(1870) 2 T 60a,603 CDTel 79.2
124. మసాలా, నూనె లేకుండా సామాన్యంగా వండిన ఆరోగ్యకరమయిన ఆహార పదార్థాలు మినహా శిబిర సమావేశాలకు ఏమీ తీసుకు వెళ్ళకూడదు. CDTel 79.3
తాము చేసుకునే వంటలో ఆరోగ్య సూత్రాల్ని పాటిస్తే శిబిర సమావేశాలకి సిద్ధపడటంలో ఎవరూ జబ్బుపడాల్సిన అవసరం లేదని నా విశ్వాసం. కేకులు, పైలు చెయ్యకుండా సామాన్య బ్రెడ్ తీసుకుని పండ్ల మీద - క్యేన్ చేసినవి గానీ ఎండబెట్టినవి గానీ - ఆధారపడితే సమావేశాలకి సిద్ధపడేటప్పుడుగానీ, సమావేశాల్లో ఉన్నప్పుడు గానీ వారు జబ్బుపడనక్కర లేదు. సమావేశాలు జరిగే దినాలన్నింటిలోనూ ఎవరూ వేడి భోజనం లేకుండా ఉండనవసరం లేదు. సమావేశాలు జరిగే స్థలంలో స్టాలు ఉంటాయి. వాటి పై భోజనం వేడి చేసుకోవచ్చు. CDTel 79.4
శిబిర సమావేశాల స్థలంలో సహోదరులు, సహోదరీలు జబ్బుపడ కూడదు. ఉదయం, రాత్రి చలికి సరియైన దుస్తులు వేసుకున్నట్లయితే, ప్రసరణ సరిగా ఉండేందుకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా దుస్తులు మార్చుకుంటూ, నిద్రవేళలు భోజన వేళల్ని క్రమంగా పాటిస్తూ, మధ్యమధ్య చిరుతిళ్లు తినకుండా ఉంటే వారు జబ్బుపడనవసరం ఉండదు. సమావేశాలు జరిగే కాలంలో వారు ఆరోగ్యంగా ఉండవచ్చు. వారి మనసులు నిర్మలంగా ఉండి సత్యాన్ని అభినందించవచ్చు. వారు శారీరకంగానూ, ఆత్మపరంగా విశ్రాంతి పొంది తమ గృహాలకు తిరిగి వెళ్లవచ్చు. దినడినం కఠిన శ్రమ చేస్తూ ఉన్న వారు ఇప్పుడు ఆ పనిని చెయ్యరు గనుక వారు తమ యథావిధి ఆహారం తీసుకోకూడదు. తింటే వారి అన్నకోశానికి పని భారం ఎక్కువవుతుంది. CDTel 79.5
ఈ సమావేశాలనుంచి తిరిగి వచ్చి అందరూ తాము విన్న విషయాల్ని ఆచరణలో పెట్టేందుకు వారు మెదడు శక్తిని బలంగానూ ఉత్తమ ఆరోగ్య స్థితిలోనూ ఉంచుకుని సత్యాన్ని విని అభినందించాలన్నది మా కోరిక. అన్నకోశాన్ని ఎక్కువ ఆహారంతో నింపి దాని పై భారం పెంచితే, జీర్ణమండల అవయవాల సహాయార్థం మెదడు శక్తి వినియోగమవుతుంది. మెదడు సబ్దమౌతుంది. కళ్లు తెరచి ఉంచటం దాదాపు అసాధ్యమౌతుంది. అస్వస్తత వల్ల లేదా తిన్న ఆహారం ఎక్కువవటం వల్ల మెదడు దాదాపు స్తంభించిన కారణంగా విని గ్రహించి ఆచరణలో పెట్టాల్సిన సత్యాలు వ్యర్థమైపోతాయి. CDTel 80.1
అందరూ ప్రతీ ఉదయం ఏదో వేడిగా ఉన్నది తినటం మంచిదని నా సలహా. ఎక్కువ శ్రమ లేకుండా దీన్ని తయారు చేసుకోవచ్చు. పిండితో జావ తయారు చేసుకోవచ్చు. పిండి ముతకగా వుంటే జల్లించండి. జావ వేడిగా ఉన్నపుడు అందులో పాలు కలపండి. ఇది శిబిరంలోని వారికి రుచికరం, ఆరోగ్యదాయకం అయిన వంటకమవుతుంది. మీ బ్రెడ్ ఎండిపోయి గట్టిగా వుంటే దాన్ని ముక్కలు చేసి జావలో వేసుకుని తింటే ఎంతో రుచిగా వుంటుంది. చల్లని ఆహారాన్ని ఎక్కువ వాడటాన్ని నేను అనుమతించను. ఎందుచేతనంటే, అన్నకోశం జీర్ణక్రియను ‘ప్రారంభించకముందు ఆహారాన్ని అన్నకోశపు వేడికి తేవటానికి శరీరవ్యవస్త శక్తిని ఉపయోగించటం అవసరమౌతుంది. ఇంకో సామాన్యమైన, అయినా ఆరోగ్యకరమయిన వంటకం ఉడకబెట్టిన బీన్స్ లేక బేక్ చేసిన బీన్స్, అందులో కొంత భాగం తీసి నీళ్లు కలిపి దానికి పాలుగానీ పాలమీగడగానీ కలిపి బ్రాత్ చేసుకోవచ్చు. జావలో ఉపయోగించిన రీతిగా బ్రా లో కూడా బ్రెడను ఉపయోగించవచ్చు. CDTel 80.2
[శిబిర స్థలంలో ఐస్ క్రీం, క్యాండీలు మొదలైన వాటిని అమ్మటం-529, 530] CDTel 81.1
[శిబిర సమావేశానికి సిద్ధబాటులో భాగంగా అనవసరపు వంట-57] CDTel 81.2