(1909) 9T 161 CDTel 498.1
816. ఆహార సంస్కరణ నియమాల్లో ప్రజలకు శిక్షణ నివ్వటంలో మరింత కృషి జరగాల్సి ఉంది. వంట పాఠశాలల స్థాపన జరగాలి. ఆరోగ్యకరమైన ఆహారం తయారు చెయ్యటంలో ఇంటింటికీ వెళ్లి శిక్షణ నివ్వాలి. మరింత సీదా సాదాగా వంటచెయ్యటం పెద్దలు పిన్నలు అందరూ నేర్చుకోవాలి. సత్యాన్ని ప్రకటించటం ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆరోగ్యకరంగాను, కమ్మగాను ఆహారం తయారుచెయ్యటం ప్రజలకు నేర్పించటం జరగాలి. మాంసం ఉపయోగించకుండా పోషకాహారాన్ని తయారు చెయ్యవచ్చునని వారికి చూపించాలి...... CDTel 498.2
ఆరోగ్య సంస్కర్తలు కావటానికి ప్రయత్నిస్తున్నవారు తీసుకుంటూ వచ్చిన ఆహారం స్థానే బలవర్ధకాహారాన్ని తయారు చెయ్యటంలో నేర్పు. వివేకం ఉపయోగించాలి. దేవుని పై విశ్వాసం, కార్యదీక్ష, పరస్పర సహాయ సహకారాలకు సంసిద్ధత అవసరం. మనం మర్త్యులం. శరీరానికి సరియైన పోషణనిచ్చే, ఆహారం మనకు అవసరం. CDTel 498.3