[C.T.B.H.47] (1890) C.H.114,115 CDTel 87.5
137. మానవుడి వక్రం కాని ఆహార అవసరాన్ని తీర్చటానికి దేవుడు చేసిన ఏర్పాట్లు సమృద్ధిగా ఉన్నాయి. భూమి పంటల్ని. అతడి ముందు సమృద్ధిగా పరచి వుంచుతున్నాడు. రుచికి చక్కనిది దేహానికి పౌష్ఠికతనిచ్చేది అయిన ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు. వీటిని మనం స్వేచ్ఛగా తినవచ్చునని మన పరలోకపు తండ్రి సెలవిస్తున్నాడు. మసాలాలు లేకుండా నూనె, కొవ్వు ఉపయోగించకుండా పాలతోగాని లేదా మీగడతో గాని సామాన్యంగా తయారు చేసిన పండ్లు, ధాన్యాలు, కూరగాయలు శ్రేష్ఠమైన ఆరోగ్యకరమైన ఆహారం. అవి దేహాన్ని పోషించి, ఉద్రేకం పుట్టించే ఆహారం ఇవ్వలేని సహనశక్తిని, మేధాశక్తిని ఇస్తాయి. CDTel 87.6
MS135, 1906 CDTel 87.7
138. ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, కాయలు, గింజల్లో మనకు అవసరమైన పోషక పదార్థాలు లభిస్తాయి. మనం ప్రభువు వద్దకు సామాన్య మనసుతో వస్తే, మాంస కళంకంలేని ఆరోగ్యదాయక ఆహారాన్ని ఎలా తయారు చెయ్యాలో ప్రభువు నేర్పిస్తాడు. CDTel 87.8