Go to full page →

నియంత్రణ లేని తిండి సాంఘిక ఫలితాలు CDTel 117

[C.T.B.H.44,45] (1890) C.H.112 CDTel 117.1

196. జీవితచట్టాల ప్రతీ ఉల్లంఘనకు ప్రకృతి తన నిరసనను తెలుపుతుంది. సహించగలిగినంతకాలం దుర్వినియోగాన్ని సహిస్తుంది. చివరికి ప్రతీకారం వస్తుంది. అది శారీరక శక్తుల మీద మానసిక శక్తులమీద పడుతుంది. అది అతిక్రమదారుడితో ఆగదు. అతడి తిండిబోతుతనం పర్యవసానాలు తన సంతతిలో కనిపిస్తాయి. ఈ రకంగా ఈ పాపం తరంనుంచి తరానికి సంక్రమిస్తుంది. CDTel 117.2

నేటి యువతరం సమాజం భవిష్యత్తుకు సూచిక. వారిని చూసినప్పుడు ఆ భవిష్యత్తు విషయంలో మనం ఏమి నిరీక్షించగలం? అధిక సంఖ్యాక ప్రజలు వినోదాన్ని ప్రేమించి పనిని ద్వేషిస్తారు. స్వార్థాన్ని ఉపేక్షించి, విధిని నిర్వహించటానికి వారికి నైతిక ధైర్యం చాలదు. వారికి ఆత్మనిగ్రహం ఉండదు. అతి స్వల్ప విషయాలపై ఆవేశపడతారు, ఆగ్రహిస్తారు. ప్రతీ వయసులోని వారిలో ప్రతీ అంతస్తులోని వారిలో అనేకులు నియమాలు గాని మనస్సాక్షిగాని లేనివారు. తమ సోమరితనం దుబారా అలవాట్లతో వారు దుర్మార్గులై సమాజాన్ని దుష్టత దుర్నీతితో నింపి లోకాన్ని రెండో సొదొమగా తయారు చేస్తున్నారు. తిండి తపన, దురావేశాలు, స్వస్తబుద్ధి, మతం నియంత్రణ కిందవుంటే, సమాజం రూపురేఖలు ఎంతో వ్యత్యాసంగా ఉంటాయి. సమాజంలోని ప్రస్తుత అవాంఛనీయ పరిస్థితి దేవుడు సంకల్పించింది కాదు. ఇది ప్రకృతి చట్టాల్ని అడ్డూ ఆపూ లేకుండా అతిక్రమించినందువల్ల ఏర్పడ్డ పరిస్థితి. CDTel 117.3