(1869) 2T 352 CDTel 75.10
116. ఆహారం అతి సామాన్యంగా ఉండాల్సిన అవసరం ఎప్పుడైనా ఉంటే అది ఇప్పుడే. CDTel 75.11
(1880) 4T 515,516 CDTel 76.1
117. మనుషులు ప్రవర్తన బలాన్ని పెంపుచేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. గంటలు లెక్క పెట్టుకుంటూ పనిచేసేవారు ఆనక బహుమతిని పొందేవారు కారు. తన సేవలో పనిచేసేవారు తీక్షణమైన మనోభావాలు, త్వరిత గ్రాహ్యత కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. వారు మితాహారులై ఉండాలి. విలాసవంతమైన భోజనం వారి భోజన బల్ల మీద ఉండ కూడదు. మెదడుకు ఎక్కువ పని వుండి దేహానికి వ్యాయామం లేనప్పుడు సామాన్యాహారాన్ని సయితం వారు మితంగా తినాలి. దానియేలు నిర్మల మనసు, కార్యదీక్ష, జ్ఞాన సంపాదనలో బుద్ధికుశలత, వీటికి తన ప్రార్థన జీవితంతో పాటు తన సాదాసీదా ఆహారం చాలా మట్టుకు కారణం. CDTel 76.2
[సాదా ఆహారం ఎంపికచేసుకున్న దానియేలు-33,34,241,242] CDTel 76.3
(1885) 5T 311 CDTel 76.4
118. ప్రియమైన స్నేహితులారా, వ్యాధిని దెబ్బతీసే మార్గాన్ని అనుసరించేబదులు మీరు దాన్ని బుజ్జగించి దాని వశంలోకి వెళ్తున్నారు. మీరు మందుల వినియోగంపై ఆధారపడకూడదు. ఆరోగ్య చట్టాల్ని ఆచరించాలి. మీరు మీ జీవితాన్ని లెక్కజేస్తుంటే మిక్కిలి సామాన్యంగా తయారుచేసిన సాధారణ ఆహారం తిని ఎక్కువ శారీరక వ్యాయామం చేయాలి. కుటుంబంలోని ప్రతీ వ్యక్తికీ ఆరోగ్య సంస్కరణ ఒనగూర్చే మేళ్లు అవసరం. అయితే మందుల్ని అతిగా వాడటం మానాలి. ఎందుకంటే అవి ఏ వ్యాధినీ స్వస్తపర్చకపోగా శరీర తత్వాన్ని బలహీనపర్చి శరీరాన్ని వ్యాధికి మరింత గురిచేస్తాయి. CDTel 76.5