Go to full page →

మితపానం తాగుబోతు తనానికి రాజమార్గం CDTel 452

ఘాటైన మద్యం సేవించి మత్తిల్లటం ఎంత వాస్తవమో లఘు పానీయాలుగా పిలిచే ద్రాక్షారసం ఏపిల్ రసం మత్తు పుట్టించటం అంతే నిజం. ఇవి పుట్టించే మత్తు ఎక్కువ కీడు చేస్తుంది. వక్రమైన ఉద్రేకాలు రేగుతాయి. ప్రవర్తనలో మార్పు వస్తుంది. అది నిశ్చితంగా మొండిగా మారుతుంది. కొన్ని గుక్కల ఏపిల్ లేదా ద్రాక్ష రసం ఘాటైన మద్యానికి తృష్ణ పుట్టిస్తుంది. అనేక సందర్భాల్లో తాగుబోతులుగా పేరుపొందేవారు ఈ రకంగా తాగుడు అలవాటుకి పునాది వేసుకుంటారు. కొందరి విషయంలో జరసం లేదా ఏపిల్ రసం ఇంటిలో ఉండటం క్షేమం కాదు. వారు ప్రేరేపకాలకు ఆకలిని పారంపర్యంగా పొందుతారు. ఆ ఆకలిని తృప్తి పర్చుకోటానికి వారిని సాతాను నిత్యం ప్రోత్సహిస్తాడు. అతడి శోధనలకు లొంగితే, వారిక ఆగరు. ఆకలి ఆహారం కోసం గగ్గోలు పెడుంది. దాన్ని తృప్తి పర్చటం వారి నాశనానికి దారి తీస్తుంది. మెదడు మొద్దుబారి స్పష్టతను కోల్పోతుంది. సుబుద్ధి అధికారం సాగదు. శరీరాశలు రాజ్యమేలతాయి. ద్రాక్షారసం, ఏపిల్ రసానికి తృష్ణ కారణంగా స్వేచ్చా విహారం, వ్యభిచారం అన్నిరకాల దుష్క్రియాలు చోటుచేసుకుంటాయి. ఈ ప్రేరేపకాల్ని ప్రేమించి ఉపయోగించే మత విశ్వాసి కృపలో పెరగడు. శరీరాశలు తీర్చుకోడానికే నివసిస్తాడు. మానసిక ఉన్నత శక్తుల్ని పాశవిక ప్రవృత్తులు నియంత్రిస్తాయి. అతడు సుబుద్ధిని సద్గుణాన్ని ప్రేమించడు. CDTel 452.3

మిత మద్యపానం అనే పాఠశాలలో మనుషులు తాగుబోతు వృత్తి విద్య నేర్చుకుంటారు. మితానుభవ ఆశ్రయ దుర్గాలనుంచి సాతాను ఎంత క్రమక్రమంగా మనుషుల్ని నడిపిస్తాడంటే; నిరపాయంగా కనిపించే ద్రాక్షారసం, ఏపిల్ రసం రుచి పై వాటి ప్రభావాన్ని ఎంత కుటిలంగా కనపర్చుతాయంటే, ఎలాంటి సంకోచమూ లేకుండా అందరూ తాగుబోతు తనం రాజబాటలో ప్రవేశిస్తారు. ప్రేరేపకాలకు రుచిని అభిరుచిని పెంచుకుంటారు. నాడీమండల వ్యవస్థ అస్తవ్యస్తమౌతుంది. సాతాను మనసుని కలవరపర్చుతాడు. పాపం బాధితుడు తాను భద్రంగా ఉన్నట్లు ఊహించుకుంటూ ప్రతీ అడ్డుగోడా కూలేవరకూ, ప్రతీ నియమం భగ్నమయ్యేవరకూ ముందుకి తోసుకుపోతాడు. మిక్కిలి పటిష్టమైన తీర్మానాలు నీరుకారిపోతాయి. వక్రతిండిని స్వస్తబుద్ధి అదుపులో ఉంచటానికి నిత్యకాలికమైన ఆసక్తులు బలీయంగా ఉండవు. CDTel 453.1

కొందరు వాస్తవంగా తాగివుండరు గాని వారు ఎప్పుడూ ఏపిల్ రసం లేదా పులిసిన ద్రాక్షారసం ప్రభావం కింద ఉంటారు. వారు జ్వరగ్రస్తంగా, మానసిక సమతుల్యత లేకుండా, నిజంగా మతి చలించకపోయినా అలాంటి దుస్థితిలోనే ఉంటారు. ఎందుకంటే మనసు తాలూకు ఉన్నత శక్తులన్నీ భ్రష్టమౌతాయి. పులిసిన ఏపిల్ రసాన్ని అలవాటుగా తాగుతూ ఉంటే జలోదరం, కాలేయ సంబంధిత వ్యాధులు, నరాల బలహీనత, తలకు వలన అనేకులు తమ మీదికి నిత్యం వ్యాధిని కొని తెచ్చుకుంటారు. కొందరు కేవలం దీని వల్లనే క్షయతో మరణిస్తారు లేదా సన్నిపాతం వలన మరణిస్తారు. కొందరు అజీర్తి వ్యాధితో బాధపడ్డారు. అవసరమైన ప్రతీ అవయవం పనిచెయ్యదు. తమకు కాలేయపు వ్యాధి వచ్చినట్లు వైద్యులు వారికి తెలుపుతారు. ఏపిల్ రసం సేవించటం మానేస్తే దుర్వినియోగమైన తమ జీవశక్తులు పుంజుకుంటాయని వైద్యులు చెబుతారు. CDTel 453.2

ఏపిల్ రసం తాగే అలవాటు ఘాటైన మద్యపానానికి దారి తీస్తుంది. కడుపు దాని సహజశక్తిని కోల్పోయి క్రియాత్మకం కావటానికి మరింత ఘాటైన పానీయాన్ని కోరుతుంది.... మద్యానికి తృష్ణ ఎంత బలవమైనదో మనం చూస్తున్నాం. అన్ని వృత్తుల్లోను గొప్ప బాధ్యతలు గలవారు ఉన్నతస్థాయి వ్యక్తులు, గొప్ప సాధనలు గలవారు, గొప్ప భావోద్వేగం, పటుత్వం, ఆలోచనాశక్తి గలవారు అనేకులు- జంతువుల స్థాయికి దిగజారేవరకు ఎలా తిని తాగుతున్నారో చూస్తున్నాం. అనేకుల సందర్భంలో వారి అధోగమనం మద్యపానంతో ప్రారంభమౌతుంది. CDTel 454.1