(1905) M. H.314 CDTel 398.7
666. తరచు యజమానులు జంతువుల్ని బజారుకి తీసుకువెళ్లి మాంసం కోసం అమ్ముతారు. అవి జబ్బుగా ఉన్నప్పుడు, ఇంకా ఉంచితే చచ్చిపోతాయన్న భయం పుట్టినప్పుడు అమ్ముతారు. వాటిని బజారుకి అమ్మటానికి కొవ్వు పట్టేలా చేసే ప్రక్రియ వ్యాధి కలిగిస్తుంది. వెలుతురు, గాలి లేకుండా మూసి ఉంచినందువల్ల అవి దూళశాలలోని మురికిని పీల్చుకుంటాయి. బహుశా కుళ్లిపోయిన ఆహారం తిని కొవ్వుపట్టవచ్చు కూడా. వాటి దేహాలు మలిన పదార్థాలతో నిండి ఉంటాయి. CDTel 398.8
జంతువుల్ని తరచుగా దూరప్రదేశాలకి రవాణా చేస్తారు. ఆ ప్రక్రియలో అవి బజారుకి చేరకముందు ఎంతో బాధకు గురి అవుతాయి. వాటిని పచ్చని బయళ్ల నుంచి తీసుకువచ్చి ఎన్నో మైళ్లు ప్రయాణం చేసి దూర ప్రాంతాలకి తరలిస్తారు. అలసిపోయి, గంటలకొద్దీ మేత, నీళ్లు లేకుండా ఉన్న ఈ జంతువుల్ని మానవులు భుజించేందు కోసం వధ్యా స్థలాలకి తీసుకు వెళ్తారు. CDTel 399.1
(1864) Sp. Gifts IV, 147, 148 CDTel 399.2
667. మాంసాహారం కలిగించే వ్యాధి వల్లే అనేకమంది మరణిస్తారు. అయినా లోకం బుద్ది తెచ్చుకున్నట్లు కనిపించదు. తరచు జంతువుల్ని దూర ప్రాంతాలకి తీసుకువెళ్లి చంపటం జరుగుతుంటుంది. వాటి రక్తం వేడెక్కుతుంది. అవి కండపుష్టి కలిగి వ్యాయామం లేకుండా ఉంటాయి. దూరప్రదేశాలకి రవాణా కావలసి వచ్చినప్పుడు వాటికి ఎక్కువ మేత పెట్టటం జరుగుతుంది. అవి అలసి ఉంటాయి. ఆ స్థితిలో వాటిని వధించి వాటి మాంసం అమ్ముతారు. వాటి రక్తం మిక్కిలి ఉద్రేకజనకమౌతుంది. వాటి మాంసం తినే వారు విషం తింటున్నారు. కొందరికి వెంటనే హాని సంభవించదు. అయితే కొందరు తీవ్రమైన నొప్పి, జ్వరం, కలరా లేక తెలియని మరో వ్యా ధితో మరణిస్తారు. CDTel 399.3
జబ్బుగా ఉన్నట్లు అమ్మిన వారికి కొంతవరకు, కొన్నవారికి కొన్నిసార్లు తెలిసినా అనేక జంతువుల్ని నగర మార్కెట్టుకి అమ్మటం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దనగరాల్లో ఇది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది. మాంసం తినేవారు తాము జబ్బుగా ఉన్న జంతువుల్ని తింటున్నామని ఎరుగరు. CDTel 399.4
వధకు వచ్చే కొన్ని పశువులు సహజ జ్ఞానం వల్ల తమకు ఏమి జరగనుందో గ్రహించి, కోపంతో నిండి, అక్షరాల పిచ్చివవుతాయి. ఆ స్థితిలో వాటిని వధిస్తారు. వాటి మాంసం మార్కెటులో అమ్మకానికి తయారవుతుంది. వాటి మాంసం విషంతో నిండి ఉంటుంది. దాన్ని తినేవారికి అది కంపం, మూర్చ, ఆకస్మిక మరణం కలిగిస్తుంది. అయినా ఈ బాధ అంతటికీ కారణం మాంసమని గుర్తించటం జరగదు. CDTel 399.5
పశువుల్ని వధ్యశాలకు తీసుకువెళ్లేటప్పుడు కొన్నింటి తో అమానుష్యంగా వ్యవహరించటం జరుగుతుంది. వాటిని తిండి లేకుండా మాడ్చుతారు. అవి గంటలు తరబడి బాధకు తట్టుకున్న తర్వాత వాటిని వధిస్తారు. పందుల్లో వ్యాధి ప్రబలుతున్న తరుణంలో సయితం వాటి మాంసం మార్కెట్టులో అమ్మకానికి వాటిని సిద్ధం చేస్తారు. విషాలతో నిండిన వాటి మాంసం వల్ల అంటువ్యాధులు ప్రబలి గొప్ప జననష్టం వాటిల్లుతుంది. CDTel 400.1