MS 1, 1888 CDTel 465.1
771. మన ఆరోగ్యసంస్థల్లో మనం చెయ్యాల్సిందిగా దేవుడు పిలుస్తున్న పని ఏంటి? మన మాటలు క్రియల ద్వారా ప్రజల్ని వక్రతిండికి తర్బీతు చేసేబదులు దానికి దూరంగా ఉండటానికి వారికి తర్ఫీదు నివ్వండి. ప్రతీ శాఖలోను సంస్కరణ ప్రమాణాన్ని పెంచండి. అపొస్తలుడు పౌలు ఇలా అంటున్నాడు, “కాబట్టి సహోదరులారా, పరిశుద్ధ మును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు లోకమర్వాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి.” CDTel 465.2
మన ఆరోగ్యసంస్థలు పరిశుభ్రమైన, శుద్ధమైన, ఆరోగ్యకరమైన ఆహార నియమాల్ని ప్రజలకందించటానికి స్థాపితమయ్యాయి. ఆత్మత్యాగం, ఆత్మ నిగ్రహం గురించి జ్ఞానాన్ని అందించాలి. మానవుణ్ని సృజించి అతణ్ని విమోచించిన యేసుని మన సంస్థలకు వచ్చే వారందరికీ పరిచయం చెయ్యాలి. మనుషులు సంస్కరణ అవసరాన్ని గుర్తించేందుకు జీవం, సమాధానం, ఆరోగ్యాన్ని గూర్చిన జ్ఞానాన్ని వారికి ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం అందించాలి. తమ దుర్మారత వల్ల దేవుడు నాశనం చేసిన సొదొమలోను జల ప్రళయానికి ముందున్న ప్రపంచంలోను ప్రబలిన దుర్మార్గతను త్యజించటానికి వారిని నడిపించాలి. (మత్తయి 24:37-39).... CDTel 465.3
మన వైద్య సంస్థల్ని సందర్శించే వారందరూ చైతన్యం పొందాలి. అధికులు, సామాన్యులు, గొప్పవారు, పేదవారు అందరి ముందుకీ రక్తణ ప్రణాళికను తేవాలి. వ్యాధికి బాధకు దాని ఫలితంగా వచ్చే చెడుల భ్యాసాలకు కారణాలని ప్రజలు చూసేందుకు ఉపదేశాన్ని జాగ్రత్తగా సిద్ధం చేసి వారికి సమర్పించాలి. CDTel 465.4
(ఆహారం విషయంలో దిద్దుబాటు తెచ్చే మార్గం - 426] CDTel 465.5