Go to full page →

56—ఏలీ, ఏలీకుమారులు PPTel 578

ఏలీ ఇశ్రాయేలీయులో యాజకుడు, న్యాయాధిపతి, దైవ ప్రజలందరిలోను అతని హోదా అత్యున్నతమైనది. మిక్కిలి బాధ్యతాయుతమైనది. యాజక బాద్యతల నిర్వహణకు దేవుడు ఎంపిక చేసుకొన్న వ్యక్తిగా ఆదేశంలో అత్యున్నత న్యాయాది . కారిగా ప్రజలు అతన్ని ఆదర్శంగా పరిగణించారు. ఇశ్రాయేలీయుల గోత్రాలపై అతని ప్రభావం బలంగా ఉండేది. కాగా ప్రజల్ని పరిపాలించటానికి నియుక్తుడైన అతను తన సొంత గృహాన్ని పాలించటంలో పరాజయం పొందాడు., ఏలీ గారాబం పెట్టే తండ్రి సుఖశాంతుల్ని కోరుకొనే వ్యక్తి కావటంతో తన బిడ్డల చెడ్డ అలవాట్లను సరిచేయలేదు. వారితో ఘర్షణ పడటంకన్నా లేదా వారిని శిక్షించటంకన్నా వారికి లొంగిపోయి వారిని విచ్చలవిడిగా ప్రవర్తింపనిచ్చాడు. తన కుమారుల విద్య తన ప్రధాన బాధ్యతల్లో ఒకటిగా పరిగణించే బదులు దాన్ని అస్సలు పట్టించుకోలేదు.తన సంరక్షణకు దేవుడు అప్పగించిన బిడ్డలన్ని నిరోధించి పాలించటం తన బాధ్యత అన్న విషయం ఇశ్రాయేలీయుల యాజకుడు న్యాయాధిపతికి తెలియంది కాదు. కాకపోతే అతడు తన విధిని నిర్వహించలేదు. అంతే. ఎందుకంటే అది చేస్తే తన కుమారులు ఇష్టాన్ని కాదని వారిని శిక్షించాల్సి వచ్చేది. కొన్ని నిషేధాలు విధించాల్సి వచ్చేది. తన నిష్క్రియ దుష్పలితాల్ని పరిగణించకుండా తన బిడ్డలు కోరిందల్లా ఇచ్చి తద్వారా దేవుని సేవకు జీవిత బాధ్యతలకు వారిని సమర్దుళుగా రూపుదిద్దాల్సిన తన కర్తవ్యాన్ని ఆశ్రద్ధ చేశాడు. PPTel 578.1

అబ్రాహాము విషయంలో దేవుడిలా అన్నాడు. “తన పిల్లలును తన ఇంటి వారును నీతి న్యాయముల జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటలకు అతడు వారి కాజ్ఞాపించునట్లు నేనతని నెరిగియున్నాను”. అది 18:19 ఏలీ పిల్లలే ఏలీని నియంత్రించారు. తండ్రి బిడ్డలకు అణిగిమణిగి నివసించాడు. తన కుమారుల దుర్నీతిలో, ముష్కరత్వంలో అతిక్రమం శాపం ప్రస్పుటమయ్యింది. దేవుని ప్రవర్తన అన్నా లేదా ఆయన పరిశుద్ధ ధర్మశాస్త్రమన్నా వారికి సరియైన అవగాహన గాని అభినందనగాని లేదు. దేవుని ఆరాధన వారికి ఒక సామాన్య విషయం. చిన్ననాటి నుంచి దేవాలయం దేవాలయ సేవలు వారికి బాగా తెలసినవే. అయితే మరెక్కువ భక్తి శ్రద్ధలు పెంచుకొనే బదులు వారు వాటి పరిశుద్ధతను ప్రాముఖ్యాన్ని గూర్చి మర్చిపోయారు. తండ్రిగా తన అధికారాన్ని కుమారులు గౌరవించకపోవటాన్ని అతడు సరిచెయ్యలేదు. పవిత్రమైన గూడార సేవల విషయంలో గర్హనీయమైన వారి ప్రవర్తన సరిదిద్దలేదు. వారు అలా ఎరిగి పెద్దవారైనప్పుడు వారు ఫలించిన విషపూరిత ఫలాలే నాస్తికత్వం తిరుగుబాటు స్వభావంగా పరిణమించాయి. PPTel 578.2

