ఇశ్రాయేలీయుల రాజ్యపాలన దేవుని పేర ఆయన అధికారం కింద సాగింది. మోషే డబ్బయమంది పెద్దలు, ప్రధానులు న్యాయాధిపతుల బాద్యత దేవుడు తమకిచ్చిన నిబంధనల్ని అమలుపర్చటమే. వారికి దేశ చట్టాలుచేసే అధికారం లేదు. ఒక రాజ్యంగా ఇశ్రాయేలు దేశం ఇలాగే పని చేసింది. ఇలాగే కొనసాగింది. ప్రజలకు ఉపదేశం ఇచ్చి దైవ నిబంధనల ఆచరణకు నాయకత్వం వహించటానికి ప్రతీ యుగంలోను ఆత్మవేశం పొందిన మనుషులు నియుక్తులయ్యారు. PPTel 607.1
ఇశ్రాయేలు ప్రజలు రాజు కావాలని కోరారని దేవుడు ముందు గ్రహించాడు. అయితే ఆ జాతి ఏ సూత్రాల పై స్థాపితమయ్యిందో వాటి విషయంలో మార్పుకు దేవుడు సమ్మతించలేదు. మహోన్నతుడైన దేవునికి రాజు ప్రతినిధిగా వ్యవహరించాల్సి ఉన్నాడు. దేవున్నే ప్రజలు తమ జాతి అధినేతగా గుర్తించాలు ఉన్నారు. ఆయన ధర్మశాస్త్రాన్ని దేశం సర్వోన్నత చట్టంగా గుర్తించి అనుసరించాల్సి ఉంది. PPTel 607.2
ఇశ్రాయేలు కనానులో మొదట స్థిరపడిన కాలంలో ప్రజలు దైవపరిపాలన సూత్రాలన్ని ఆమోదించారు. యెహోషువ పరిపాలన కింద దేశం ప్రగతి చెందింది అయితే జనాభా పెరుగుదల, ఇతర జాతులతో ఇశ్రాయేలీయులు స్నేహ సంబంధాలు ఏర్పడడంతో మార్పు చోటు చేసుకుంది. ప్రజలు అన్యులైన తమ పొరుగువారి ఆచారాల్లో చాలా వాటిని అవలంభించి తమ విలక్షణమైన పరిశుద్ధమైన ప్రవర్తనను చాలా మట్టుకు కోల్పోయారు. దేవుని పట్ల భక్తి విశ్వాసాల్ని క్రమక్రమంగా మానుకొని తాము దేవుడు ఎన్నుకున్న ప్రజలమన్నన గౌరవాన్ని తృణీకరించారు. అన్యరాజు ఆడంబరం, ప్రదర్శనలకు ఆకర్షితులైన ప్రజలు తమ సాధారణ జీవితంతో అసంతృప్తి చెందారు. గోత్రా మధ్య ఈర్ష్యాసూయలు చోటు చేసుకున్నాయి. అంతర్గత వైరుధ్యాలు వారిని బలహీనపర్చాయి. అన్యులైన శత్రువుల దాడులికి వారు సర్వదా గురి అయ్యారు. ఇతర జాతుల మధ్య తమ ఆస్తిత్వాన్ని నిలుపుకోవటానికి గాను ఒక బలమైన కేంద్ర పరిపాలన కింద తమ గోత్రాలన్ని ఏకం కావటం అవసరమన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. ధర్మశాస్త్రాచరణకు భరతవాక్యం పలికిన ఆ ప్రజలు దేవుని సౌర్వభౌమాధికారానికి మంగళం పలకాలని కోరుకున్నారు. రాజు స్వామ్యం కావలన్న డిమాండు ఇశ్రాయేలు దేశమంతటా ఇలా బలం పుంజుకొంది. యెహోషువ కాలం నాటి నుంచి సాగుతూ వచ్చి రాజ్యపాలన సమూయేలుకింద జరిగినదంత జ్ఞానయుక్తవంగాను విజయవంతంగాను మరెన్నడూ జరగలేదు. న్యాయాధిపతి ప్రవక్త, యాజకుడు అనే త్రివిధ బాధ్యతల్ని దేవుని వల్ల పొందిన సమూయేలు ప్రజలు విశాల హితం కోసం నిర్విరామంగా, నిస్వార్ధంగా పాటుపడ్డాడు. అతడి నేతృత్వం కింద దేశం సర్వతోముఖాభివృద్ధి చెందింది. క్రమం తిరిగి వచ్చింది. దైవభక్తి పెరిగింది. కొంతకాలం వరకు అసంతృప్తి అదుపులోకి వచ్చింది. కాగా వయసు పెరగటంతో రాజ్యపాలన బాధ్యతల్ని ప్రవక్త ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కనుక తనకు సహాయకులుగా తన ఇద్దరు కుమారుల్నీ నియమించాడు.సమూయేలు తన బాధ్యతల్ని రామాలో నిర్వహిస్తుండగా దేశం దక్షిణ సరిహద్దుల సమీపంలో ఉన్న ప్రజలకు న్యాయాధిపతులుగా వ్యవహరించ టానికి ఈ యువకులిద్దరూ బేయేరైబాలో నివసించారు. PPTel 607.3
ప్రజల పూర్తి అంగీకారంతోనే తనకుమారుల్ని ఆ పదవిలో సమూయేలు నియమించాడు. కాని తమను ఎంపిక చేసిన తండ్రి పేరు వారు నిలబెట్టలేదు. ఇశ్రాయేలీయుల పరిపాలకులు న్యాయమైన తీర్పులు చెప్పాలని, విధవరాండ్రకు న్యాయం చెయ్యాలని లంచం పట్టుకూడదని మోషే ద్వారా ప్రభువు ఇశ్రాయేలీయుల్ని ఆదేశించాడు. అయితే సమూయేలు కుమారులు “ధనా పేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును” తలకిందులు చేసారు. తమ మనసుల్లో నాటింపజెయ్య టానికి తండ్రి ప్రయత్నించిన సూత్రాల్ని ప్రవక్త కుమారులు లెక్కజేయలేదు. తండ్రీ పవి త్ర నిస్వార్ధ జీవితాన్ని వారు అనుకరించలేదు. ఏలీకి దేవుడు చేసిన హెచ్చరిక సమూయేలు మనసును అంతగా ప్రభావితం చేయలేదు. సమూయేలు కుమారుల్ని అతి గారాబంగా చేసాడు. దాని ఫలితం వారి ప్రవర్తన లోను, జీవితంలోను కనిపించింది. PPTel 608.1
