Go to full page →

రాతి నేలల్లో COLTel 25

“రాతి నేలను విత్తబడువాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాననంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచునుగాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును”. COLTel 25.3

రాతి నేలలో చల్లిన విత్తనానికి లోతైన మన్ను ఉండదు. మొక్క త్వరగా పైకి వస్తుంది. కాని దాని పెరుగుదలకు అవసరమైన పోషకాల కోసం వేరు రాతిలో నుంచి కిందకి వెళ్ళలేదు. కనుక అది త్వరలోనే ఎండిపోతుంది. మతాన్ని నామమాత్రంగా స్వీకరించే అనేక మంది రాతినేల శ్రోతలు, మట్టి పొర కింద ఉన్న రాయిలా స్వాభావిక హృదయం తాలూకు స్వార్ధాశ వారి పదభిప్రయాల మన్ను క్రింద దాగి ఉంటుంది. వారి స్వార్ధాశ చావలేదు. వారు పాపం తాలూకు నీచత్వాన్ని చూడలేదు. పాప దోష స్పృహ వల్ల వారి హృదయం దీనమనస్సులేదు. ఈ తరగతి ప్రజలు సులభంగా మారిపోతారు. భవిష్యత్తు గల విశ్వాసులుగా కనిపిస్తారు. అయితే వారిది లోతులేని పై పూత మతం మాత్రమే. COLTel 26.1

మనుష్యులు వాక్యాన్ని వెంటనే స్వీకరించడంగాని దాన్ని ఆనందించడం గాని వారు పడిపోవటానికి కారణం కాదు. మత్తయి రక్షకుని పిలుపు విన్న వెంటనే లేచి సర్వస్వం విడిచి పెట్టి ఆయన్ని వెంబడించాడు. మనకు దైవ వాక్యం వచ్చిన వెంటనే మనం దాన్ని స్వీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యాన్ని సంతోషంగా స్వీకరించడం న్యాయం. “మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును.” లూకా 15:7క్రీస్తుని విశ్వసించే ఆత్మలో సంతోషం ఉంటుంది. కాని ఉపమానంలో వాక్యాన్ని వెంటనే స్వీకరించే వారిగా సూచించబడ్డవారు దాని పర్యవసానం గురించి ఆలోచించరు. దైవ వాక్యం తమను ఏమి కోరుతున్నదో వారు పరిగణించరు. తమ అలవాట్లు అభ్యసాల్ని దాని ప్రకారం మార్చుకుంటూ దాని నియంత్రణకు తమ్ముని తాము పూర్తిగా సమర్పించుకోరు. COLTel 26.2

మొక్క వేళ్ళు మట్టిలోకి లోతుగా చొచ్చుకుపోతాయి. కనిపించకుండా లోపల ఉండే వేళ్ళు మొక్కకు పోషణనిస్తాయి. క్రైస్తవ జీవితంలో ఇదే జరుగుతుంది. విశ్వాసం ద్వారా ఆత్మ క్రీస్తుతో ఆదృశ్య సంయోగం కలిగి ఉండటం వల్ల ఆధ్మాత్మికజీవితానికి పోషణ లభిస్తుంది. కాగా రాతినేల స్తోత్రలు క్రీస్తు మీద గాక తమ పై తామే ఆధారపడతారు. వారు తమ సృ్కయల్ని సదుద్దేశాల్ని నమ్ముకుని తమ స్వనీతిలో పటిష్టంగా నిలుస్తారు. వారు ప్రభువులో ఆయన శక్తి విషయంలో బలంగా ఉండరు. తనకు క్రీస్తుతో అనుసంధానం లేదు గనుక “అతనిలో వేరు” లేదు. COLTel 26.3

