(1892) G.W. 174 (పాతముద్రణ) CDTel 108.1
184. అనారోగ్యా నికి, పనిలో అసమర్థతకు మరొక కారణం అజీర్తి. జీర్ణక్రియ శక్తులు దుర్వినియోగమైనప్పుడు మెదడు అత్యుత్తమంగా పనిచెయ్యటం సాధ్యం కాదు. అనేకమంది రకరకాల వంటకాలతో కూడిన ఆహారాన్ని ఆదరాబాదరా తింటారు. ఇది కడుపులో కలకలం సృష్టిస్తుంది. దానితో మెదడు గందరగోళంలో పడుతుంది. CDTel 108.2
MS 3, 1897 CDTel 108.3
185. ఒకే భోజనంలో ఎన్నో రకాల వంటకాలు తినటం ఆరోగ్యానికి మంచిది కాదు. పండ్లు బ్రెడ్ వాటితో కలిపి, సరిపడని రకరకాల వంటకాల్ని తిన్నప్పుడు అవి ఒకే భోజనంలో కడుపును ఖాళీ లేకుండా నింపితే, కల్లోలం తప్ప ఇంకేమి జరుగుతుంది? CDTel 108.4
MS 93, 1901 CDTel 108.5
186. చాలామంది త్వరగా తింటారు. కొందరు ఒకే బోజనంలో పడని ఆహార పదార్థాలు తింటారు. కడుపుని బాధ పెట్టినప్పుడు ఆత్మను ఎంతగా బాధ పెడ్తారో, కడుపు అలా దుర్వినియోగమైనపుడు క్రీస్తుకి ఎంత అగౌరవం కలుగుతుందో స్త్రీలు పురుషులు గుర్తుంచుకుంటే, వారు ధైర్యంగా ఉండి, తమను తాము ఉపేక్షించుకుని, కడుపు తన విధిని ఆరోగ్యవంతంగా నిర్వర్తించేందుకు కోలుకోటానికి సమయం ఇస్తారు. భోజనం వద్ద కూర్చున్నప్పుడు మనం దేవునికి మహిమ కలిగేటట్లు అన్నపానాలు చేయటం ద్వారా వైద్యమిషనరీ సేవ చెయ్యవచ్చు. CDTel 108.6