పూర్తిగా అయోగ్యులైనప్పటికి గుడారంలో దేవుని ముందు సేవ చేయటానికి వారిని యాజకులుగా నియమించాడు. బలులర్పించే విషయంలో ప్రభువు నిర్దిష్ట ఆదేశాలిచ్చాడు. అయితే ఆ దుష్టతల తమ ధిక్కార స్వభావాన్ని కనపర్చారు. అర్పణల్ని ఎంతో పరిశుద్ధంగా అర్పించాల్సి ఉండగా ఈ దుష్టులు వాటిని గూర్చిన నిబంధనల్ని లెక్కచేయలేదు. భవిష్యత్తులో క్రీస్తు మరణాన్ని సూచించే బలులు రానున్న రక్షకుని పై ప్రజల హృదయాల్లో విశ్వాసాన్ని పదిలపర్చేందుకు ఉద్దేశించినది. అందుచేత వాటిని గూర్చి ప్రభువిచ్చిన ఆదేశాల్ని ఖచ్చితంగా ఆచరించటం ఎంతో ప్రాముఖ్యం. సమాధాన బలలు ప్రధానంగా దేవునికి కృతజ్ఞత తెలపటానికి ఇచ్చే అర్పణలు. ఈ బలులర్పించేటప్పుడు కొవ్వును మాత్రమే బలిపీఠం మీద దహించాల్సి ఉండేది. ఒక నిర్దిష్ట భాగం యాజకులికి ఉంచేవారు. కాని బలిలో అత్యధిక భాగం బలి అర్పించే వ్యక్తికి తిరిగి ఇచ్చేయటం జరిగేది. దాన్ని అతడు అతడి మిత్రులు బలి అర్పణ విందులో భుజించాల్సి ఉండేది. లోక పాపాల్ని నివారించేందుకు క్రీస్తు చేయనున్న ఆ మహా త్యాగానికి అందరిగమనాన్ని ఈ విధంగా తిప్పాల్సి ఉంది. PPTel 579.1

ఈ సంకేతాత్మక సేవ పవిత్రతను గుర్తించే బదులు దాన్ని తమ స్వార్ధ్యం వినోదాలకు ఎలా వినియోగించుకోవాలన్నదే ఏలీ కుమారుల ఆలోచన. సమాధానార్ధ బలుల్లో తమకు ఏర్పాటైనభాగంతో తృప్తి చెందక వారు కొంత అదనపు భాగాన్ని డిమాండ్ చేసేవాడు. ఈ బలుల్ని ఎక్కువగా సాంవత్సరిక పండుగలో ప్రజలు అర్పించేవారు. యాజకులు ప్రజలు పెట్టుబడితో ధనవంతులు కావటానికి ఈ బలులు ఒక సాధనమాయ్యయి. తమ భాగాన్ని మించి కోరటమే గాక దేవుని కానుకగా కొవ్వును దహించే వరకు కూడా వారు వేచి ఉండటానికి ఇష్టపడేవారు కాదు. తాము కోరినంత భాగం ఇమ్మని పట్టుపట్టేవారు. ఆది ఇవ్వటానికి నిరాకరిస్తే దౌర్జన్యంగా లాక్కుంటూమని బెదరించేవారు. PPTel 579.2

యాజకుల భక్తిరహిత ప్రవర్తన గూడారసేవ పరిశుద్ధతను ప్రాముఖ్యాన్ని నాశనం చేయగా “జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహా” పడ్డారు ఆ బలలు ద్వారా తామ ఎదురు చూడాల్సి ఉన్న ఆ గొప్ప ప్రాయశ్చిత్తార్థబలికి గుర్తింపు కరువైయ్యింది. “గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను”. PPTel 579.3

భక్తిహీనులైన ఈ యాజకులు దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి తమ దూరాగతాలు దురాచారాల వల్ల తమ పరిశద్దు హోదాకు ఆప్రతిష్ట అపాదించారు. అయిన దైవ గూడారములో తమ ఉనికి ద్వారా దాన్ని అపవిత్రం చేస్తూనే ఉన్నారు. హోఫ్నీ ఫీనెహాసుల దుర్వారకనకు అగ్రహంతతో నిండిన అనేకమంది ఆరాధన స్థలానికి రావటం మానుకొన్నారు. దేవుడు నియమించిన అలయ సేవ ఈవిధంగా తృణీకారానికి నిర్లక్ష్యానికి గురి అయ్యింది,. PPTel 580.1

