ఉత్తరం 142, 1900 CDTel 104.6
173. తినాల్సిన ఆహారం ఇంత అని తూకంవేసి నిర్దేశించటం అసాధ్యం. ఈ పద్ధతిని అనుసరించటం మంచిది కాదు. అలా చెయ్యటంలో మనసు ఆత్మాభిమానంతో నిండుతుంది. తినటం తాగటం మీదే ఎక్కువ ఆలోచన కేంద్రీకృతమౌతుంది.. శరీరానికి పోషణనివ్వగల ఆహారం పరిమాణం నాణ్యత సందర్భంగా బరువైన బాధ్యత మోస్తున్న వారు CDTel 104.7
అనేకమంది ఉన్నారు. కొందరు, ముఖ్యంగా అజీర్తి రోగులు, తమ ఆహారానికయ్యే ఖర్చుకు జడిసి తమ శరీరానికి పోషణనివ్వటానికి చాలినంత ఆహారం తినరు. తాము ఏ గృహంలో నివసిస్తున్నారో దానికి వారు గొప్పహాని కలిగిస్తున్నారు. వారు జీవితాన్ని ఆనందించకుండా తమను తాము పాడుచేసుకుంటున్నారని మా భయం. CDTel 105.1
(1905) M. H.221 CDTel 105.2
174. తమ ఆహారం సామాన్యంగాను ఆరోగ్యవంతంగాను ఉన్నప్పటికీ అది తమకు హాని చేస్తుందని ప్రతి నిత్యం ఆందోళన చెందేవారు కొందరున్నారు. వారికి నేను చెబుతాను, మీ ఆహారం మీకు హాని కలిగిస్తుందని తలంచకండి. అసలు దాన్ని గురించి ఆలోచించనే వద్దు. మీకు మంచిదని తోచిన భోజనం తినండి. మీ శరీరానికి బలం ఇచ్చేటట్లు మీ ఆహారాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేసేటప్పుడు, మీ ప్రార్థనను ప్రభువు వింటాడని విశ్వసించి, విశ్రాంతి తీసుకోండి! CDTel 105.3
[ఆహారం, ఆహార పదార్థాల పరిమాణం, సంఖ్య నిర్దేశించటంలో హద్దులు -317] CDTel 105.4
(1905) M.H.306 CDTel 105.5
175. కఠినంగా లేక అతిగా వ్యాయామం చేసినప్పుడు, ఎక్కువ అలసిపోయినప్పుడు, వేడిగా ఉన్నప్పుడు లాంటి అపసమయాల్లో తినటం ఇంకొక తీవ్రమైన కీడు. ఆహారం తినటం ముగిసిన వెంటనే నాడీ సంబంధమై శక్తుల పైకి బలమైన వాయు ప్రవాహం వస్తుంది. భోజనానికి ముందుగాని, వెనక గాని మనసుగాని శరీరంగాని అధిక శ్రమకు లోనైనప్పుడు, జీర్ణక్రియకు అంతరాయం ఏర్పడుతుంది. ఒక వ్యక్తి ఉద్రేకానికి, ఆందోళనకు గురి అయితే లేక హడావుడిగా ఉంటే, విశ్రాంతి లేదా ఉపశమనం లభించేవరకు ఆహారం తినకుండా ఉండటం మేలు. CDTel 105.6
అన్నకోశానికి మెదడుకి దగ్గర సంబంధం ఉంది. అన్నకోశం రోగగ్రస్తమైనపుడు, బలహీన పడ్డ జీర్ణమండల అవయవాలకి సాయం చెయ్యటానికి మెదడు నరాల శక్తికి పిలుపు వస్తుంది. ఇలాంటి పిలుపులు తరచుగా వచ్చినప్పుడు మెదడులో అడ్డంకులు ఏర్పడతాయి. మెదడుకి నిత్యం ఎక్కువ పని వుండి, శరీరానికి వ్యాయామం లేనప్పుడు, సామాన్యాహారాన్ని సయితం మితంగా తినాలి. భోజనం చేసేటప్పుడు చింతలు ఆందోళనల్ని పక్కన పెట్టండి. హడావుడి పనికి రాదు. నెమ్మదిగా సంతోషంగా తినండి. దీవెనలిచ్చే దేవుని పట్ల కృతజ్ఞతతో మీ హృదయం నింపుకుని తినండి. CDTel 105.7