(1905) M.H.316 CDTel 412.1
705. మాంసం తినటం మానేసినప్పుడు తరచు బలహీనంగా నిస్సత్తువగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్నిబట్టి అనేకులు మాంసాహారం తప్పనిసరి అని భావిస్తారు. కాని ఈ తరగతికి చెందిన ఆహారపదార్థాలు ప్రేరకాలుగా పనిచేసి, రక్తాన్ని వేడిచేసి, నరాల్ని ఉత్తేజపర్చినందువల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. తాగుబోతుకి మధుపాత్రను విడిచి పెట్టటం ఎంత కష్టమో కొందరికి మాంసాహారం విడిచి పెట్టటం అంత కష్టమౌతుంది. CDTel 412.2
[61 కూడా చూడండి] CDTel 412.3
(1905) Ed. 203 CDTel 412.4
706. మాంసాహారం హానికరం కూడా. దాని ప్రేరేపక లక్షణమే అది హానికరమనటానికి చాలినంత కారణం. లోకమంతా ఉన్న వ్యాధిగ్రస్త జంతువుల పరిస్థితి దాన్ని రెండింతలు అభ్యంతరకరం చేస్తుంది. అది నరాల్ని చిటపటలాడించి, ఉద్రేకాలు రెచ్చగొట్టి, మిగిలిన శక్తిని నీచ ప్రవృత్తుల వినియోగానికి ప్రోత్సహిస్తుంది. CDTel 412.5
ఉత్తరం 73a, 1896 CDTel 412.6
707. నీకు బలం చేకూర్చుతున్నది మాంసాహారమే అన్న నీ వాదన నన్నెంతో ఆశ్చర్యపర్చుతున్నది. ఆ సమస్యనుంచి నిన్ను నీవు మినహాయించు కుంటే చచ్చిన జంతువుల మాంసం తినటాన్ని కొనసాగించటానికి నీవు ఉపయోగించే వాదనని ఓ పొగాకు ప్రేమికుడు పొగ తాగటం కొనసాగించటానికి ఉపయోగిస్తే అతడికి నీవు ఎలా సమాధానం ఇస్తావో నీకు తెలుసు. CDTel 412.7
మాంసం వాడనందువల్ల నీవు అనుభవిస్తున్నట్లు భావించే శక్తిహీనతనే నీవు మాంసాహారం కొనసాగించకూడదనటానికి నేను ఉపయోగించగల శక్తిమంతమైన వాదనల్లో ఒకటి. మాంసం తినేవారు మాంసాహారం తీసుకున్న తర్వాత ఉత్తేజం పొందిన భావనను పొందుతారు. బలం పొందినట్లు భావిస్తారు. ఓ వ్యక్తి మాంసాహారం విడిచి పెట్టిన తర్వాత, కొంత కాలం శక్తిహీనంగా ఉన్నట్లు భావించవచ్చు. కాని ఈ ఆహారం ఫలితం నుంచి అతడి శరీర వ్యవస్థ ప్రక్షాళన పొందినప్పుడు ఆ బలహీనత ఇకలేనట్లు భావిస్తాడు. శక్తికి అగత్యమని తాను కోరుతూ వచ్చిన మాంసం ఇక ఎంతమాత్రం కోరడు. CDTel 412.8
[ఎక్కువ మాంసం తిన్నప్పుడు ఇ.జి. నైట్ శక్తిహీనతను అనుభవించింది -అనుబంధం 1:4,5,10] CDTel 413.1
[మాంసాహారం మానటానికి ఇ.జి. వైట్ సల్పిన పోరాటం-అనుబంధం 1:4,5] CDTel 413.2