R.& H., నవం.4, 1875 CDTel 483.2
మన ఆరోగ్య పుస్తకాలు పత్రికలనుంచి ప్రకాశించే వెలుగు అవసరమైన ప్రజలున్నారు. మనం వాటినుంచి ప్రకాశించే వెలుగు ద్వారా ప్రజల గమనాన్ని ఆకర్షించి, మూడోదూత వర్తమానంలోని హెచ్చనికను వారిచే పాటింపజేసేందుకు వాటిని మాధ్యమాలుగా వినియోగించాలన్నది దేవుని ఆదేశం. ప్రభువు రాక కోసం సిద్ధపడే ఈ సమయంలో లోక ప్రజలకు అవసరమైన వెలుగును వెదజల్లటంలో జరగాల్సి ఉన్న ప్రత్యేక సేవలో మన ఆరోగ్య పత్రికలు గొప్ప సాధనాలు. ఆరోగ్యం, మితానుభవం, సాంఘిక పవిత్రత పక్షంగా బలమైన ప్రభావం చూపించి, సరియైన రీతిగా యధార్ధమైన వెలుగులో ఈ అంశాల్ని ప్రజలకు సమర్పించి, అవి గొప్ప మేలు చేస్తాయి. CDTel 483.3