ఈ న్యాయాధిపతుల అన్యాయాలు శ్రుతిమించి ప్రజల్లో అంసతృప్తి పుట్టి తాము రహస్యంగా కోరుకొంటున్న మార్పును కావాలనటానికి ప్రజలకు ఒక సాకుగా ఉప కరించిది. “ఇశ్రాయేలీలయుల పెద్దలందరును కుడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్దుడవు. నీకుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒకరాజును నియమింపుము. అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి”. ప్రజలు తమకు జరిగిన అన్యాయాల్ని సమూయేలుకి నివేదించలేదు. కుమారుల దుర్మార్గత తనకు తెలిసి ఉంటే సమూయేలు వారిని తక్షణమే తొలగించేవాడు. కాని ఆ ఫిర్యాదుదారులకి కావలసింది ఇది కాదు. వారి అసలు ఉద్దేశం అంసతృప్తి అహంకారం అని వారు ఒక పథకం ప్రకారం అలా డిమాండు చేస్తున్నారని సమూయేలు పసికెట్టేశాడు. సమూయేలు మీద వారికి ఎలాంటి ఫిర్యాదు లేదు. అతడు పారద్శకంగా విజ్ఞతతో పరిపాలించడాని అందరు సాక్ష్యమిచ్చారు. ఏమైనా ఆ వృద్ధ ప్రవక్త ఆ డిమాండును తనపై విమర్శగాను తనను పక్కన పెట్టటానికి ప్రత్యక్ష ప్రయత్నంగాను భావించాడు. అయితే సమూయేలు తన మనోగతాన్ని బహిరగ్గతం చెయ్యలేదు. ఎవర్నీ నిందించలేదు. ఆవిషయాన్ని ప్రార్ధన ద్వారా దేవుని ముందు ఎట్టాడు. ఆయన సలహాను కోరాడు. PPTel 608.2
ప్రభువు సమూయేలుతో ఇలా అన్నాడు. “జనులు నీతో చెప్పి మాటలన్నిటి ప్రకారం జరిగింపుము; వారు నన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండ నన్నే విజసర్జించియున్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ యెడలను జరిగించుచున్నారు”. వ్యక్తిగతముగా కూడా తన పట్ల వారు ప్రవర్తించిన తీరుకు బాధపడినందుకు అతడికి ఇది గద్దింపు. ప్రజలు తన పట్ల అగౌరవం ప్రదర్శించలేదు. తన ప్రజల మీద పరిపాలకుల్ని నియమించిన దేవుని అధికారాన్ని కించపర్చారు. నమ్మకమైన దైవ సేవకుణ్ణి తృణీకరించి నిరాకరిస్తున్నారు. ఆ వ్యక్తి పట్ల మాత్రమే కాదు ఆ వ్యక్తిని పంపిన ప్రభువు పట్ల మాత్రమే కాదు. ఆ వ్యక్తిని పంపిన ప్రభువు పట్ల అగౌరవం ప్రదర్శిస్తున్నారు. వారు పక్కన పెడున్నవి దేవుని మాటలు, ఆయన మందలింపులు, ఆయన హితవాక్కులు, వాళ్ళు తోసి పుచ్చుతున్నది ఆయన అధికారాన్ని. PPTel 609.1
ఇశ్రాయేలీయులు యెహోవాను రాజుగా గుర్తించిన దినాలే వారు ఎక్కువ ప్రగతి సాధించిన దినాలు. అప్పటి చట్టాలు రాజ్య పరిపాలన నాటి రాజ్యలన్నిటి లోను మిక్కిలి శ్రేష్టమైనవి గుర్తింపు పొందాయి. ప్రభువు ఆల్ని గురించి మోషే ఇశ్రాయేలీయులకి ఇలా ప్రకించాడు “ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని ఆచరించవలెను. వాటిని గూర్చి విను జనములు దృష్టికి అదే మీకు జ్ఞానము,. అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనమున జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకొందురు”. ద్వితి 4:6 కాని దేవుని నిబంధనల్ని ఉల్లఘించటం ద్వారా తాను వారిని ఎలాంటి జనులుగా రూపుదిద్దాలని ఉద్దేశించాడో ఆప్రజలుగా వారిని ఆయన రూపొందించలేకపోయాడు. అనంతరం తమ పాపాలు దుష్కృతాల వల్ల ఏర్పడ్డ చెడుగులన్నిటిని దేవుని పరిపాలన మీద పెట్టారు. పాపం వారిని పూర్తిగా గుడ్డివారిని చేసింది. PPTel 609.2
ఇశ్రాయేలీయులు రాజు పరిపాలన కిందకి వస్తారని ప్రభువు ముందే తన ప్రవక్తల ద్వారా చెప్పాడు. అలాగని ఆ మోస్తరు స్వామ్యం ఉత్తమమైందని గాని దేవుని చిత్తాన్ని అనుసరించి ఏర్పడిందని గాని కాదు. ఆ ప్రజలు తన సూచన ప్రకారం నడుచుకోవటానికి నిరకరించారు. గనుక వారు తమ ఇష్టపకారం వ్యవహరించటానికి దేవుడు అంగీకరించాడు. కోపముతో దేవుడు ఇశ్రాయేలీయులకి రాజును ఇచ్చినట్లు హో షేయ చెబుతున్నాడు. హోషయ 13:11 దేవునితో సంప్రదించకుండా లేక ప్రకటితమైన ఆయన చిత్తానికి విరుద్ధం మనుషులు తమ సొంత మార్గాన్ని అనుసరించినట్లయితే తరుచు ఆయన వారి కోర్కెను నెరవేర్చుతాడు. తమ చేదు అనుభవం ద్వారా తమ పొరపాటు గుర్తించి పశ్చాత్తాపం పొందేందుకు ఆయన ఇలా చేస్తాడు. మానవ దురహంకారాన్ని మానవ జ్ఞానాన్ని నమ్ముకోవటం ప్రమాదకరం. దైవ చిత్రానికి విరుద్ధంగా హృదయం కోరేదంతా ఎవరికి దీవెనగా గాక శాపంగా పరిణమిస్తుంది. PPTel 610.1
ధర్మశాస్త్రకర్తగాను తమ బలానికి నిలయంగాను తన ప్రజలు తనను మాత్రమే నమ్ముకోవలన్నది దేవుని కోరిక. తమ అండ ఆయనేన్న మనోభావనతో వారు ఆయనకు ఎల్లప్పుడు దగ్గరగా ఉంటారు. ఉన్నతమైన ఉదాత్తమైన వ్యక్తులవుతారు. తాను ఎంపకి చేసుకున్న ప్రజలుగా ఆయన వారికి ఏర్పాటు చేసిన నిత్య భవిష్యత్తుకు అర్హులవుతారు. అయితే ఒక మనిషి సింహాసనాన్నెక్కినప్పుడు అది ప్రజల మనసుల్ని దేవునికి దూరంగా ఉంచే అకాశం కల్పిస్తుంది. ప్రజలు మానవశక్తి సమాధ్యాల్ని ఎక్కువ దైవ శక్తిని తక్కువ నమ్ముకోవటం జరుగుతుంది. రాజు దోషాలు ప్రజల్ని పాపంలోకి నడిపించి ఆ దేశాన్ని దేవుని నుంచి విడదీస్తాయి. PPTel 610.2