ఎందుచేతనంటే అది దుష్టుల పాపాలతో సంబంధము కలిగి ఉంది. దుర్మార్గానికి సముఖంగా ఉన్నవారు మరింత ధైర్యంగా పాపం చేసారు. భక్తిహీనత, నీతిహీనత విగ్రహారాధన సయితం ప్రబలమయ్యాయి. PPTel 580.2

పరిశుద్దాయ సేవలకు కుమారుల్ని వినియోగించటంలో ఏలీ ఘోరతప్పిదం. చేసాడు. ఏదో ఒక సాకుతో వారి దుర్వర్తనను సమర్ధించటం ద్వారా వారి పాపాల్ని చూడలేని అంధుడయ్యాడు. చివరికి వారి పాపాలు చూడకుండా కళ్ళు మూసుకోలేని స్థితి ఏర్పడింది. వారి దౌర్జన్యకాంద గురించి ప్రజలు ఫిర్యాదు చేసారు. ప్రధాన యాజకుడు వేదనకు దు:ఖానికి గురి అయ్యాడు. ఇక మౌనంగా ఉండేలేకపోయాడు. అయితే తనకుమారులు తమను గురించి తప్ప ఇతరుల గురించి ఆలోచించే స్థితిలో లేరు. తండ్రి దు:ఖించటం చూశారు. కాని వారి కఠిన హృదయాలు కరగలేదు. అతడి మొత్తటి హితోక్తులు విన్నారు కాని చలించలేదు. తమ పాప పర్యవసానల్ని గూర్చి హెచ్చరిక విని కూడా తమ మార్గాన్ని మార్చుకోలేదు. దుర్మార్గులైన తన కుమారులతో ఏలీ న్యాయంగా వ్యవహరించి ఉంటే వారిని యాజక హోదానుంచి తొలగించి వారికి మరణదండన విధేంచేవాడు. వారిని బహిరంగంగా అవమానించి శిక్షంచాల్సి వస్తుందేమోనన్న భయంతో వారిని అతి పరిశుద్ధమైన ఆ హోదాలో కొనసాగించాడు. వారు తమ దుర్నీతిని దేవుని పరిశుద్ధ సేవతో సమ్మిళితం చేయటానికి, ఎన్నో ఏళ్ళు వరకూ కోలుకోలేని విధంగా సత్యానికి విఘాతం కలిగించ టానికి వారిని ఇంకా పదవిలో కొనసాగనిచ్చాడు. ఇశ్రాయేయుల న్యాయాధి పతి తన కర్తవ్యాన్ని అలక్ష్యం చేసినప్పుడు ఆ విషయాన్ని దేవుడే తన చేతుల్లోకి తీసుకొన్నాడు. PPTel 580.3

“అంతట దైవ జనడొకడు ఏలీ యొద్దకు వచ్చి ఇల్లైనెను. యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని యింటి వారు ఐగుప్తుదేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఎఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేతనతి ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటిని నీ పితరుని నుంచి వారికిచ్చితిని. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరెల తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెడ్డుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములో శ్రేష్ట భాగములను పట్టుకొనుచు, నా కంటే నీ కుమారులను నీవు గొప్ప చేయు చున్నావు. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించు దుర్ణితన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెను... తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. అతడు నా యోచను బట్టి నాకనుకూలముగా యాజకత్వము జరిగించుచు, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును.. అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజకత్వము జరిగించును”. PPTel 580.4

