“స్పిరిచువల్ గిఫ్ట్” (1863-64) సంపుటలు III, IV, రచించేటప్పుడు అధిక శ్రమవల్ల అలసిపోయేదాన్ని. నా జీవన సరళి మార్చుకోవాలని అప్పుడు నాకు అనిపించింది. కొన్ని దినాలు విశ్రాంతి తీసుకోటం ద్వారా బాగయ్యాను. నియమాన్ని అనుసరించి వాటిని విడిచి పెట్టాను. ఆరోగ్యసంస్కరణ పక్షంగా నియమం ప్రకారం నిలిచాను. సోదరులారా, అప్పటినుంచి నేను వెనక్కి తీసుకోవలసిన ఒక్క ఆరోగ్య సంస్కరణ ప్రతికూలాభిప్రాయం నేను వ్యక్తం చెయ్యటం మీరు వినలేదు. నేను ఆచరిస్తున్న దాన్నే తప్ప మరి దేన్నీ ప్రబోధించటం లేదు. ఆరోగ్యదాయకమైన, పౌష్టికమైన ఆహారాన్నే నేను మీకు సిఫారసు చేస్తున్నాను. CDTel 507.1
నోటి దుర్వాసన నోటిలో చెడురుచి పుట్టించే వాటిని విడిచి పెట్టటం లేమి అని నేను భావించను. వీటిని విడిచి పెట్టి సమస్తం చక్కగా సాగే ఆనందదాయక పరిస్థితిలోకి వెళ్లటం, నోటిలో ఎలాంటి చెడు రుచి లేకుండా, కడుపులో ఎలాంటి దురవస్థ లేకుండా ఉండటం ఆత్మత్యాగమా? ఇవి నాకు చాలా కాలం ఉండేవి. నా చేతుల్లో నా చంటి బిడ్డతో ఎన్నోసార్లు స్పృహ తప్పి పడిపోయాను. ఇవేమీ ఇప్పుడు నాకు లేవు. నేనున్న పరిస్థితిలో మీ ముందు నిలబడి ఉన్న నేను ఇది లేమి అనగలనా? నేను చేసే శ్రమను తట్టుకోగలిగే స్త్రీ వందలో ఒకరు కూడా ఉండరు. నేను భావోద్వేగాన్ని బట్టి కాదు నియమాన్ని బట్టి చలించాను. తనకు చెందిన నా శరీరాత్మలతో దేవుని మహిమపర్చేందుకు ఉత్తమ ఆరోగ్య స్థితిలో నివసించటానికి నేను అనుసరిస్తున్న మార్గం దేవునికి అంగీకృతమౌతుందని నేను ఈ దిశలో కదిలాను. CDTel 507.2