ప్రజల కోరికను నెరవేర్చమని, అయితే అది తనకు సమ్మతం కాని పని అని వారికి వ్యక్తం చేస్తూ తమ చర్య పర్యవసానం ఎంటో వారికి వివరించమని దేవుడు సమూయేలుని ఆదేశించాడు. ‘సముయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నిటిని ” వినిపించాడు. తమ మీద కలిగే శ్రమలను వారికి స్పష్టంగా వివరించాడు. తక్కిన రాజుల్ని ఆనుకరిస్తూ తమ రాజు అండంబరంగా విలాసంగా నివస్తాడు. అలాంటి జీవితాన్ని కొనసాగించటానికి తమ మీద తమ ఆస్తులు మీద భారమైన పన్నుల విధంపు అవసరమౌతుంది. తమయువజనుల్లో శ్రేష్టమైన వారు రాజుకు కొలువు చేయటానికి అవసరమౌతారు. తన రథాలు నడపటానికి గుర్రాలు తోలటానికి, తన మందు పరుగెత్తి మార్గం సరళం చెయ్యటానికి వారిని ఉప యోగిస్తాడు. వారు సైన్యంలో చేరి యుద్ధం చెయ్యాలి. తన పొలాలు దున్ని నపంటలు కోసి తన యుద్దాలకు కావలసిన ఆయుధాల్ని తయారు చేయాలి. ఇశ్రాయేలీయుల ఆడపడుచులు రాజ కుటుంబానికి పంటలు పండి రొట్టెలు తయారు చేయాల్సి ఉంటుంది. తన రాచరికాన్ని కాపాడుకోవటానికి తమకు దేవుడిచ్చిన శ్రేష్ఠమైన భూముల్ని అతడు స్వాధీనపర్చుకొంటాడు. తమ ఉత్తమ సేవకుల్ని పశుసంపదను అతడు తీసుకొని “తన పనికొరకు ఉంచుకొనును”.అంతే కాదు తమ ఆదాయంలోను తమ పని ద్వారా సంపాదించిన లాభంలోను, పొలాల్లో పండించిన పంటలోను పదోభాగం రాజుకు చెల్లించాలి. “మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. ఆ దినమున మీరు కోరుకొనిన రాజునుబట్టి మీరు మొట్టె పెట్టినను యెహోవా మీ మొట్ట వినకపోవును” అని ప్రవక్త హెచ్చరించాడు. దానిలో ఇమిడి ఉన్న భారాలు బాధలు ఎలాంటివైనప్పటికిని రాజు పరిపాలన ఒకసారి స్థాపితమైతే దాన్ని తొలగించుకోవటం సాధ్యపడదని ప్రవక్త హెచ్చరించాడు. PPTel 610.3
అయితే ప్రజలిచ్చిన సమాధానం ఇది. “అలాగునకాదు, జనములు చేయు రీతిని మేము చేయునట్లు మాకు రాజు కావలెను. మా రాజు మాకు న్యాయము తీర్చను, మా ముందరపోవుచు అతడే మా యుద్ధములను జరిగించును”. PPTel 611.1
“జనములు చేయురీతిని” ఈ విషయంలో ఇతర ప్రజాల్లో ఉండక పోవటం ఒక విశిష్టావకాశం ఆశీర్వదామూనని ఇశ్రాయేలీయులు గుర్తించలేదు. ఇశ్రాయేలీ యుల్ని తన విలక్షణ ప్రజలుగా తీర్చి దిద్దేందుకు ఇతర జాతులనుంచి దేవుడు వేరు చేసాడు. అయితే వారు ఈ ఉన్నత గౌరవాన్ని తోసి రాజని అన్య ప్రజల ఆదర్శాన్ని అనుకరించటానికి వెంపర్లాడారు. దైవ ప్రజలమని చెప్పుకొనేవారు లోక సంప్రదాయాల్ని ఆచారాన్ని అనుసరించటానికి ఈనాడు తహతహలాడున్నారు. దేవునికి దూరమయ్యేకొద్ది వారు లోక ప్రయోజనాలకు ప్రతిష్ఠకూ అర్రులు సాచటం ఎక్కువవుతుంది. ఈ లోక దేవతను పూజించటానికి ప్రయత్నిస్తున్న వారి ఆచారాల్ని ఆలవాట్లన్ని అనురించటానికి క్రైస్తవులు నిత్యమూ ప్రయత్నిస్తున్నారు. భక్తిహీనులతో స్నేహం పెంచుకొని వారి ఆచారాల్ని అనుసరించటం ద్వారా వారి పై బలీయమైన ప్రభావం చూపించవచ్చునని అనేకమంది వాదిస్తారు. ఈ మార్గాన్ని అవలంబించే వారంతా ఆ రీతిగా తమ శక్తికి నిధి అయిన ప్రభువుతో తెగతెంపులు చేసుకుంటారు. లోకానికి మిత్రులైన వారు దేవునికి శత్రువులవుతారు. ఏ గౌరవాన్నివ్వటానికి దేవుడు తమను పిలిచాడో దాన్ని వారు లోక గౌరవాన్ని సంపాదించటం కోసం వారు త్యాగం చేస్తారు. చీకటిలోనుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి తమను పిలిచిన ప్రభువు గుణాతిశయాల్ని ప్రచురింటచం మానుకొంటారు 1 పేతురు 2:9 PPTel 611.2
ప్రజలు పలికిన మాటలు విన్నప్పుడు సమూయేలు చాలా బాధపడ్డాడు. అయితే ప్రభువిలా అతడితో అన్నాడు. “నీవవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమింపుము”. ప్రవక్త తన విధిని నిర్వర్తించాడు. హెచ్చరికు నమ్మకంగా అందించాడు. కాని ప్రజలు దాన్ని నిరాకరించారు. బరువెక్కి న హృదయంతో ప్రజల్ని పంపించేశాడు. పరిపాలనా విధానంలో చోటుచేసుకోవాల్సి ఉన్న మార్పుకు సిద్ధపడేందుకు తాను కూడా అక్కడ నుండి వెళ్ళిపోయాడు. PPTel 612.1
స్వార్థపరులైన యాజకులకు పెద్దలకు, శరీరాశలతో గర్వంతో నిండిన ఇశ్రాయేలీయుల సమజానికి పవిత్రము స్వార్థ రహితము అయిన సమూయేలు జీవితం నిత్యం నిలిచే మందలింపు అయ్యింది. అతడిలో ఆడంబరం, గర్వం లేనే లేవు. అతడి సేవ పై ఏదేవుని ఆమోద ముద్రపడింది తాను ఎవరి మార్గదర్శకత్వం కింద హెబ్రీ ప్రజల్ని పరిపాలించాడో ఆ లోక రక్షకుడే సమూయేలుని గౌరవించాడు. కాగా అతడి భక్తితో నీతి ప్రవర్తనతో ప్రజలు విసుగు చెందారు. సున్నితమైన అతడి అధికారాన్ని ప్రజలు తృణీకరించారు. అతణ్ణి తోసి రాజని రాజుగా తమను పరిపాలించటానికి వేరొక వ్యక్తిని ఎన్నుకున్నారు. PPTel 612.2