ధాన్యపు గింజల్ని పటిష్టపర్చి పక్వం చేసే సూర్య తాపం లోతుగా లేని వేరుల్ని మాడ్చివేస్తుంది. కనుక తనలో “వేరు” లేనివాడు “కొంతకాలము నిలుచును”, అయితే “వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతరపడును”. అనేకులు పాపం నుండి విముక్తి పొందటానికి కాక బాధ నుండి తప్పించుకోవడానికి సువార్తను స్వీకరిస్తారు. వారు కొంతకాలము సంతోషిస్తారు, ఎందుచేతనంటే మతం తమను కష్టాలు శ్రమలు కడగండ్ల నుంచి కాపాడుందని వారు భావిస్తారు. జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుంటే వారు భక్తి గల క్రైస్తవులుగా కనిపించవచ్చు. కాని శోధన అనే అగ్ని పరీక్ష వచ్చినప్పుడు వారు పడిపోతారు. వారు క్రీస్తు నిమిత్తం నిందను భరించలేరు. తాము రహస్యంగా ప్రేమిస్తున్న పాపాన్ని వాక్యం వేలెత్తి చూపించినప్పుడు వారు అభ్యంతరపడ్డారు. తమ జీవితంలో తీవ్రమైన మార్పు చేసుకోవడానికి ఎంతో శ్రమ ఎంతో కృషి అవసరమౌతుంది. వారు తమ ప్రస్తుత అసౌకర్యాన్ని శ్రమల్ని చూస్తు నిత్య వాస్తవాల్ని మర్చిపోతారు. యేసుని విడిచి పెట్టిన శిష్యుల్లా “ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడు? అంటారు. యోహా 6:60 COLTel 27.1

క్రీస్తు సేవ చేస్తున్నామని చెప్పుకునేవారు చాలామందే ఉన్నారు. అయితే వారికి ఆయనతో అనుభవం లేదు. ఆయన చిత్తం నెరవేర్చాలన్న వారి కోరిక పరిశుద్దాత్మ మూలంగా కలిగే ప్రగాఢ విశ్వాసం వల్ల గాక తమ మనోభావం వల్ల కలుగుతుంది. వారి నడవడి దైవ ధర్మశాస్త్రానికి అనుగుణంగా ఉండదు. క్రీస్తుని తమ రక్షకుడిగా అంగీకరిస్తున్నట్లు చెబుతారు కాని తమ పాపాల్ని జయించటానికి ఆయన తమకు శక్తినిస్తాడని నమ్మారు. వారికి జీవంగల రక్షకుడితో వ్యక్తిగత సంబంధము లేదు. వారి ప్రవర్తనలు వంశ పారం పర్య లోపాల్ని అలవర్చుకున్న దోషాన్ని బయట పెడ్తాయి. COLTel 27.2

పరిశుద్దాత్మ పరిచర్యకు సామాన్యంగా అంగీకారం తెలపడం ఒక విషయం. పాపాన్ని మందలించి పశ్చాత్తాపానికి పిలుపునిచ్చి ఆయన పరిచర్యను అంగీకరించటం ఇంకో విషయం. చాలామంది తాము దేవునికి దూరమయ్యామని, స్వార్ధానికి పాపానికి బానిసలమయ్యామని గ్రహిస్తారు. దిద్దుబాటుకి కృషి చేస్తారు కూడా. అయితే వారు స్వార్ధాన్ని సిలువ వెయ్యరు. తమ్ముని తాము క్రీస్తుకి సంపూర్తిగా సమర్పించుకోరు. ఆయన చిత్రాన్ని జరిగించటానికి దైవశక్తిని అన్వేషించరు. దైవ స్వరూపంలోకి మార్పు చెందటానికి సంసిద్ధత చూపరు. వారు సామాన్య రీతిలో తమ లోటుపాట్లును అంగీకరిస్తారు. కాని వారు తమ నిర్దిష్ట పాపాల్ని విడిచి పెట్టరు. ప్రతి తప్పుడు చర్యతో పాత స్వార్ధ్య స్వభావం బలోపేతమౌతుంది. COLTel 28.1

