ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటానికి అజ్ఞానం సాకుకాదు. వెలుగు స్పష్టంగా ప్రకాశిస్తున్నది. ఎవరూ అజ్ఞానులు కానక్కరలేదు. ఎందుకంటే స్వయంగా దేవుడే మానవుడికి ఉపదేశకుడు. ఆరోగ్యసంస్కరణ సందర్భంగా ఇప్పుడు ఆయన అనుగ్రహిస్తున్న హేతుబద్ద వేదాంతాన్ని వాస్తవికానుభవాన్ని ఆచరణలో పెట్టటం అందరూ దేవునిపట్ల నెరవేర్చాల్సిన పవిత్రవిధి. ఆరోగ్య సంస్కరణాంశం ప్రజల మనసుల్లో ఆందోళన రేపి వారిని తీవ్ర పరిశోధనకు నడిపించాలన్నది ఆయన సంకల్పం. ఎందుచేతనంటే, పాపంతో నిండి ఆరోగ్యాన్ని నాశనం చేసే, మెదడును బలహీనపర్చే అలవాట్లు గల మనుషులు ఏ సత్యం ద్వారా పరిశుద్దులై మహిమారాజ్యంలో పరలోక దూతల సహవాసానికి అర్హులవ్వాల్సి ఉన్నారో దాన్ని గ్రహించటం అసాధ్యం ..... CDTel 64.2