(1900) 6T 44,45 CDTel 494.2
811. సాధ్యమైనంత మట్టుకు మన శిబిర సమావేశాలు పూర్తిగా ఆధ్యాత్మిక ఆసక్తులకు వినియుక్తం కావాలి.... వ్యాపార విషయాల్ని వాటి నిమిత్తం నియమితులైన వారు చూడాలి. ఆ విషయాల్ని ప్రజల ముందుకి వేరే సమయంలో తీసుకురావాలి గాని శిబిర సమావేశాల సమయంలో కాదు. గ్రంథ విక్రయ సేవను గూర్చి, సబ్బాతుబడి పనిని గూర్చి, పత్రికలు పంచటం మిషనెరీ సేవ చెయ్యటాన్ని గూర్చి స్థానిక సంఘాల్లో లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో శిక్షణ నివ్వాలి. వంట పాఠశాలలకి కూడా ఇదే వర్తిస్తుంది. వీటి స్థానం వీటికి ఉన్నా అవి శిబిర సమావేశాల సమయాన్ని తీసుకోకూడదు. CDTel 494.3