చెడు తిండి ద్వారా, క్షుద్ర శరీరాశల తృప్తి ద్వారా పురుషులు స్త్రీలు స్వాభావిక చట్టాన్ని అతిక్రమించి, దైవ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించకుండా ఉండేలేరు. మన శరీరంలో తాను పెట్టిన చట్టాల్ని అతిక్రమించటంలో మనం చేస్తున్న పాపాన్ని మనం చూసేందుకు మన పై ఆరోగ్య సంస్కరణ వెలుగు ప్రకాశించటానికి దేవుడు అనుమతించాడు. తాను నియమించిన చట్టాల్ని - కొందరు తెలిసి, అనేకులు అజ్ఞానం వల్ల - అతిక్రమిస్తూ నివసిస్తున్న మనుషుల దయనీయ పరిస్థితుల్ని కృపామయుడైన మన పరలోకపు తండ్రి చూస్తున్నాడు. మానవులపట్ల ప్రేమ కనికరాలతో ఆరోగ్య సంస్కరణపై వెలుగును ఆయన ప్రకాశింపజేస్తున్నాడు. అందరూ స్వాభావిక చట్టాన్ని తెలుసుకుని దానికి అనుగుణంగా నివసించటానికి జాగ్రత్తపడేందుకు గాను ఆయన తన ధర్మశాస్త్రాన్ని దాని ఉల్లంఘనకు శిక్షను ప్రచుర పర్చుతున్నాడు. ఆయన తన ధర్మశాస్త్రాన్ని స్పష్టంగా ప్రకటించి, కొండపై కట్టిన పట్టణంలా దానికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. బాధ్యతాయుతమైన వారందంరూ దాన్ని అవగాహన చేసుకోవచ్చు. మూఢులు బాధ్యులు కారు. స్వాభావిక చట్టాన్ని విశదపర్చి దాని విధేయతను కోరటం మూడోదూత వర్తమానం వెనక ప్రభువు రాకకు ఓ ప్రజను సిద్ధం చేసేందుకు జరగాల్సిన పని. CDTel 63.3