(1900) 6T 396-378 CDTel 472.1
782. మన వాక్య పరిచారకులు ఆరోగ్య సంస్కరణ పై మంచి జ్ఞానం కలిగి ఉండాలి. వారికి దేహధర్మశాస్త్రం, ఆరోగ్య శాస్త్రం తెలిసి ఉండాలి. భౌతిక జీవితాన్ని నియంత్రించే చట్టాన్ని, మానసి కారోగ్యంతోను, ఆత్మపరమైన ఆరోగ్యం తోనూ వాటి సంబంధాన్ని వారు అవగాహన చేసుకోవాలి. CDTel 472.2
దేవుడు తమకిచ్చిన అద్భుతమైన దేహం గురించి లేక దానికి అవసరమైన శ్రద్ధను గురించి తెలియని వారు వేవేలమంది ఉన్నారు. అయితే ఏమంత విలువలేని విషయాల్ని అధ్యయనం చెయ్యటం ఎక్కువ ప్రాముఖ్యమని వారు పరిగణిస్తారు. వాక్య పరిచారకులు చెయ్యాల్సిన పని ఇదే. ఈ విషయంలో వారు సరియైన వైఖరి అవలంబించినప్పుడు ఎంతో మేలు కలుగుతుంది. తమ సొంత జీవితాల్లోనూ గృహాల్లోనూ జీవిత చట్టాలకు విధేయులై, సరియైన నియమాల్ని ఆచరిస్తూ వారు ఆరోగ్యవంతంగా నివసించాలి. అప్పుడు ఈ అంశం పై నిర్దుష్టంగా మాట్లాడగలుగుతారు. సంస్కరణ కృషిలో ప్రజల్ని ఉన్నత స్థాయికి నడిపించగలుగుతారు. తాము వెలుగులో నివసిస్తూ అలాంటి సాక్ష్యం అవసరమైన వారికి విలువైన వర్తమానాన్ని అందించగలుగుతారు. CDTel 472.3
వాక్యపరిచారకులు సంఘాల్లో తమ పరిచర్యలో ఆరోగ్యసమస్యను జతపర్చి సమర్పిస్తే గొప్ప మేలు ఒనగూడుతుంది, అమూల్యమైన అనుభూతి కలుగుతుంది. చాలా కాలంగా ఈ సేవను అశ్రద్ధ చెయ్యటం జరుగుతుంది. అనేక మంది తమ స్వారేచ్చలు విడిచి పెట్టకముందు తమకు అందాల్సిన వెలుగు అందని కారణంగా మరణించటానికి సిద్ధంగా ఉన్నారు. మన కాన్ఫరెన్స్ అధ్యక్షులు ఈ అంశానికి తమ మద్దతు పలకాల్సిన సమయం మించి పోతున్నదని గుర్తించాలి. వారి సేవ ప్రతీ శాఖలోను అవసరం. దేవుడు వారికి సహాయం చేస్తాడు. స్వార్థవాంఛల్ని తృప్తి పర్చుకునేందుకు సత్యం నుంచి నీతి నుంచి తొలగకుండా ధృడంగా నిలబడే తన సేవకుల్ని ఆయన బలపర్చుతాడు. CDTel 472.4
మానవుణ్ని తట్టిలేపి తన నైతిక బాధ్యతల్ని గుర్తుచెయ్యటంలో వైద్యమిషనెరీ సేవకు శిక్షణ నిచ్చే సేవ అతి ప్రాముఖ్యమైన ముందడుగు. వాక్యపరిచారకులు దేవుడిచ్చిన ఈ వెలుగు ప్రకారం ఈ సేవను వివిధ శాఖల్లో చేపట్టి ఉంటే, తినటంలో, తాగటంలో, వస్త్ర ధారణలో గొప్ప దిద్దుబాటు చోటుచేసుకునేది. కానీ కొందరు ఆరోగ్యసంస్కరణ పురోగతికి ప్రత్యక్షంగా అడ్డుబండలుగా నిలబడుతున్నారు. తమ ఉదాసీన లేక ఖండన వాక్యాలద్వారా లేక పరిహాసాలు ఎగతాళి ద్వారా ప్రజల్ని ఆటంక పర్చుతున్నారు. వారు ఇంకా అనే కులు మరణ పర్యంతం బాధ ననుభవిస్తున్నారు. కానీ ఇంకా అందరూ జ్ఞానం నేర్చుకోలేదు. CDTel 473.1
తీవ్ర పోరాటంతో మాత్రమే పురోగతి సాధ్యమౌతుంది. ఆత్మత్యాగం చెయ్యటానికి, మనసుని చిత్తాన్ని దేవునికి సమర్పించుకోటానికి ప్రజలు సంసిద్ధంగా ఉండరు. అలాంటి అలక్ష్యం ఫలితాల్ని తమ బాధల్లో, ఇతరుల పై తమ ప్రభావంలో వారు గుర్తిస్తారు. CDTel 473.2
సంఘం చరిత్ర సృష్టిస్తున్నది. దినం దినం ఓపోరాటం, ఓ ప్రస్థానం జరుగుతున్నాయి. అన్ని పక్కల అదృశ్యశత్రువులు మొహరించి ఉన్నారు. దేవుడు మనకిచ్చిన కృప ద్వారా మనం జయించటమో జయించబడటమో జరుగుతుంది. ఆరోగ్య సంస్కరణ విషయంలో తటస్థంగా ఉన్నవారు మనస్సు మార్చుకోవల్సిందిగా బతిమాలుతున్నాను. ఈ వెలుగు అమూల్యమైనది. దైవ సేవలో ఏశాఖలోనైనా బాధ్యతలు వహిస్తున్న వారందరూ తమ హృదయంలోను జీవితంలోను సత్యానికి సమున్నత స్థానం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చెయ్యాలని ప్రభువు నాకిచ్చిన వర్తమానం చెబుతున్నది. ఈ విధంగా మాత్రమే ఎవరైనా లోకంలో తమకు తప్పక ఎదురయ్యే శోధనల్ని ఎదుర్కోగలుగుతారు. CDTel 473.3