(1902) 7T 133,134 CDTel 89.1
141. ఆహార పదార్థాల్ని ఉపయోగించకోటంలో మనం కొంచెం లో కజ్ఞానం ఉపయోగించాలి. ఒక రకమైన ఆహారం పడదని తెలుసుకున్నప్పుడు దానికి కారణమేంటంటూ మనం ఉత్తరాలు రాయనక్కరలేదు. ఆహారాన్ని మార్చండి. కొన్ని ఆహార పదార్థాల్ని తక్కువగా ఉపయోగించండి. ఇతర వంటకాలు చేసుకోటానికి ప్రయత్నించండి. కొన్ని ఆహార పదార్థాల్ని కలిపి తయారుచేసుకోటంవల్ల కలిగే ఫలితాన్ని మనం త్వరలో కనుగొంటాం. బుద్దినాలు గల మనుషులిగా, సూత్రాల్ని వ్యక్తిగతంగా అధ్యయనం చేసి, అనుభవాన్ని వివేచనను ఉపయోగించి మనకు ఏ రకమైన ఆహారం సరిపడుతుందో నిర్ణయించుకోవాలి. అందరికీ ఒకే రకమైన ఆహారం సరిపడదు-222] CDTel 89.2
(1905) M. H.297 CDTel 89.3
142. దేవుడు రకరకాల ఆరోగ్యదాయకమైన ఆహార పదార్థాల్ని మనకు ఇస్తున్నాడు. ప్రతీవ్యక్తి ఏ ఆహార పదార్థాలు తన అవసరాలకు సరిపోతాయో వాటిని తన అనుభవాన్ని బట్టి ఆలోచించుకుని ఎంపికచేసుకోవాలి. CDTel 89.4
రవాణా సదుపాయాలు పెరగటంతో ప్రకృతి, సరఫరా చేస్తున్న పుష్కలంగా పండ్లు, కాయలు, గింజలు, ధాన్యాలు అన్ని దేశాల ఉత్పత్తులు మరింత సాధారణంగా పంపిణీ అవుతున్నాయి. ఫలితంగా కొన్ని సంవత్సరాల కిందట ఖరీదైన విలాస వస్తువులుగా పరిగణించిన ఆహార పదార్థాలు ఇప్పుడు అనుదిన ఆహార దినుసులుగా అందరి అందుబాటులోను ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఎండబెట్టి క్యాన్ చేసిన పండ్ల విషయంలో వాస్తవం. CDTel 89.5
[ఆపద సమయాన్ని దృష్టిలో ఉంచు కుని ఆ హారం పరిమితం చెయ్యకూడదు-323] CDTel 89.6
(ఆహారం తయారుచెయ్యటంలో వివిధత, నాజూకుతనం-320) CDTel 89.7
[మన ఆసుపత్రుల్లో చాలినంత ఆహారం ఇవ్వటం-426,428,429,430] CDTel 90.1
[వైట్ గృహంలో క్షీణింపజేసే ఆహారం లేదు-అనుబంధం 1:8,17] CDTel 90.2