(1905) M. H.298,299 CDTel 78.2
120. విలాసవంతమైన, ఉత్తేజం పుట్టించే, ఆహారానికి అలవాటుపడ్డ వారికి అస్వాభావిక రుచి ఏర్పడుంది. ఒక్కసారిగా వారికి సామాన్య భోజనం రుచించదు. రుచి స్వాభావికమవ్వటానికి, అన్నకోశానికి జరిగిన హానిని నివారించటానికి సమయం పడుంది. అయితే ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని భుజించటంలో ఎడతెగకుండా కొనసాగేవారు అది రుచికరమైన ఆహారమని తెలుసుకుంటారు. దాని సుతిమెత్తని కమ్మదనాన్ని వారు అభినందించి ఆనందిస్తారు. ఆరోగ్యదాయకం కాని ఇతర గొప్ప ఆహారం కన్నా దీన్ని వారు ఆనందంగా తింటారు. ఉద్రేకానికి, అధిక భారానికి గురి కాకుండా ఆరోగ్యంగా ఉన్న అన్నకోశం దాని విధుల్ని చక్కగా నిర్వర్తించగలుగుతుంది. CDTel 78.3