(1905) M. H.322 CDTel 84.7
130. కొందరు సందర్శకులికి ఖరీదైన భోజనాలు పెట్టేందుకు తమ కుటుంబాలికి తక్కువ చేస్తారు. ఇది అవివేకం. అతిథుల భోజనాలు ఎక్కువ సామాన్యంగా ఉండాలి. కుటుంబ అవసరాలికి ప్రథమ ప్రాధాన్యత ఉండాలి. CDTel 84.8
బుద్ధిహీనమైన పొదుపు, కృత్రిమ ఆచారాలు తరచు ఆతిథ్యం ఎక్కడ అవసరమో, ఎక్కడ దీవెనకరమో అక్కడ దానికి అడ్డుతగులుతాయి. మనం నిత్యం తినే ఆహారం గృహిణికి అదనపు వంటపని లేకుండా ఒక అతిథికి సరిపోయేంత సమృద్ధిగా ఉండాలి. CDTel 84.9
[ఇ.జి.వైట్ అలవాటు-సందర్శకులకు అదనపు వంటలేదు-అనుబంధం 1:8] CDTel 84.10
[వైట్ గృహంలో వడ్డించిన సామాన్య ఆహారం - అనుబంధం 1:1,13,14,15] CDTel 84.11
[పూటపూటకీ భోజన పదార్థాల పట్టిక మార్చి, భోజనపదాల్ని రుచిగా తయారు చెయ్యా లి-320] CDTel 84.12