Go to full page →

పరిశుద్దాత్మ వరాలు COLTel 274

తన సంఘానికి క్రీస్తు అప్పగింంచే తలాంతులు ప్రత్యేకంగా పరిశు ద్దత్మ అనుగ్రహించే వరాలు దీవెనల్ని సూచిస్తున్నాయి. ‘ఒకనికి ఆత్మమూలంగా బుద్ది వాక్యములను, మరియొకనికి ఆ ఆత్మ ననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపర్చు వరములను మరియొకనికి అద్భుతకర్యాములు చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మ వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరియొకనికి భాషల అర్ధము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి”. 1 కొరి 12-8-11 COLTel 274.3

తన శిష్యుల్ని విడిచి పెట్టి వెళ్ళకముందు క్రీస్తు “వారి మీద ఊది - పరిశుద్దాత్మను పొందుడి” అన్నాడు. యెహా 20::22 ఆయన మళ్ళీ “ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను” అన్నాడు. లూకా 24:29 అయితే ఆయన ఆరోహణం అయిన తరువాత వరకూ ఈ వరాన్ని వారు పూర్తిగా పొందటం జరగలేదు. శిష్యులు విశ్వాసం ద్వారాను ప్రార్ధన ద్వారాను తమ్మును తాము పూర్తిగా ఆయన పనిచెయ్యటానికి సమర్పించుకునేవారకు పరిశుద్ధాత్మ కుమ్మరింపును పొందలేదు. ఒక విధముగా అప్పుడు పరలోక ఆస్తిని క్రీస్తు అనుచరులికి అప్పగించటం జరిగింది. “ఆయన అరోహహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను.” ఎఫె 4:8 “మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను.“ఆ ఆత్మ తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియుచ్చును కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు.”ఎఫ్ 4:7, 1 కొరి 12:11 ఈ వరాలన్ని క్రీస్తులో మనకున్నాయి. గాని అవి వాస్తవంగా మన సొంతం కావటం మనం పరిశుద్దాత్మను స్వీకరించటంపై ఆధారపడి ఉంటుంది. COLTel 275.1

పరిశుద్దాత్మను పంపుతానన్న వాగ్దానాన్ని అభినందించాల్సినంతగా వారు అభినందించలేదు. దాని నెరవేర్పున గుర్తించాల్సినంతగా గుర్తించలేదు. పరిశుద్దాత్మ లేకపోవటం సువార్త పరిచర్యను శక్తిహీనం చేస్తుంది. జ్ఞానం ప్రతిభ, వాగ్దాటి, స్వాభావికమైన లేక సముచితమైన ప్రతి వరము ఉండవచ్చు. కాని దేవుని ఆత్మలేనప్పుడు ఏ హృదయం స్పందించటం, ఏపాపీ క్రీస్తుని స్వీకరించటం జరగదు, అయితే తాము క్రీస్తుతో సంబంధం కలిగి ఉంటే తమకు ఆత్మ వరాలు ఉంటే, ఆయన శిష్యుల్లో అతి పేదవారు, మిక్కిలి అజ్ఞానుల హృదయాల్ని చలింపజేసే శక్తిని కలిగి ఉంటారు. లోకంలో గొప్ప ప్రభావం కలిగి పనిచేసే సాధనాలుగా దేవుడు వారని తయారు చేస్తాడు. COLTel 275.2