(1905) M. H.295,296 CDTel 74.1
111. ఏ ఆహార పదార్థాలు ఉత్తమమైనవో తెలుసుకోటానికి, ఆదిలో మానవుడి ఆహారానికి దేవుని ప్రణాళికను మనం అధ్యయనం చెయ్యాలి. మానవుణ్ని సృజించి అతడి అవసరాన్ని గ్రహించే ఆయన ఆదాము ఆహారాన్ని నియమించాడు. “ఇదిగో భూమి మీదనున్న విత్తనమునిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీకిచ్చియున్నాను; అది మీ కాహారమగును.” అన్నాడు దేవుడు. పాపశాపం కింద నేలను దున్ని జీవనోపాధి సంపాదించటానికి ఆదాము ఏదెనుని విడిచి పెట్టినప్పుడు “పొలములోని పంట” తిన్నాడు. CDTel 74.2
ధాన్యం, పండ్లు, గింజలు, కూరగాయలు మన సృష్టికర్త మనకు ఎంపిక చేసిన ఆహారం. ఈ ఆహార దినుసుల్ని సాధ్యమైనంత సామాన్యంగాను సహజంగాను తయారు చేసుకుంటే అవి ఆరోగ్యాన్ని పోషణను ఇస్తాయి. క్లిష్టమైన, ఆవేశం పుట్టించే ఆహారం సమకూర్చలేని శక్తిని, సహనాన్ని మేధను అవి సమకూర్చుతాయి. CDTel 74.3
(1864) Sp. Gifts IV, 120 CDTel 74.4
112. మానవ జాతి భుజించాల్సిందిగా దేవుడు సంకల్పించిన ఆహారాన్ని మన ఆది తల్లిదండ్రులైన ఆదామవ్వలకు దేవుడిచ్చాడు. ఏ జీవి ప్రాణాన్నయినా తీయటం ఆయన ప్రణాళికకు విరుద్ధం. ఏదెనులో మరణం ఉండాల్సిన పనిలేదు. ఏదెనులోని చెట్ల పండ్లు మానవుడి కోర్కెలు వాంఛించిన ఆహారం. CDTel 74.5
[సందర్భానికి 639 చూడండి] CDTel 74.6