సమూయేలు ప్రవర్తనలో క్రీస్తు ప్రవర్తన ప్రతిబింబాన్ని చూస్తున్నాం. నిష్కళంకమైన క్రీస్తు ప్రవర్తన సాతునికి అగ్రహాం పుట్టించింది. ఆ ప్రభువు జీవితం లోకానికి వెలుగుగా ఉంది. అది మనవ హృదయాల్లో దాగి వున్న భ్రష్టును బయట పెట్టింది. పరిశుద్దులుగా చలామణి అయ్యే కపట భక్తులు క్రీస్తు పట్ల వ్యతిరేకత ప్రదర్శించటానికి హేతవు అయిన పరిశుద్ధ జీవితమే. క్రీస్తు లోక సంపదతోను, ప్రతిష్టతోను రాలేదు. ఈ లోకంలో ఏమానవాధికారికి లేని శక్తి తనకున్నదని ఆయన తాను చేసిన కార్యాల ద్వారా నిరూపించుకున్నాడు. పరిపాలనా విముక్తికి యూదులు మెస్సీయు కోసం ఎదరు చూసాడు. అయినా దాన్ని మన మీదికి తెచ్చి పాపాల్ని వారు ప్రేమించారు. క్రీస్తు తమ పాపాల్ని కప్పిపుచ్చి తమ భక్తిని ప్రశంసించి ఉంటే ఆయనకు వారు రాజుగా గౌరవించేవారు. అంతేగాని ఆయన తమ దుష్టత్వాన్ని నిర్భయంగా ఖండించటాన్ని వారు సహించలేకపోయారు. ఔదార్యం, పవిత్రత, పరిశుద్ధతతో అలరారిన ప్రవర్తతను, పాపాన్ని తప్ప మరి దేనిని ద్వేషించని ప్రవర్తనను వారు తృణీకరించారు. ఈ ప్రపంచములో ప్రతీ యుగంలోనూ ఇదే జరుగుతూ వచ్చింది. పరలోకం నుంచి వస్తున్న వెలుగులో నడిచేందుకు నిరాకరించే వారందరికి అది శిక్షను తెస్తుంది. పాపాన్ని ద్వేషించేవారి ఆరద్శం తమను మందలించినప్పుడు కపట క్రైస్తవులు సాతాను కార్యకర్తలై నమ్మకంగా ఉన్న భక్తుల్ని బాధలకు హింసలకు గురి చేస్తారు. ‘క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రదుకనుద్దేశించు వారందరు హింస పొందుదురు”. 2 తిమోతి 3:12 PPTel 612.3
ఇశ్రాయేలీయుల్ని రాజు పరిపాలిస్తున్నాడని ప్రవచనం ముందే చెప్పినప్పటికి రాజును ఎంపిక చేసే హక్కును దేవుడు అట్టి పెట్టుకొన్నాడు. రాజు ఎంపికను దేవునికి పూర్తిగా విడిచి పెట్టే విషయంలో హెబ్రీయలు ఇప్పటి వరకు ఆయన అధికారాన్ని గౌరవించారు. బెన్యామీను గోత్రం వారు కీషు కుమారుడు అయిన సౌలు ఎంపి కయ్యాడు. PPTel 613.1
తమకు రాజు కావాలని పట్టుపట్టిన ప్రజల హృదయాల్లోని అతిశయానికి ధీటుగానే భవిష్యత్తులో రాజు కావాల్సి ఉన్న వ్యక్తి గుణలక్షణాలు ఉన్నాయి. “ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడొకడును లేడు”. 1 సమూయూలు 9:2 హుందాతనం, నవయౌవనం, చక్కదనం, తొణికిసలాడూ పొడవుగా ఠీవిగా ఉన్న అతడు శాసించటానికే పుట్టినట్లు కనిపించాడు. ఇన్ని బాహ్యకర్షలున్నా వాస్తవ జ్ఞానాన్ని సూచించే ఉన్నత గుణ లక్షణాలు సౌలుకు లోపించాయి. దుందుడుకు ఉద్రేకాల్ని అగ్రహావేశల్ని అదుపు చేసుకోవటం తన యౌవన దశలో నేర్చుకోలేదు. దైవ కృప నవీకరణ ప్రభావం కిందకి ఎన్నడూ రాలేదు. PPTel 613.2
ధనమూ ప్రాబల్యమూ గల నాయకుడి కుమారుడైన సౌలు అలాంటివాడు. అయినా అనాటి సామన్య జీవన విధానాన్ననుసరించి తండ్రితో కలసి వ్యవసాయ పనులు చేస్తున్నాడు. తండ్రి పశువుల కొన్ని కొండల్లో తప్పిపోవడంతో ఒక సేవకుడితో కలసివాటిని వెదకటానికి సౌలు బయలుదేరాడు. వాటికోసం మూడు రోజులు వ్యర్ధంగా వెదికారు. అలవారు సమూయేలు నివసిస్తున్న రామా సమీపానికి వచ్చారు. తాము వెదుకున్న జంతువుల నిమిత్తం సమూయేలును సంప్రదించటం మంచిదని సేవకుడు అతడికి సలహా చెప్పాడు. “నా యొద్ద పావు తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుని కిత్తును” అన్నాడు. ఇది అ దినాల్లో ఉన్న ఆచారం. పై అధికారిని లేదా పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిని ఎవరైనా కలవాలనుకొంటే మర్యాదకు చిన్న బహుమతి ఇవ్వటం ఆచారం. PPTel 613.3
వారు పట్టణం శివార్ల వద్దకు వచ్చినప్పుడు నీళ్ళు చేదుకొనేందుకు అక్కడకు వచ్చిన యువతులు కొందరు కనిపించారు. ప్రకవక్తను గురించి వారు ఆ యువతుల్ని అడిగారు. అందుకు సమాధానంగా మతపరమైన సమావేశం ఒకటి జరగబోతుందని, ప్రకవ అప్పటికే వచ్చి ఉన్నాడని, “ఉన్నత స్థలమందు ” బలి అర్పణ జరగనున్నదని తదనంతరము బలి అర్పణ విందు జరగనుందని ఆ యువతులు చెప్పారు. సమూయేలు ఏలుబడిలో గొప్ప మార్పు చోటు చేసుకొన్నది. సమూయేలుకి మొదటగా దేవుని పిలుపు వచ్చి కాలంలో గూడార సేవల పట్ల ప్రజలకు నిర్లక్ష్య వైఖరి ఉండేది. “జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుట” జరిగేది 1 సమూయేలు 2:17 కాని ఇప్పుడు దేశమంతటా దైవారాధనలు జరిగేవి. మతపరమైన సమావేశాల పట్ల ప్రజలు వెళ్ళేవారు. ఆ స్థలాలే బలి అర్పణల కోసం ఎంపిక అయ్యేవి ఈ పట్టణాల్లోని అత్యున్నత స్థలాల్ని బలి అర్పణలకు సాధారణంగా ఎంపిక చేసేవారు. అందువల్ల వాటిని “ఉన్నత స్థలములు” అని పిలిచారు. PPTel 613.4
