(1864) Sp. Gifts IV, 15,18 CDTel 388.1
643. దేవుడు హెబ్రీ ప్రజల్ని పరలోకాహారంతో పోషించటం కొనసాగించాడు. కాని అది వారికి తృప్తి నివ్వలేదు. భ్రష్టు పట్టిన వారి రుచులు దేన్ని వారికివ్వకుండా చాలామట్టుకు దేవుడు నిలుపుచేశాడో ఆ మాంసాన్ని కోరాయి.... వ్యాధికి దుఃఖానికి కారకుడైన సాతాను తనకు ఎక్కడ ఎక్కువ జయం కలుగుతుందో అక్కడ దైవ ప్రజల్ని సమీపించటానికి చూస్తాడు. నిషిద్ధ ఫలాన్ని తినటానికి అవ్వని జయప్రదంగా నడిపించినప్పటి నుంచి అతడు తిండిని నియంత్రిస్తున్నాడు. అతడు ముందు నమ్మే ఐగుప్తీయులైన మిశ్రిత జనం వద్దకు తన శోధనలతో వచ్చి వారిని గొణగటానికి రెచ్చగొట్టాడు. దేవుడు తమకు సమకూర్చిన ఆరోగ్యదాయకమైన ఆహారంతో వారు తృప్తి చెందలేదు. వక్రమైన వారి ఆకలి వివిధ రకాల భోజనం, ప్రధానంగా మాంసాహారం, కోరింది. CDTel 388.2
ఈ సణుగుడు దాదాపు ప్రజలందరినీ ప్రభావితం చేసింది. దేవుడు మొదట వారి వాంఛల్ని తృప్తిపర్చలేదు, కాని తన తీర్పుల్ని వారిపై కుమ్మరించి, పరలోకంనుంచి మెరుపులతో వారిని దహించివేశాడు. అయినా అవి వారిని వినయుల్ని చేసేబదులు వారి గొణుగుడుని ఎక్కువ చేశాయి. ప్రజలు తమ గుడారాల్లో ఏడుస్తూ తమ కుటుంబాల్లో ఫిర్యాదులు చేయటం మోషే విన్నప్పుడు చాలా అసంతృప్తి చెందాడు. తానున్న క్లిష్ట పరిస్థితిని ఇశ్రాయేలీయుల అవిధేయ స్వభావాన్ని, ప్రజల సందర్భంగా తనను ఆయన ఉంచిన స్థానాన్ని అనగా, ప్రజల బాధల్ని తనవిగా భావించి బాధననుభవించే స్థానాన్ని అతడు ఆయన ముందు విన్నవించుకున్నాడు...... CDTel 388.3
ప్రజలకి నాయకులుగా మెలగేందుకు డెబ్బయి మంది పెద్దల్ని సమావేశ పర్చమని ప్రభువు మోషేని ఆదేశించాడు. వారు వృద్ధులు మాత్రమే కాక న్యాయాధిపతులుగా లేక అధి కారులుగా వ్యవహరించటానికి గౌరవ ప్రతిష్టలు, వివేచన, అనుభవం కలవారు అయి ఉండాలి. “నాయొద్దకు పోగుచేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొకపాలు నీతో కూడ ధరించవలెను.” CDTel 388.4
“నీవు జనులను చూచి యిట్లనుము-మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధ పరచుకొనుడి; మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి-మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు, ఒక్క దినముగాదు, రెండు దినములుగాదు, ఐదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు ఒక నెల దినములు వరకు, అనగా అది మీ నాసికారంధ్రములోనుండి వచ్చి నాకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఏలనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చితిమంటిరి. CDTel 389.1
“అందుకు మోషే - నేను ఈ జనుల మధ్యనున్నాను. వారు ఆరు లక్షల పాదచారలు - వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చెదని చెప్పితిని. వారు తృప్తిగా తినునట్లు వారి నిమిత్తము గొఱ్ఱలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నియు వారి నిమిత్తము కూర్చవలెనా? అనెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెనుయెహోవా బాహుబలము తక్కువైనదా? నామాట నీ యెడల నెరవేరునో లేదో యిప్పుడు చూచెదవు.... CDTel 389.2
“తరువాత యెహోవా సన్నిధినుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేళ్లను రప్పించి పాళెము చుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద రెండు మూరల యెత్తున వాటిని పడవేసెను. కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి. తక్కువ కూర్చుకొనినవాడు మూడు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమ కొరకు పాళెము చుట్టూ వాటిని పరచిరి. CDTel 389.3
“ఆ మాంసము ఇంకవారి పండ్ల సందుననుండగానే, అది నమలక మునుపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను; యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను.” CDTel 389.4
ఈ సందర్భంలో తాము అపేక్షించారు గనుక తమకు మేలు చెయ్యని దాన్ని ప్రభువు వారికిచ్చారు. తమకు మేలు చేసేవాటిని ప్రభువు వద్ద నుంచి పొందటానికి వారు సమ్మతంగా లేరు. తమకు హాని చేసేవాటిని తాము పొందలేదు గనుక వారు మో షేకి, దేవునికి వ్యతిరేకంగా విద్రోహకరమైన సణుగుడుకి పూనుకున్నారు. తమ భ్రష్ట వాంఛలు వారిని నియంత్రించాయి. తాము కోరినట్లు వారికి ప్రభువు మాంసం ఇచ్చి తమ దుష్ట శరీరేచ్ఛల పర్యవసానాల్ని వారిని అనుభవించనిచ్చాడు. జ్వరాలు ఎక్కువమంది ప్రాణాలు తీశాయి. గొణగటంలో అపరాధులు తాము కోరిన మాంసం రుచిచూసిన క్షణంలోనే హతులయ్యారు. తమ ఆహారం ఎంపిక చెయ్యటానికి వారు తమని తాము ప్రభువుకి సమర్పించుకుని, హాని లేని ఆహారాన్ని స్వేచ్చగా తినగలుగుతున్నందుకు ప్రభువుకి కృతజ్ఞులై ఉంటే, వారు దేవుని ప్రసన్నతను కోల్పోయి, ఆ మీదట తమలో చాలామంది తమ తిరుగుబాటు సణుగుడు వల్ల మరణ శిక్ష అనుభవించేవారు కాదు. CDTel 389.5