“మీరు క్రొత్తగా జన్మింపవలెను”అంటూ క్రీస్తునీకొదేముతో అన్న మాట ల్లోని సత్యాన్ని గుర్తించడమే ఈ ఆత్మలకున్న ఏకైక నీరీక్షణ. “ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు”,యెహా 3:7. COLTel 28.2

దేవుని సేవలో సంపూర్ణత్వమే నిజమైన పరిశుద్ధత. యదార్ధ క్రైస్తవ జీవితం ఇదే. క్రీస్తు మినహాయింపు లేని సమర్పణ విభజన లేని సేవ కోరుతున్నాడు. హృదయాన్ని మనసును ఆత్మను శక్తిని ఆయన కోరుతున్నాడు. స్వార్ధాన్ని విమర్శించాలి. తన కోసమే జీవించేవాడు క్రైస్తవుడు కాడు. COLTel 28.3

ప్రేమ క్రీయాచరణ సూత్రం కావాలి. పరలోకంలోను, భూలోకంలోను దైవ పరిపాలనకు మూల సూత్రం ప్రేమే. క్రైస్తవ ప్రవర్తనకు అదే పునాది కావాలి. ఇది మాత్రమే క్రైస్తవున్ని బలపర్చి స్థిరంగా ఉంచుతుంది. శ్రమలు శోధనల్ని తట్టుకోవటానికి ఇది మాత్రమే అతడికి శక్తి సామార్ద్యలిస్తుంది. ప్రేమ త్యాగంలో వెల్లడవుతుంది. విమోచన ప్రణాళిక పునాది త్యాగం. అది కొలవటానికి సాధ్యాం కానంత వెడల్పు లోతు ఎత్తు గల త్యాగం. క్రీస్తు తన సర్వస్వం మన కోసం త్యాగం చేసాడు. క్రీస్తుని స్వీకరించే వారందరూ తమ విమోయకుడి నిమిత్తం సమస్తం త్యాగం చెయ్యటానికి సిద్ధంగా ఉంటారు. ఆయన ఔన్నత్యం ఆయన మహిమను గూర్చిన ఆలోచననే వారికి అన్నింటికన్నా ప్రధానం. COLTel 28.4

మనం క్రీస్తుని ప్రేమిస్తుంటే ఆయన కోసం నివసించటానికి ఆయనకి కృతజ్ఞతార్పణులు చెల్లించటానికి ఆయన నిమిత్తం పనిచేయ్యటానికి ముచ్చట పడతాం. ఆపని సులువైనది. ఆయన నిమిత్తం మనం బాధను శ్రమను త్యాగాన్ని ఆశిస్తాం. మానవ రక్షణ పట్ల ఆయన ప్రగాఢ వాంచ విషయంలో మనం సానుభూతి కనపర్చుతాం. ఆత్మల రక్షణ నిమిత్తం ఆయనకున్న వాంఛనే మనమూ కనపర్చుతాం. COLTel 29.1

ఇదే క్రీస్తు మతం. ఇందులో ఏ కొదువ ఉన్నా ఆ మతం మోసమే. సత్యాన్ని గూర్చి సిద్దాంతం లేదా శిష్యరిక ప్రకటనలు ఆత్మను రక్షించలేదు. మనం పూర్తిగా మినహాయింపు లేకుండా క్రీస్తుకి చెందితేనే తప్ప ఆయన వారం కాము. మనుష్యులు క్రైస్తవులుగా పూర్ణ హృదయంతో జీవించకపోవడం వల్ల వారు ఉద్దేశ పరంగా బలహీనులు కోరిక పరంగా చపలలు అవుతున్నారు. స్వార్ధానికి ఇద్దరికి సేవ చేసేందుకు చేసే కృషి వ్యక్తిని రాతినేల శ్రోతను చేస్తుంది. పరీక్ష వచ్చినప్పుడు అతడు నిలువలేదు. COLTel 29.2