పట్టణ ద్వారం వద్దే సౌలు ప్రవక్తను కలవటం జరిగింది,. ఇశ్రాయేలీయుల రాజుగా ఎంపికైన వ్యక్తే. ఆసమయంలో తనను కలుసుకొంటాడని దేవుడు సమూయేలుకి బయలుపర్చాడు. వారిప్పుడు ముఖాముఖి నిలబడి ఉండగా ప్రభువు సమూయేలుతో ఇలా అన్నాడు.” ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలును”. PPTel 614.1
“దీర్ఘదర్శి ఇల్లు ఏది”? అన్న సౌలు ప్రశ్నకు “నేనే దీర్ఘదర్శిని” అని సమూయేలు బదులు పలికాడు. తప్పిపోయిన జంతువులు దొరికాయని అతడికి చెప్పి విందుకు హాజరుకమ్మని అర్థించాడు. అదే సమయంలో తనకు గొప్ప భవిష్యత్తుందని కూడా సౌలుకి సమూయేలు చెప్పాడు. “ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటివారి యందును గదా అనెను”. ప్రవక్త పలికిన మాటలకు సౌలు హృదయం సంతోషంతో నిండింది. ఆ మాటల ప్రాముఖ్యాన్ని గుర్తించాడు. రాజు కావాలని ప్రజలు కోరుతున్న విషయం దేశమంతా తెలిసిపోయింది. అయినా ఒకింత సిగ్గుతో తన్ను తాను తగ్గించుకొంటూ సౌలిలా అన్నాడు, “నేను బాన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారిందరలిలో అల్పులు కారా? నాతో ఎందుకు ఈలాగున పలుకుచున్నావు”? PPTel 614.2
అంతట సమూయేలు సౌలును ఆ పుర ప్రముఖలు సమావేశమై ఉన్న స్థలానికి తీసుకొని వెళ్ళాడు. ప్రవక్త సూచన మేరకు ఆ సమావేశంలో సౌలుకు అగ్రస్థానం ఇచ్చారు. విందులో ఉత్తమ భోజనం అతడికి వడ్డించారు. సమావేశం అనంతరము అతిథిని సమూయేలు తన నివాస గృహానికి తీసుకువెళ్ళి మేడపై అతడితో మాట్లాడాడు. ఇశ్రాయేలీయుల ప్రభుత్వ స్థాపనకు పునాదిగా ఉన్న సూత్రాల్ని వివరించి తాను అక్రమించనున్న ఉన్నత బాధ్యతకు అతణ్ణి సన్నిద్దం చెయ్యటానికి ప్రయత్నించాడు. PPTel 614.3
మరుసటి వేకువ జామునసౌలు వెళ్ళిపోతున్న తరుణంలో ప్రవక్త అతణ్ణి సాగనపంటానికి వెళ్ళాడు. పట్టణ శివార్లుకు వెళ్ళాక ముందుకి నడమవని సేవకుణ్ణి ఆదేశించాడు. “అప్పుడు సమూయేలూ తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలమ పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించియున్నాడు” అని చెప్పాడు. ఇది దైవాధికారం వల్ల జరిగిన కార్యమనటానికి నిదర్శనంగా తాను ఇంటికి వెళ్ళే మార్గములో చోటచేసుకొనే కొన్ని ఘటనల్ని ముందే తెలిపి తన ముందున్న బాధ్యతను నిర్వర్తించటానికి పరిశు ద్దాత్మ తనను సమర్ధుణ్ణ్ని చేస్తాడని సౌలుకి భరోసా ఇచ్చాడు. ‘ యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చను.” “నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుడు నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దానిని చేయుము” అన్నాడు ప్రవక్త. PPTel 615.1
సౌలు తిరిగి వెళ్తున్నప్పుడు ప్రవక్త చెప్పినట్లే అంతా జరిగిపోయింది. బెన్యామీను సరిహద్దులకు రాగానే తప్పిపోయిన జంతువులు దొరికాయన్న వార్త వినవచ్చింది. PPTel 615.2
బేతేలు వద్ద దేవుని ఆరాధించటానికి వెళ్తున్న ముగ్గురు మనుషుల్ని తాబోరు మైదానంలో సౌలు కలుసుకున్నాడు. ఒకడు బలి అర్పించటానికి గాను మూడు మేక పిల్లల్ని మోసుకు వెళ్తున్నాడు. ఇంకొకడు మూడు రొట్టెల్ని మూడోవాడు ఒక ద్రాక్షారసం తిత్తిని బలి అర్పణ విందుకు తీసుకువెళ్తున్నారు. వారు సౌలును యాధావిధిగా పలకరించి ఆ మూడు రొట్టెల్లోనూ రెంటిని అతడికిచ్చారు. తన సొంత పట్టణం గిబియాలో “ఉన్నత స్థలము” నుంచి వస్తున్న ప్రవక్తల బృందం సన్నాయి సీతారా స్వర మండాలాలతో దేవుని స్తుతిస్తూ పాటలు పాడుతున్నారు. సౌలు వారిని సమిపించినప్పుడు అతడి మీదకి కూడా దేవుని ఆత్మ రాగా సౌలు వారితో గళం కలిపి పాడుతూ ప్రవిచించాడు. సౌలు ఎంతో సరళంగాను జ్ఞానయుక్తంగాను మాట్లాడాడు. ఎంతో చిత్తశుద్ధితో ఆ ఆరాధనలో పాలు పొందాడు. అది చూసినవారు అతణ్ని ఎరిగినవారు విస్మయంతో ఇలా వ్యాఖ్యానించారు. “కీషు కుమారునికి సంభవించినదేమేటి ? సౌలును ప్రవక్తలలోనున్నాడా”? PPTel 615.3
సౌలు ప్రవక్తలతో ఏకమై దైవారాధనలో పాలు పొందుతుండగా పరిశుద్దాత్మ అతడిలో గొప్ప మార్పు కలిగించాడు. దైవ పవిత్ర పరిశుద్దత చీకటితో నిండిన స్వాభావిక హృదయంపై ప్రకాశించి ఆ చీకటిని తరిమి వేసింది. దేవుని ముందు ఉన్న రీతిగానే తన్ను తాను చూడగలిగాడు. పరిశుద్ధత సౌందర్యాన్ని చూసాడు. ఇప్పుడు పాపం పైన సాతాను పైన పోరు సల్పటానికి పిలుపుపొందాడు. ఈ పోరులో తన శక్తి సంపూర్తిగా దేవుని వద్ద నుంచే వస్తుందని గుర్తించాడు. గతంలో అస్పష్టంగా అనిశ్చితంగా కనిపించిన రక్షణ ప్రణాళిక ఇప్పుడతడికి స్పష్టంగా గ్రాహ్యమయ్యింది. ఉన్నత బాధ్యత నిర్వహణకు కావలసిన ధైర్యం వివేకం ప్రభువు అతడికి అనుగ్రహించాడు. శక్తికి, కృపకు మూలాన్ని అతడికి బయలుపర్చాడు. దైవ నిబంధనల్ని వాటి విషయంలో అతడి విధుల్ని గూర్చి అతడికి అవగాహన కలిగించాడు. PPTel 616.1
