ఉత్తరం 363, 1907 CDTel 488.4
802. ఓ సందర్భంలో శారా (మెక్ ఎంటర్) డోరా క్రీక్ లోని ఓ కుటుంబాన్ని దర్శించటానికి ఆహ్వానించబడింది. ఆ కుటుంబంలో అందరూ జబ్బుగా ఉన్నారు. తండ్రి ఓ గౌరవప్రదమైన కుటుంబానికి చెందినవాడు. అతడి భార్య పిల్లలు తీవ్ర లేమిలో ఉన్నారు. వారంతా జబ్బుగా ఉన్న ఈ సమయంలో ఇంట్లో తినటానికి ఏమీ లేదు. వారికోసం మేము తీసుకువెళ్లిందేదీ వారు తినటానికి నిరాకరించారు. వారు మాంసాహారానికి అలవాటు పడ్డారు. వారికి ఏదో చెయ్యాలని మేము భావించాం. నేను శారాతో ఇలా అన్నాను, మా ఇంటిలో మంచి కోళ్లను తీసుకుని వారికి బ్రాత్ తయారుచెయ్యి. శారా అలా వారి జబ్బుకి చికిత్స చేసి బ్రాత్ ఇచ్చింది. వారు త్వరలో కోలుకున్నారు. CDTel 488.5
మేము అనుసరించిన పద్ధతి ఇది. మాంసం తినకూడదని మేము వారికి చెప్పలేదు. మేము మాంసం తినకపోయినప్పటికీ, జబ్బుగా ఉన్న ఆ కుటుంబానికి అవసరమని భావించినప్పుడు వారికి ఏమి అవసరమని మేము తలంచామో అది వారికిచ్చాం. ప్రజలున్నచోటే మనం వారిని కలవాల్సిన సందర్భాలుంటాయి. CDTel 489.1
ఈ కుటుంబంలోని తండ్రి తెలివిగలవాడు. ఆ కుటుంబం బాగుపడినప్పుడు వారికి మేము లేఖనాలు తెరిచాం. ఈ వ్యక్తి మారు మనసు పొంది సత్యాన్ని స్వీకరించాడు. అతడు తాను పొగపీల్చే గొట్టాన్ని పారేశాడు. తాగుడు మానేశాడు. ఆనాటి నుంచి తాను జీవించినంత కాలం పొగపీల్చటం గాని మద్యం తాగటం గాని చెయ్యలేదు. సాధ్యపడిన వెంటనే మేము అతడ్ని మా పొలంలో పని చెయ్యటానికి పెట్టుకున్నాం. న్యూకేజి లో మేము సమావేశాలకు హాజరవుతున్న సమయంలో ఇతడు మరణించాడు. మన పనివారిలో కొందరు ఇతడికి మంచి చికిత్స చేశారు. కాని దీర్ఘకాలంగా దుర్వినియోగమౌతూ వచ్చిన శరీరం వారు చేసిన చికిత్సకు స్పందించ లేదు. కాని అతడు క్రైస్తవుడుగా, ఆజ్ఞలు ఆచరించే వ్యక్తిగా మరణించాడు. CDTel 489.2