(R.&.H. మే 8, 1883) CDTel 411.3
701. ఆరోగ్యానికి బలానికి మాంసం ముఖ్యం కాదు. లేదంటే తమ పతనానికి పూర్వం ఆదామవ్వలకి ఆహారం సమకూర్చినప్పుడు దేవుడు తప్పుచేసి ఉండాలి. పండ్లు, కూరగాలు, గింజల్లో పోషకపదార్థాలన్నీ ఉన్నాయి. CDTel 411.4
(1905) M.H.316 CDTel 411.5
702. కండర బలం మాంసాహారం నుంచి వస్తుందని భావించటం పొరపాటు. శరీర వ్యవస్థ అవసరాల్ని తీర్చటం, మంచి ఆరోగ్యం కలిగి ఉండటం మాంసం తినకుండా సాధించవచ్చు. పండ్లు, కూరగాయలు, పప్పులతో కలిపి ఉపయోగించే గింజల్లో మంచి రక్తం తయారుచెయ్యటానికి అవసరమైన పోషకాహార పదార్థాలన్నీ ఉన్నాయి. ఈ మూల పదార్థాలు మాంసాహారంలో అంతగా లేవు లేక అంత సంపూర్తిగా లేవు. ఆరోగ్యానికి బలానికి మాంసం అవసరమై ఉంటే ఆదిలో మానవుడికి దేవుడిచ్చిన ఆహారంలో మాంసం ఉండేది. CDTel 411.6
[పోషకాలు లేని ఆహారం విషయంలో మాంసం వాడకం అవసరం లేదు-319] CDTel 411.7