సౌలు రాజుగా అభిషేకం పొందటాన్ని ప్రజలకు తెలియనివ్వలేదు. దేవుని ఎంపిక చీట్లు వేయుటం ద్వారా బహిర్గతం కావాల్సి ఉంది. ఇందు నిమిత్తం సమూయేలు ఒక సమావేశాన్ని మిస్సాలో ఏర్పాటు చేసాడు. దేవుని నడుపుదలను యోచిస్తూ ప్రార్ధన చేసారు. అనంతరం ఓట్లు వేసే గంభీరం ప్రక్రియ ప్రారంభమయ్యింది. సమావేశమైన జనులు ఉత్కంఠంతో నిశ్శబ్దంగా వేచి ఉన్నారు. ఫలితం కోసం గోత్రాన్ని వంశాన్ని కుటుంబాన్ని పేర్కొటం జరిగింది. ఆ తరువాత కీషు కుమారుడు సౌలును ఎంపికైన వ్యక్తిగా పేర్కొటం జరిగింది. అయితే సౌలు ఆ సమావేశంలో లేడు. తన భుజాల పై పడనున్న పెనుభారం గురించి ఆలోచిస్తూ అతడు ఒక రహస్య స్థలంలో ఉన్నాడు. అతణ్ణి సభలోకి తీసుకువచ్చారు. ‘ భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటే ఎత్తుగలవాడు” అయిన అతడు రాజఠీవి గలవాడు చక్కని అకృతి ఉన్నవాడు అని అందరూ ప్రశింసించారు. అతణ్ణి సభకు పరిచయం చేస్తున్నప్పుడు సమూయేలు సైతం ఇలా అన్నాడు ” యెహోవా ఏర్పరచిన మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడొకడును లేడు”. దానికి ప్రతిస్పందిస్తూ ఆ మహాసభలోని జనులందరూ “రాజు చిరంజీవియుగుకా” అంటు సంతోషముతో కేకలు వేసారు. PPTel 616.2
అప్పుడు సమూయేలు “రాజ్యపాలన పద్దతిని” ప్రజలకు వివరించాడు. రాజు స్వామ్య ప్రభుత్వ సూత్రాల్ని వివరించి వాటి ప్రకారం పరిపాలనను సాగాల్సి ఉందని ప్రజలకు విశధీకరించాడు. రాజు నిరంకుశాధికారాన్ని చెలాయించరాదు. దేవుని చిత్తానికి లోబడి రాజుపరిపాలన చేయాలి. ఈ ఉపన్యాసాన్ని గ్రంథములో లిఖించారు. రాజు అధిక్యతలు హక్కులు ప్రజల హక్కులు అధిక్యతలు అందులో వివరంగా దాఖలయ్యాయి. ప్రజలు తన హెచ్చరికను తృణీకరించినప్పటికి వారి కోర్కెల్ని మన్నించాల్సి వచ్చినప్పుడు నిజాయితీ పరుడైన సమూయేలు ప్రవక్త వారి స్వేచ్చల్ని కాపాడటానికి తన శక్తి మేరకు కృషి చేసాడు. PPTel 616.3
సాధారణంగా ప్రజలు సౌలుని రాజుగా అంగీకరించటానికి సిద్ధంగా ఉన్నప్పటికి ఒక పెద్ద వర్గం రాజును వ్యతిరేకించింది. అతి పెద్దదైన యూదా ఇఫ్రాయీము గోత్రాల్ని పక్కన పెట్టి ఇశ్రాయేలీయుల్లో అతి చిన్నదైన బెన్యామీను గోత్రం నుండి రాజును ఎంపిక చేయటం ప్రజలికి మింగుడు పడలేదు. సౌలు పట్ల తమ విశ్వాసాన్ని ప్రకటించటానికి సంప్రదాయబద్దమైన బహుమతులు సమర్పించటానికి వారు నిరాకరించారు. రాజు కావాలని గట్టిగా డిమాండు చేసిన ప్రజలే ఇప్పుడు దేవుడు నియమించిన వ్యక్తిని కృతజ్ఞతతో అంగీకరించే బదులు తిరస్కరిస్తున్నారు. ప్రతీ వర్గానికి తమ తమ అభ్యర్థులు ఉన్నారు. వారినే సింహాసనం ఎక్కించాలన్నది వారు తాపత్రం. అంతేకాదు చాలామంది నాయకులు తామే రాజు కావాలన్న ఆశతో పావులు కదుపుతున్నారు. కొందరి గుండెల్లోనైతే అసూయ ఈర్ష్య నెగళ్ళు రగుల్తున్నాయి. గర్వం అత్యాశవల్ల జరిగిన యీ ప్రయతాలన్నీ నిరాశ అసంతృప్తులు గానే మిగిలిపోయాయి. PPTel 617.1
ఈ పరిస్థితుల్లో రాచరికాన్ని చేపట్టం సౌలుకి సుతరామ ఇష్టం లేదు. ప్రభుత్వ పరిపాలనను మునపటిలా సమూయేలుకి విడిచి పెట్టి గిబియాకు తిగిరి వెళ్ళిపోయాడు. అతడి ఎంపిక దేవుని వల్ల జరిగిన విషయాన్ని గుర్తించిన కొందరు సౌలు వెంట ఉండి అతడికి అండదండలదించాలని నిశ్చయించుకున్నారు. సింహాసనం పై తన హక్కును బలప్రయోగం ద్వారా కాపాడు కోవటం కోసం సౌలు అభిమతం కాదు. రాజ్యాధికారం సంగతి పూర్తిగా దేవునికి విడిచి పెట్టి బెన్యామీను భూబాగంలోని తన పొలంలో వ్యవసాయ పనుల్లో తలమునకలై ఉన్నాడు. PPTel 617.2
సౌలు రాజుగా నియుక్తుడైన కొద్దికాలంలోనే అమ్మోనీయులు తను రాజు నాహోషు నాయకత్వం కింద యోర్దానుకి తూర్పున ఉన్న గోత్రాల పై దాడి చేసి యాబేఫిలాదు పట్టణాన్ని బెదిరించారు. ఆ పట్టణవాసులు ఆమ్మోనీయులకు సామంతులుగా ఉంటామంటూ వారితో సంధికి ప్రయత్నించారు. క్రూరుడైన ఆ రాజు సంధికి అంగీకరించలేదు. సంధికి ఒక షరతు పై ఒప్పుకొన్నాడు. తాను వారిలో ప్రతీ ఒక్కరి కుడి కన్నూ తీసేయటానికి వారు ఒప్పుకోవాలన్నదే ఆ షరతు. ఆవిధముగా వారు అతడి శక్తి ప్రాబల్యాలకు నిత్యమూ సాక్షులుగా ఉంటమే అతడి అభిమతం. PPTel 617.3
