(R.& H. మే 27, 1902) C.H.575,576 CDTel 395.1
655. క్రీస్తు త్వరితాగమనానికి ఎదురుచూస్తున్నట్లు చెప్పే ప్రజల మధ్య గొప్ప సంస్కరణలు కనిపించాలి. మన ప్రజల మధ్య ఇంకా చోటుచేసుకోని ఆరోగ్యసంస్కరణ జరగాల్సి ఉంది. మాంసాహారం చేసే హానికి కళ్లు తెరవాల్సిన వారు, జంతువుల మాంసం ఇంకా తింటూ తమ శారీరక మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి కీడు చేసుకుంటున్న వారు ఉన్నారు. మాంసాహారం విషయంలో అరకొరగా మారిన అనేకులు దైవ ప్రజల సహవాసం విడిచి పెట్టి వెళ్లిపోతారు. వారితో ఇక నడవరు. CDTel 395.2
శారీరక ఆధ్యాత్మిక శక్తులు కలిసి పనిచేసేందుకు దేవుడిచ్చిన చట్టాలకి విధేయులమై మనం పనిచెయ్యాలి. మనుషులు పైకి భక్తిపరులుగా కనిపించవచ్చు. వారు సువార్తను బోధించవచ్చు కూడా. అయినా వారు అపవిత్రులు, అపరిశుద్ధులు కావచ్చు. తమ మార్గాలు వక్రమై కుంటివారు-విశ్వాసంలో బలహీనులు-పడిపోయి దారి తప్పకుండేందుకు వాక్యపరిచారకులు తమ ఆహార పానాల విషయంలో ఖచ్చితంగా ఆశనిగ్రహం పాటించాలి. దేవుడిచ్చిన అతి గంభీరమైన అతి ప్రాముఖ్యమైన వర్తమానాన్ని ప్రకటించే తరుణంలో ఆహార పానాల విషయంలో తమ అలవాట్ల ద్వారా మనుషులు సత్యానికి వ్యతిరేకంగా పనిచేస్తే వారు ప్రకటించే వర్తమానానికున్న శక్తిని నాశనం చేస్తారు. CDTel 395.3
మాంసాహారులు టీ తాగే వారు తిండిపోతులు విత్తుతున్న విత్తనాలు బాధ, మరణం పంట పండుతాయి. కడుపులోకి పంపే అనారోగ్యకరమైన ఆహారం ఆత్మకు విరోధంగా పోరాడే శరీరాశల్ని బలపర్చి, క్షుద్ర ప్రవృత్తుల్ని వృద్ధిపర్చుతుంది. మాంసాహారం పాశవిక ప్రవృత్తుల్ని పెంపుచేస్తుంది. పాశవిక స్వభావం ఆధ్యాత్మికతను క్షీణింపజేసి, సత్యాన్ని అవగాహన చేసుకోలేనంతగా మనసుని అసమర్ధం చేస్తుంది. CDTel 395.4
శరీరేచ్చలకి దూరంగా ఉండకపోతే శరీర స్వభావం ఆధ్యాత్మిక స్వభావంతో పోరాటం సల్పుతుందని దైవ వాక్యం మనల్ని స్పష్టంగా హెచ్చరిస్తుంది. అనుచితమైన తిండి ఆరోగ్యానికి సమాధానానికి విరోధంగా పోరాడుతుంది. ఇలా మానవుడి ఉన్నత గుణాలకి నీచగుణాలకి మధ్య సంఘర్షణ మొదలవుతుంది. బలమైన, చురుకైన నీచప్రవృత్తులు ఆత్మని హింసిస్తాయి. దేవుడు శుద్ధిచెయ్యని అనుచితాహారం తినటం ద్వారా వ్యక్తిలోని ఉన్నతాసక్తులు ప్రమాదంలో పడతాయి. CDTel 395.5
ఉత్తరం 48, 1902 CDTel 396.1
