తరం 127, 1904 CDTel 380.7
630. ఆసుపత్రికి వచ్చేవారికి సరియైన నియమాలకి అనుగుణంగా తయారుచేసిన, ఆరోగ్యదాయకమైన, రుచిగల ఆహారాన్ని ఏర్పాటు చెయ్యాలి. మనం ఎలా నివసిస్తున్నామో వారూ అలాగే నివసించాలని భావించకూడదు.... రోగుల ముందు పెట్టే ఆహారం వారికి మంచి అభిప్రాయం కలిగించేదిగా ఉండాలి. గుడ్లని పలురకాలుగా తయారు చెయ్యవచ్చు. CDTel 380.8