ముట్టడికి గురి అయిన ఆ పట్టణ నివాసులు ఏడు రోజుల వ్యవధికి మనవి చేసారు. తమ విజయానికి మరింత ప్రచారం లభించేందుకు ఆమ్మోనీయులు ఈ మనవిని అంగీకరిచారు. యోర్ధానకు పశ్చిమాన ఉన్న గోత్రాలవారి సహాయాన్నర్ణిస్తూ యాబేషు నుండి వెంటనే దూతల్ని పంపించారు. ఆ వార్తను గిబియాకు అందజేయగా అక్కడ భయాందోళనలు రాజ్యమేలాయి, రాత్రిపూట పొలం నుంచి ఎడ్లను తోలుకొస్తున్న పౌలు పెద్ద విప్పత్తునుగూర్చిన ఏడ్పును విన్నాడు. ‘జనులు ఏడ్చుటకు హేతువేమి”? అని ప్రశ్నించాడు. సిగ్గుకరమైన ఆ కథనం విన్నప్పుడు అతడిలో నిద్రిస్తున్న శక్తులు మేల్కొన్నాయి. “దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను... ఒక కాడి ఎడ్లను తీసి తనుకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతలచేత వాటిని పంపి సౌలుతోను సమూయేలుతోను చేరకుండ వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదని వర్తమానము చేసెను”. PPTel 618.1
బెజెకు మైదానంలో సౌలు నాయకత్వం కింద మూడు లక్షల ముప్పయి వేలమంది సమావేశమయ్యాడు. మరుసటి దినాన అనగా వారు ఆమ్మోనీయులకు లొంగిపోవలసిన దినాన సహాయం వస్తున్నదని ముట్టడి జరిగిన పట్టణ ప్రజలకు దూతల ద్వారా వర్తమానం పంపాడు సౌలు. రాత్రిపూట వేగంగా నడిచి యోర్దాను నదిని దాటి “తెల్లవారు సమయమున” యాబేషు పట్టణం ముందు నిలిచారు. గిద్యోనుకుమల్లే తన సైన్యాన్ని మూడు గుంపులుగా విభజించి సౌలు ఆమ్మోనీయుల శిబిరం మీద పడ్డాడు. అపాయం పొంచి ఉందని అనుమానించి వారు దాడికి సిద్ధముగా లేరు. భయంతో నిండిన ఆమ్మోనియుల్నీ వారు హతమర్చారు. ‘వారిలో మిగిలినవారు ఇద్దరేసి కూడా పోజాల కుండ చెదిరిపోయింది. PPTel 618.2
సౌలు ప్రదర్శించిన చొరవ, సాహాసం, అంత పెద్ద సేవను నడిపించి విజయం సాధించటంలో కనపర్చిన దక్షత ఇవే ఇశ్రాయేలీయులు తమ రాజులో కోరుకున్న గుణ లక్షణాలు, ఇతర జాతులు ప్రజల్ని జయించేందుకు ఈ గుణలక్షణాల్ని వారు ఆశించారు. ప్రజలు సౌలును రాజుగా ఇప్పుడు అభినందించారు. ఆ విజయానికి మానవ సాధనాల్ని ప్రసశించారు. దేవుని ప్రత్యేక దీవెన తమపై లేకపోతో తమ ప్రయత్నాలు వ్యర్ధమై ఉండేవని వారు గుర్తించలేదు. సౌలు అధికారాన్ని గుర్తించటానికి నిరాకరించినవారిని చంపాలని ఉద్వేగంతో నిండిన కొందరు మొట్ట మొదట ప్రతిపాదించారు. అయితే రాజు కలుగజేసుకొని ఇలా అన్నాడు. “నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనుష్యునిని మీరు చంపవద్దు”. సౌలు ప్రవర్తనలో కలిగిన మార్పుకు ఇది నిదర్శనం. గౌరవాన్ని తానే పొందే బదులు ఆ మహిమను దేవునికి చెల్లించాడు. ప్రతీకారం తీర్చుకొనేందుకు ప్రయత్నించే బదులు దయ చూపించే స్వభావాన్ని క్షమాగుణాన్ని ప్రదర్శించాడు. తన హృదయంలో దైవ కృప నివసిస్తున్నదనటానికి ఇదే స్పష్టమైన నిదర్శనం, PPTel 618.3
ఇశ్రాయేలీయుల రాజ్యం ప్రజల సమక్షంలో సౌలుకు ధ్రువ పర్చేందుకు గిలులో ఒక జాతీయ సమావేశం ఏర్పాటుకు సమూయేలు ప్రతిపాదించాడు. అలాగే ఆ సమావేశం జరిగింది. “వారు యెహోవా సన్నిధిని సమాధాన బలులును అర్పించి యెహోవా సన్నిధిని సౌలుకు పట్టాభి షేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులందరును అక్కడ బహుగా సంతోషించిరి. PPTel 619.1
వాగ్దాత్త దేశంలో ఇశ్రాయేలీయలు మొట్టమొదటిగా శిబరిం వేసిన స్థలం గిల్గాలు యోధాను నదిని అద్భుత రీతిగా దాటటాన్ని గుర్తు చేయటానికి దేవుని ఆదేశం మేరకు యెహోషువ పన్నెండు రాళ్ళతో స్థంభాన్ని నిర్మించింది ఇక్కడే. సున్నతి ఆచారం నీవీకృతమయ్యింది ఇక్కడే. కాదేషు వద్ద పాపం, అరణ్య సంచారం దరిమిలా వారు మొదటి పస్కాను ఆచరించింది ఇక్కడే. మన్నా కురవటం ఆగిపోయింది ఇక్కడే. యెహోవా సేనాధిపతి ఇశ్రాయేలీయుల సైన్యానికి ప్రధానాధిపతిగా తన్ను తాను ప్రత్యక్ష పర్చుకొన్నది ఇక్కడే. ఎరికో పట్టణాన్ని హాయి పట్టణాన్ని నాశనం చెయ్యటానికి వారు బయలుదేరింది ఇక్కడ నుంచే, ఆకాను తన పాప ఫలితాల్ని అనుభవించింది ఇక్కడే. దేవునితో సంప్రదించకుండా ఇశ్రాయేలీయులు ఏ ఒప్పందం గిబియోనీయులతో చేసుకొని శిక్షపొందారో ఆ ఒప్పందం జరిగింది ఇక్కడే ఎన్నో మధుర స్మృతుల్ని మనసుకు తెచ్చే ఆ మైదానంలో సమూయేలు సౌలు నిలబడి ఉన్నారు. రాజును స్వాగతిస్తూ ప్రజలు వేస్తున్న కేకలు సద్దుమణిగిన తరువాత ప్రజల పరిపాలకుడుగా ఆ వృద్ధ ప్రవక్త తన వీడ్కొలు పలుకులు పలికాడు. PPTel 619.2
“అలకించుడి, మీరు నాతో చెప్పిన మాటనంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించియున్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరసిన ముసలివాడను.... బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చితిని. ఇదిగో నేనున్నాను; నేనెవని యొద్దునైన తీసుకొంటినా? ఎవనినైన బాధ పెట్టితినా? న్యాయము నాకు అగపడకుండ ఎవని యొద్దనైన లంచము పుచ్చుకొంటినా? అలాగు చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించినవాని యెదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ యెదుట దానిని మరల నిత్తుననెను”. PPTel 619.3