656. తమ మాటల ద్వారా గాని క్రియల ద్వారాగాని దేవునికి ఆయన సేవకు అపకీర్తి కలిగించకుండేటట్లు, సత్యాన్ని నమ్ముతున్నామని చెప్పేవారు తమ శరీర శక్తుల్ని మానసిక శక్తుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తమ అలవాట్లు, అభ్యాసాల్ని దేవుని చిత్తానికి లోపర్చాలి. మనం మన ఆహారం విషయంలో శ్రద్ధతీసుకోవాలి. మాంసాహారానికి వ్యతిరేకంగా దైవ ప్రజలు స్థిరంగా నిలబడాలని నాకు స్పష్టమైన ఉపదేశం వచ్చింది. శుద్ధమైన రక్తం, నిర్మల మనసు అభిలషిస్తుంటే, తాము మాంసం తినటం విడిచి పెట్టాలని తన ప్రజకి చెప్పిన ప్రభువు వారు ఆ వర్తమానాన్ని ఆచరించకూడదనుకుంటే, ముప్పయి సంవత్సరాలు వారికి ఆ వర్తమానాన్నిస్తాడా? మాంసం తినటం వల్ల పాశవిక స్వభావం బలీయమై ఆధ్యాత్మిక స్వభావం బలహీనపడుతుంది. CDTel 396.2
(1905) M.H.315 CDTel 396.3
657. మాంసాహారం కలిగించే నైతిక కీడులు శారీరకమైన కీడులకి తీసిపోయేవికావు. మాంసాహారం ఆరోగ్యానికి హానికరం. శరీరానికి హాని చేసేది మనసుని ఆత్మని ప్రభావితం చేస్తుంది. మాంసం తినటంతో జతపడివున్న జంతువుల పట్ల క్రూరత్వం గురించి ఆలోచించండి. వధించే వాడి మీద దాన్ని చూసేవారి మీద దాని ప్రభావం గురించి ఆలోచించండి. దేవుడు సృజించిన ఈ మూగప్రాణుల పట్ల మనం కనపర్చాల్సిన కారుణ్యాన్ని అది ఎలా నాశనం చేస్తుంది! CDTel 396.4
MS 22, 1887 CDTel 396.5
658. చచ్చిన జంతువుల మాంసం సామాన్యంగా తినటం వల్ల నైతికంగాను శరీర తత్వ పరంగాను క్షీణత సంభవిస్తుంది. కార్యకారణాల్ని పరిశీలిస్తే, అనేక రకాల అనారోగ్యానికి మాంసాహారం కారణమని వెల్లడవుతున్నది. CDTel 396.6
ఫసిఫిక్ యూనియన్ రికార్డర్, అక్టో.9, 1902 CDTel 397.1
659. మాంసం తినే వారు ఈ అంశం పై దేవుడి చ్చిన హెచ్చరికలన్నింటిని లెక్క చెయ్యరు. తాము సురక్షిత మార్గంలో నడుస్తున్నామనటానికి వారికి నిదర్శనం ఏమీ లేదు. చచ్చిన జంతువుల మాంసం తినటానికి వారికి చిన్న నెపం కూడా లేదు. దేవుని శాపం జంతు సృష్టిమీద ఉంది. మాంసం తిన్నప్పుడు అది అనేకసార్లు కడుపులో కుళ్లి వ్యాధి కలిగిస్తుంది. క్యాన్సర్లు, కంతులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులకి మాంసాహారం కారణం. CDTel 397.2
MS 3, 1897 CDTel 397.3
660. ఈ విషయాల్ని ప్రభువు నాకు చూపించిన రీతిగా ప్రతీవ్యక్తి గ్రహించగలిగితే తమ ప్రవర్తన నిర్మాణం విషయంలో ఇప్పుడు అజాగ్రత్తగా ఉదాసీనంగా ఉన్నవారు; మాంసాహారం కోసం విజ్ఞప్తి చేసేవారు; చచ్చిన జంతువుల మాంసం ఉపయోగించటాన్ని సమర్థిస్తూ నోరు మెదపరు. అలాంటి ఆహారం వారి రక్తనాళాల్లోని రక్తాన్ని మలిన పర్చి, క్షుద్ర పాశవిక ఉద్రేకాల్ని ప్రేరేపిస్తుంది. గ్రహణ శక్తిని, ఆలోచనా శక్తిని బలహీన పర్చటంతో దేవున్ని గూర్చి సత్యాన్ని గూర్చి అవగాహన చేసుకోటం కష్టమౌతుంది. వీరు తమను గూర్చి తాము ఎరుగని స్థితి ఏర్పడుతుంది. CDTel 397.4