ఏలీ తన కుమారుల్ని దేవునికన్నా ఎక్కువగా ప్రేమించాడని ప్రభువు ఆరోపించాడు. ఇశ్రాయేలీయులుకి ఆశీర్వాదంగా దేవుడు ఏర్పాటు చేసిన బలి అర్పణలను ప్రజలు ద్వేషించేటట్టుగా చేశాడు. ఏలీ, తమ దుర్వర్తన వలన తన కుమారులకు అవమానము కలుగకుండా చూసేందుకు బిడ్డల మీద గుడ్డి ప్రేమ చొప్పున వారిని తమ స్వార్ధకోరికల్ని తీర్చుకోనిసనూ తమ పాపం విషయమై వారిని దేవుని వాక్యానుసారంగా మందలించి వారి చెడుమార్గాన్ని సరిదిద్దకుండా తమ స్వీయ చిత్తానే అనుసరించి వ్యవహరింపనిచ్చేవారు దేవుని మహిమ పర్చేకన్నా దుష్టులైన తమ బిడ్డలనే గౌరవిస్తున్నట్లు బయలుపర్చుకొంటారు. దేవుని మహిమ పర్చటం కాన్న వారి ప్రతిష్టను కాపాడటానికి ఎక్కువ ఆతురతగా ఉంటారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చటం కాన్న ఆయన సేవ పై ఎలాంటి నిందలు పడకుండా దాన్ని కాపాడటం కన్నా తమ బిడ్డల్ని తృప్తిపర్చటానికి ఆతురతగా ఉంటారు. PPTel 581.1

ఇశ్రాయేలీయులు యాజకుడూ న్యాయాధిపతి అయిన ఏలీని తన ప్రజల నైతిక ప్రవర్తనకు మతాసక్తికి మరి ముఖ్యంగా తనకుమారుల ప్రవర్తనకు బాద్యుణ్ణి చేసాడు దేవుడు. దుర్మార్గతను నిరోధించటానకి అతడు మొదట స్వల్ప చర్యల ద్వారా ప్రయత్నించి ఉండాల్సింది. అవి పని చేయునప్పుడు ఆ తప్పును తీవ్ర చర్యతో నిర్మూలించి ఉండాల్సింది. పాపాన్ని ఖండించి దోషిని దండించటంలో విఫలమై నందుకు అతడు దేవుని అగ్రహానికి గురి అయ్యాడు. ఇశ్రాయేలీయుల్ని నీతి మార్గంలో నడిపించేందుకు దేవుడు అతడి మీద ఆధారపడలేకపోయాడు. తప్పును గద్దించటానికి ధైర్యం లేని వారు లేదా సోమరితనం వల్ల గాని ఆసక్తి లేనదు వల్లగాని కుటుంబాన్ని లేదా సంఘాన్ని శుద్ధిపర్చటానికి చిత్తశుద్ధితో కృషి చేయనివారు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వల్ల కలిగే దుష్పరిణామాలకు బాధ్యులవుతారు. తల్లితండ్రులుగా లేదా పాదిరిగా మన అధికారాన్ని ఉపయోగించుకొని మనం ఇతరుల్లో నిరోధించగలిగి ఉండే దోషాల ఫలితంగా చోటు చేసుకొనే చెడుగుకు అవి మన సొంత దోషాలైనట్లే మనం బాధ్యులమౌతాం. PPTel 581.2

కుటుంబ పాలనకు దేవుడిచ్చిన నిబంధనల ప్రకారం ఏలీ తన గృహాన్ని నడలేదు. తన సొంత తెలివితేటల మీదే ఆధారపడ్డాడు. ఆ తండ్రి తన కుమారుల చిన్నతనంలో వారి పొరపాట్లును పాపాన్ని పట్టించుకోలేదు. వారు క్రమేపి ఆ పొర పాట్టులను అధిగమిస్తారని భావించి తృప్తి చెందాడు. అనేకులు ఇప్పుడు ఇలాంటి పొరపాటే చేస్తున్నారు. తమ బిడ్డలశిక్షణ విషయంలో తన వాక్యంలో దేవుడిచ్చిన ఉపదేశం కన్నా మెరుగైన మార్గం తమకు తెలుసునని వారు భావిస్తారు. శిక్షించటానికి తమ బిడ్డలు చాలా చిన్నవాళ్ళని యుక్తాయుక్త జ్ఞానం వచ్చేవరకు ఆగడం మంచిదని సాకులు చెబుతూ తప్పుడు ప్రవృత్తులకు నీరు నారు పోస్తున్నారు. ఈరకంగా చెడ్డ అలవాట్లు బలపడి నిత్యమూ నిలిచిపోవటం జరగుతుంది. పిల్లలు నియంత్రణ లేకుండా పెరుగుతారు. జీవితకాలమంతా ఓ శాపంగా ఉండి ఇతరుల్లో పునారావృత్త మయ్యే అవకాశమున్న దుర్గణాలు వారికి ఇలా అలవడ్డాయి. PPTel 582.1