ప్రజలు ముక్తకంఠంతో ఇలా పలికారు. “నీవు మాకు ఏ అన్యాయమ్నును ఏ బాధనైనను చేయలేదు; ఏ మనుష్యుని యొద్దగాని నీవు దేనినైనను తీసుకొనలేదు”. PPTel 620.1
సమూయేలు తన మార్గాన్ని సమర్ధించుకోవటానికి ప్రయత్నించటం లేదు. రాజుకి ప్రజలకు వర్తించే సూత్రాల్ని లోగడ విశదీకరించాడు. ఆ మాటలకి తన సొంత ఆదర్శాన్ని జోడించాలని భావించాడు. దేవుని సేవతో అతడికి చిన్ననాటి నుంచి సంబంధము ఉంది. తన సుదీర్ఘ జీవితంలో తన గురి ఒక్కటే - దేవునికి మహిమ, ఇశ్రాయేలీయుల విశాల హితం. తమ ప్రగతి గూర్చిన యోజనకు ముందు ఇశ్రాయేలీయులు తమ పాపాల నిమిత్తం దేవునికి పశ్చాత్తాపం వెలిబుచ్చటం అసవరం. పాపం ఫలితంగా వారు దేవుని పై విశ్వాసాన్ని కోల్పోయారు. దేశాన్ని పరిపాలించటానికి అయనకు గల శక్తిని జ్ఞానాన్ని గూర్చిన అవగాహనము కోల్పోయారు. తన కార్యం యదార్ధతను నిరూపించుకోవటానికి ఆయన సామర్ధ్యంపై నమ్మకాన్ని కోల్పోయారు. నిజమైన సమాధానాన్ని కనుగొనకముందు వారు తాము చేసిన పాపాన్ని గుర్తించి దాన్ని ఒప్పుకోవాలి. “మాకు న్యాయము తీర్చును. మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించును” అన్నదే రాజును కోరటంలోని తమ ఉద్దేశమని వారు వెలువరించరు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి తీసుకొనివచ్చిన నాటి నుండి వారి చరిత్రను సమయేలు సమీక్షించాడు. రాజులకు రాజైన యెహోవా వారిముందు నడిచి వారి యుద్దాల్ని ఆయనే చేసాడు. తరుచు వారి పాపాలే వారిని శత్రువుల చేతికి అప్పగించాయి. కాని వారు తమ పాపాల్ని విడిచి పెట్టిన వెంటనే కృపామయుడైన దేవుడు ఒక విమోచకుడ్ని లేపేవాడు. ప్రభువు గిద్యోనను బారాకును ‘యెఫ్తాను సమూయేలును పంపి నలుదిశల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు”. అయినా అపాయం ఏర్పడ్డ సమయంలో “మీ దేవుడైన యెహోవా మీకు రాజైయున్నాడు” అని ప్రవక్త అన్నప్పుడు “ఒక రాజు మమ్మును ఏలవలెను” అన్నదే వారి డిమాండు. PPTel 620.2
“మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కని పెట్టుడి. గోధము కోత కాలము ఇదేగదా? మీరు రాజును నిర్ణయంపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమును ఉరుములను వర్షమును” పంపాడు. మే, జూన్ మాసాలు గోధముల కోత కాలం. తూర్పున ఈ కాలంలో వర్షం పడేది కాదు. ఆకాశంలో మేఘాల్లేవు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. కాబట్టి ఈ కాలంలో భీకర తుఫాను అందరిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ప్రజలు దీన మనస్కులై తమ పాపాన్ని ఒప్పుకొన్నారు. అది తాము చేసిన నిర్దిష్టమైన పాపం. “రాజును నియమించుమని మేము అడుగుటచేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేమ మరణము కాకుండ నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్ధించుము”. PPTel 620.3
నిరుత్సాహపడ్డ ప్రజల్ని ఆ స్థితిలోనే ఉంచలేదు సమూయేలు. ఎందుకంటే మెరుగైన జీవితానికి కృషి చేయకుండా అది వారికి అడ్డు తగిలేది. కఠినాత్ముడుగా, క్షమాగుణం లేని వాడుగా దేవుణ్ణి పరిగించటానికి సాతాను వారిని నడిపించేవాడు. ఇలా వారు అనేక శోధనలకు గురి అయ్యేవారు. దేవుడు కారుణ్యమూర్తి క్షమాశీలి. తన స్వరాన్ని విని నడుచుకొనే తన ప్రజలకు ఉపకారాలు చేయటానికి అభిలషించే వాడు. తన సేవకుడి ద్వారా వారికి దేవుడిచ్చి సమధానం ఇది: “భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. అయినను యెహోవాను విసర్జించకుండ ఆయనను అనునసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి, ఆయనన విసర్జించువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే... తన జనములను ఆయన విడనాడడు”. PPTel 621.1
తనక జరిగి అవమానం గురించి సమూయేలు పల్లెత్తు మాట పలకలేదు. తన యావజ్జీవితాన్ని ధారపోసి ఇశ్రాయేలీయులకు చేసిన సేవకు వారు చూపించి కృతజ్ఞత గురించి వారిని నిందించలేదు. వారి పట్ల తనకు నిత్యము ప్రేమానురాగా లుంటాయని వాగ్దానం చేసాడు. “నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్ధన చేయుట మానుట వలన యెహోవాకు దూరముగును గాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము. మీరు కీడు చేయువారైతే తప్పకుండ మీరును మీ రాజును నాశనమగుదురు”. PPTel 621.2