(1905) M.H.334 CDTel 120.9
203. తరచు అమితం ఇంట్లోనే ఆరంభమౌతుంది. వేపుళ్ళు పోపుల వంటి అనారోగ్యకరమైన వంటకాలు జీర్ణక్రియ సంభంధిత అవయవాల్ని బలహీనపర్చి, మరింత ఉద్రేకాన్ని పుట్టించే ఆహారం కోసం అభిలాషను సృష్టిస్తాయి. నిత్యం మాటు పదార్థాల కోసం వాంఛ కు ఆకలి తర్బీతవుతుంది. ప్రేరేపకాల కోసం డిమాండు చెయ్యటం ఎక్కువవుతుంది. దాన్ని ప్రతిఘటించటం కష్టమౌతుంది. శరీరం విషంతో నిండుతుంది. శరీరం ఎంత బలహీనమైతే వీటికోసం వాంఛ అంత బలీయమౌతుంది. తప్పు దిశలో పడే ఒక అడుగు ఇంకొక అడుగుకి మార్గం సుగమం చేస్తుంది. తమ భోజన బల్లపై ఎలాంటి మద్యాన్ని పెట్టటానికి ఇష్టపడని అనేకులు ముందు పెట్టుకునే ఆహారం బలమైన మత్తు పానీయం కోసం దాహం పుట్టించే ఆహారం. దానికోసం కలిగే శోధనను ప్రతిఘటించటం అసాధ్యమౌతుంది. తప్పుడు భోజన పానాల అలవాట్లు ఆరోగ్యాన్ని నాశనం చేసి తాగుబోతుతనానికి దారి తీస్తాయి. CDTel 120.10