యువతను తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించటానికి విడిచి పెట్టటంకన్నా కుటుంబాలు చేయగల పెద్ద పొరపాటు ఇంకొకటుండదు. పిల్లలు కొరే ప్రతీ కొర్కెను తల్లితండ్రులు పరిగణలోనికి తీసుకొని అది వారికి మంచిదని తెలిసికూడా దాన్ని చెల్లించటానికి పూనుకొన్నప్పుడు పిల్లలకు తమ తల్లితండ్రుల పట్ల దేవుని అధికారం పట్ల మానవుడి అధికారం పట్ల గౌరవం నశిస్తుంది. వారు సాతానుకి బానిసలైనడుచు కొంటారు. క్రమబద్ధం కాని కుటుంబ దుష్ప్రభావం విస్తరించి సమాజానికి కీడు చేస్తుంది. అది వరదవలె పొంగి కుటుంబాలన్ని సమాజాల్ని ప్రభుత్వాల్ని అతలా కుతలం చేస్తుంది. PPTel 582.2

ఏలీ హోదాను బట్టి అతడి పలుకుబడి ఎక్కువగా విస్తరించింది. తాను సమాన్య వ్యక్తి అయితే. అది అంతగా విస్తరించేది కాదు. అతడు కుటుంబ జీవితం ఒరవడిని ఇశ్రాయేలు ప్రజలందరు అనుసరించారు. అతడి ఆదర్శాన్ని అనుకరించిన వేలాది కుటుంబాల్లో అతడి నిర్లక్ష్య, సుఖలాలస జీవిత దుష్పలితాలు కళ్లకుకట్టాయి. తల్లితండ్రులు మత నిష్టగలవారుగా కనిపిస్తుండగా తమ బిడ్డలు దుష్కార్యాల్లో నిమగ్నులై ఉంటే దేవుని గూర్చిన సత్యం అపనిందలకు గురి అవుతుంది. ఓ కుటుంబం క్రైస్తవ్యాన్ని నిగ్గు తేల్చే ఉత్తమ పరీక్ష ఏదంటే దాని ప్రభావం వల్ల రూపు దిద్దుకున్న ప్రవర్తనే. దైవ భక్తికి ప్రకటించే పలుకుల కాన్న పనులే గట్టిగా వినిపిస్తాయి. మతం ఆచరిస్తున్నట్లు చెప్పుకునేవారు దేవుని విశ్వసించటం వల్ల ఒనగూడే ఉపకారాలకు సాక్షులుగా నివసిస్తూ తమ కటుంబాల్ని క్రమశిక్షణ గల గృహాలుగా తీర్చిదిద్దుకొనే బదులు వారి యాజమాన్యంలోను పాలనలోను ఉదా సీనంగా వ్యవహరించి తమ బిడ్డల చెడు కొర్కెల్ని తీర్చుతూ పోయినట్లయితే వారి ప్రవర్తన ఏలీ ప్రవర్తనలాగే ఉంటుంది. అట్టి వారు క్రీస్తు సేవను అప్రతిష్ట పాలు చేసి తమ మీదికి తమకుటుంబాల మీదికి నాశనం తెచ్చుకుంటారు. తల్లితండ్రుల వైఫల్యం వల్ల చాలా దుష్పరిణామాలు సంభవిస్తుండగా ప్రజోపదేశకులుగా నియ మితులైన బోధకుల కుటుంబాల్లో అవి చోటు చేసుకుంటే వాటి వల్ల పది రెట్లు అధికంగా ఉంటుంది. మీరు తమ సొంత కుటుంబాల్నే నిభాయించుకోలేనప్పుడు ఆ తప్పుడు ఆదర్శం వల్ల వారు అనేకుల్ని తప్పుడు మార్గంలో నడిపిస్తారు. తమ హోదా బాధ్యతాయుతమైంది. గనుక వారి దోషిత్వం ఇతరుల దోషితత్వకన్నా తీవ్రంగా ఉంటుంది. PPTel 582.3

అహారోను వంశం నిరంతరంగా దేవుని ముందు నడుస్తుందని దేవుడు వాగ్దానం చేసాడు. అయితే వారు హృదయపూర్వకంగా ఆలయ సేవ నిర్వహించి అన్ని విషయాల్లోను దేవుని గౌరవించటమన్న షరతును నెరవేర్చటం మీద దీని నెరవేర్పు ఆధారడి ఉంది. దేవుడు ఏలీని అతని కుమారుల్నీ పరిక్షించాడు.తన సేవలో ఉ న్నత మైన యాజక హోదాకు వారు యోగ్యులుకారని ప్రభువు కనుగొన్నాడు. “అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెను”అని దేవుడు సెలవిచ్చాడు. వారు తమ పాత్రను పోషించలేకపోయారు గనుక వారికి చేయాలని యోచించిన మేలు ఆయన చేయలేకపోయాడు. పరిశుద్ద కార్యాల్లో సేవలు చేసేవారి ఆదర్శం దేవుని గౌరవించటంలో ప్రజల్ని నడిపించేదిగాను ఆయనకు వ్యతిరేకంగా నడుచు కోవటానికి వారిలో భయం పుట్టించేదిగాను ఉండాలి. “క్రీస్తు పక్షముగా” దేవుని కృప పమాధానాల్ని గూర్చిన వర్తమానాన్ని ప్రజలకందించుటంలో బోధకులు తమ పరిశుద్ధ హోదాను స్వార్దావలు కోరికలు తీర్చుకోవటానికి ఉపయోగించినప్పుడు వారు సాతానుకి శక్తిమంతులైన ప్రతినిధులుగా పరిణమిస్తారు. సూఫ్నీ ఫీనెహాసు లాగ ప్రజలు “యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు”వారు కారకు లవుతారు. కొంతాకాలం వారు తమ దుష్కార్యాల్ని గుట్టు చప్పుడు కాకుండా జరిగింవచ్చు. అయితే చివరికి వారి నిజస్వరూపం బట్టబయలైనప్పుడు ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. పర్యవసానంగా వారి నమ్మకం నాశనమౌతుంది. అది వాక్యోపదేశకుల పట్ల మనసులో సంశయాన్ని మిగుల్చుతుంది. యధార్ధ బోధకుడి వర్తమానాన్ని అంగీకరించటానికి మనసు సందేహిస్తుంది. మనం ఎంతో పరిశు ద్దడనుకొన్న వ్యక్తి “పరమ దుర్మార్గుడని తెలసింది కదా? ఇతడు అలాంటివాడు కాదా”? అన్న ప్రశ్న పదే పదే తలెత్తుతుంది. ఈ విధముగా దైవ వాక్యందాని ప్రభావాన్ని మనుషుల హృదయాల పై చూపలేకపోతున్నది. PPTel 583.1

కుమారుల మందలింలపులో ఏలీ పలికిన మాటలు ప్రాముఖ్యాన్ని సంతరించు కొన్నాయి. పరిశుద్ద వాక్య సేవకు అంకితమైన వారందరూ పరిగణించాల్సిన మాటలవి! “నరునికి నరుడు తప్పుచేసిన యెడ దేవుడు విమర్శచేయును గాని యెవరైనను యెహోవా విషయములో పాపము చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును”? తమ నేరాలు తమ తోటి మనుషులకు మాత్రమే హాని చేసి ఉంటే శిక్ష విధింపు పరిహారం చెల్లింపు ద్వారా న్యాయాధిపతి రాజీ కుదిర్చేవాడు. అపరాధులు ఇలా క్షమాపణ పొందేవారు.లేదా వారు దురభిమానపాపం చేసి ఉండ కపోతే వారిపక్షంగా అతడు పాపపరిహారార్ధబలి అర్పించేవాడు. అయితే సర్వోన్నతుని యాజకులుగా వారి పాపాలు వారి సేవకు సంబంధించినవి. పాప పరిహారం నిమిత్తం అర్పించే బలి సందర్భముగా వారు ప్రజల ముందు దైవారాధనను అపవిత్రపర్చి అభాసుపాలు చేశారు. దానికి ఎలాంటి ప్రాయశ్చిత్తమూ అంగీకృతం కాదు. ప్రధాన యాజకుడైన తమ సొంత తండ్రే వారి తరుపున విజ్ఞాపన చేసేందుకు స్వాసించ లేదు. పరిశుద్ధ దేవుని ఉగ్రత నుంచి వారిని కాపాడలేక పోయాడు. మానవ విమోచనర్దాం దేవుడు నియమించిన సాధనాల్ని కించపర్చేవారు. పాపులందరిలోను ఎక్కువ అపరాధులు. వారు “దేవుని కుమారుని మరల సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపర్చుచున్నారు” హెబ్రీ 6:6 PPTel 584.1